Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సహజ చర్మ సౌందర్యం ఇలా సొంతం...!

సహజ పీలింగ్ ఏజెంట్ గా పనిచేసే బొప్పాయి. మొటిమల తాలూకు మచ్చల్ని సులువుగా నివారిస్తుంది. బాగా మగ్గిన బొప్పాయి పండు గుజ్జులో రెండుచుక్కల తేనె, కొద్దిగా పాలమీగడ కలిపి ముఖానికి పూతలా వేయాలి. పదిహేను నిమిషాలయ్యాక కడిగేయాలి. చర్మం మృదుత్వాన్ని సంతరిచుకుంటుంది. ఆ సమస్య నుంచి కూడా విముక్తి లభిస్తుంది.
నిద్రలేమి, అలసట, ఇతర సమస్యల కారణంగా కళ్లు ఉబ్బినట్లు కనిపిస్తుంటాయి కొందరికి. ఇలాంటివారు గుడ్డులోని తెల్ల సొనను కళ్ల అడుగున రాసుకోవాలి. పదినిమిషాల తర్వాత కడిగేసుకుంటే ఆ సమస్య అదుపులోకి వచ్చేస్తుంది.
కాలంతో నిమత్తం లేకుండా చర్మం పొడిబారుతుంటుంది అప్పుడప్పుడు ఇలాంటివారు కొద్దిగా బాదం నూనెను చర్మానికి రాసుకుని కాసేపయ్యాక నలుగుతో కడిగేసుకోవాలి. చాలా మార్పు కనిపిస్తుంది.
తరచూ బయట తిరగడం వల్ల చర్మంపై మురికి చేరుతుంది. దీన్ని తొలగించాలంటే.. టమాటా క్లెన్సర్ చక్కని పరిష్కారం. టమాటా గుజ్జులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకుని సున్నితంగా మర్ధన చేయాలి. కాసేపయ్యాక కడిగేసుకుంటే... చర్మం శుభ్ర పడి తాజాధనాన్ని సంతరించుకుంటుంది.
అలాగే రెండుచెంచాలి తేనెలో కొద్దిగా కోడిగుడ్డు సొన కలపాలి. దీన్ని ముఖానికి రాసుకుని కాసేపయ్యాక కడిగేయాలి. అయితే ..ఈ పూత వేసుకున్నప్పుడు మాట్లాడకూడదు, నవ్వకూడదు. కదలకుండా ఉండాలి. లేదంటే తగ్గుముఖం పట్టాల్సిన ముడతల సమస్య మరింత పెరుగుతుందని మరవకూడదు.
కొందరు పాతికేళ్లకే నలభై ఏళ్ల వారిలా కనిపిస్తుంటారు. ముడతలు పడిన చరమమం దీనికి కారణం. బొప్పాయిని మొత్తని గుజ్జులా చేసుకుని అందులో కొద్దిగా వరిపిండి కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తూ ఉంటే ముడతలు తగ్గి చర్మం బిగుతుంగా మారుతుంది.
మృతకణాల్ని తొలగించాలంటే బంగాళదుంప గుజ్జులో రెండు చెంచాలి ఓట్స్, రెండు చెంచాల పాలు, రెండు చుక్కల తేనె, అరచెంచా ఆలివ్ నూనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి బాగా మర్ధన చేయాలి. తర్వాత గోరువెచ్చుని నీటితో శుభ్రం చేసుకుంటే చాలు... ఈ అన్ని రకాల చర్మతత్వాలవారికి చక్కగా నప్పుతుంది. ఇలా తరచూ చేస్తుంటే మెరిసే మేని మీ సొంతం అవుతుంది.



Click it and Unblock the Notifications