Latest Updates
-
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.!
స్ర్కబ్బింగ్ తో కళకళలాడే చర్మ పునరుజ్జీవనం...!

ఒకప్పటి కాలంలో ప్రతివారం సున్నిపిండితో శరీరానికి నలుగు పెట్టి చక్కగా తలంటి పోసుకునేవారు.ఆ సమయంలో స్క్రబ్ గా సున్నిపిండి ఉపయోగపడేది. ఇప్పుడు ఎవరికీ అంత సమయం లేకపోవడం వల్ల బ్యూటీపార్లర్ల మీదనో లేక మార్కెట్లో అందుబాటులో ఉన్న ఉత్పత్తుల మీదనో ఆధారడుతున్నారు. చక్కెర, ఉప్పు, తవుడు, జోజోబా మొలకలు, కాఫీ గింజల పొడి వంటివన్నీ కూడా చర్మంపై ఉన్న మృత కణాలను తొలగిస్తాయి. దీనితో చర్మం మృదువుగా, యవ్వనవంతంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా చర్మం పై పొర మృతకణాలకు వేదికగా ఉంటుంది. అయితే వారానికి ఒకసారో, రెండుసార్లో స్క్రబ్‌ను ఉపయోగించడం వల్ల అవి తొలగిపోయి చర్మం ఆరోగ్యంగా కనుపిస్తుంది. స్క్రబ్ చేసుకోవడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగడమే కాదు సెల్యులైట్‌ను తగ్గించి, చర్మ రంధ్రాలను శుభ్ర పరచడమే కాకుండా పెచ్చులు లేకుండా చేస్తుంది. ఒకమాటలో చెప్పాలంటే స్క్రబ్ చర్మాన్ని పునరుజ్జీవింపచేస్తుంది.
స్క్రబ్బింగ్ ముఖానికి చేసుకున్నా, శరీరానికి చేసినా తర్వాత ఆ భాగాన్ని నీటితో కడుక్కోవడం చాలా ముఖ్యం. స్క్రబ్ చేసే సమయంలో తొలగిన మృతకణాలు చర్మంపైనే ఉండకుండా దానివల్ల తొలగిపోతాయి. స్క్రబ్ వల్ల కలిగే పెద్ద లాభం ఏంటంటే కాలుష్యం, దుమ్ము ధూళిలో తిరగడం వల్ల వచ్చే స్కిన్ టాన్ ఇట్టే తొలగిపోతుంది. అంతేకాదు చర్మపు గరుకుదనం పోయి మెత్తగా, మృదువుగా మారుతుంది.
స్ర్కబ్బింగ్ అనేది ఏలా పనిచేస్తుందంటే స్పా ట్రీట్‌మెంట్లలో బాడీ స్క్రబ్ అనేది కీలకం. ఒకరకంగా చెప్పాలంటే నలుగు పెట్టడమేనన్నమాట. స్పాలలో స్క్రబ్ చేసిన తర్వాత సాధారణంగా ఏదైనా తైలంతో శరీరానికి మసాజ్ చేస్తారు. దీనితో చర్మం చాలా విశ్రాంతి పొంది మిలమిలా మెరుస్తుంది. ఎవరైనా ప్రొఫెషనల్ ఈ పని చేయాలంటే 30-45 నిమిషాలు పడుతుంది. అత్యవసరం అనుకుంటే ఆ పనిని అరగంటలో కానిచ్చుకుని, శరీరానికి సన్ స్క్రీన్ కలిగిన మాయిశ్చరైజర్ రాసుకుని వెళ్ళిపోవచ్చంటారు స్పా నిర్వాహకులు.



Click it and Unblock the Notifications
