Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
టీజేజ్ లో ముఖంపై రంధ్రాలు...?

1. ముందుగా ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. రెండు టీ స్పూన్ల ఆపిల్ సీడర్ వెనిగర్ లో కాటన్ బాల్స్ ని ముంచి ముఖమంతా తుడిచి 20 నిమిషాల తర్వాత తిరిగి గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇది మంచి స్కిన్ టోనర్‌లా పనిచేయడమే కాకుండా దీన్ని క్రమం తప్పకుండా రెండు వారాలపాటు ఉదయం, సాయంత్రం చేస్తే ముఖంపైన జిడ్డు, రంధ్రాలు, మొటిమల తాలూకు నల్లమచ్చలు, యాక్నే సమస్య లు తగ్గి చర్మం కాంతివంతంగా ఉంటుంది.
2. ప్రతీ రెండు రోజులకోసారి ముఖానికి ఆవిరిపట్టాలి. దీని వల్ల ముఖంపై మొటిమలు రాకుండా వుంటాయి. అంతే కాకుండా ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాలు పూర్తిగా తెరుచుకుని ఆయిల్ కణాలు కరిగిపోతాయి. ముఖానికి ఆవిరి పట్టడం పూర్తయిన తర్వాత చల్లని నీళ్ళతో ముఖం కడుక్కోవాలి. దీని వల్ల తెరుచుకున్న చర్మ కణాలు తిరిగి మూసుకుపోతాయి.
3. అందం, ఆరోగ్యాలనిచ్చే ఏకైక సాధనం మంచి నీరు. మంచినీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరాన్ని శుద్ధి చేసి మొటిమలు రాకుండా కాపాడుతుంది. దాంతో రంధ్రాలు ఏర్పడకుండా ఉంటాయి.
4. గోరు ఉప్పు నీటితో రోజూ ఉదయం, సాయంత్రం ముఖం కడగండి. దుమ్ము, మురికి దరిచేరుకుండా చేస్తుంది.
5. పొప్పడి పండు గుజ్జును మర్దనా చేస్తే మొటిమలు వాటి తాలూకు మచ్చలు పోగొట్టడమే కాదు, ముఖానికి నునుపుగా ఉంచుతుంది.
6. రోజ్ వాటర్ ను తీసుకుని, అంతే మోతాదులో కీర పేస్ట్ ను నిమ్మరసంలో కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత కడిగేయాలి. ఈ మిశ్రమం మొటిమలపై ప్రభావం చూపుతుంది.
7. క్యారెట్ జ్యూస్ ముఖానికి మర్దనా చేయడం వల్ల ముఖంపై మొటిమలను, వాటి తాలూకు మచ్చలను పోగొట్టవచ్చు.
8. కొంచెం పసుపుకు ఒక టీస్పూన్ హనీ కలిపి కొంచెం పసుపుకు ఒక టీస్పూన్ హనీ కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 15 నుంచి 20 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల మొటిమల బారి నుంచి బయటపడవచ్చు.



Click it and Unblock the Notifications
