Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
చంద్రబింబంలాంటి ముఖానికి ఎంతో చలువన...!?

టమాటా: టమాటాల లోపటి గింజలు తీసి మిక్సీలో మెత్తగా గుజ్జు చేయాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో ఉంచి, కొద్దిసేపటి తర్వాత తీసి ముఖానికి పూతలా వేసుకోవాలి. ఐదారు నిమిషాలయ్యాక మర్ధన చేసి గోరువెచ్చటి నీళ్లతో శుభ్రపరచుకోవాలి. అలసట దూరమై హాయిగా అనిపిస్తుంది. మేని మృదువుగా మారుతుంది.
కలబంద పూత: ఒక్కోసారి ఎండకు ముఖచర్మం ఎర్రగా మారి దద్దుర్లు వచ్చే అవకాశముంటుంది. అప్పుడు నీళ్లతో కడగపోవడం మంచిది. కలబంద గుజ్జును పూతలా వేసి ఐదు నిమిషాలయ్యాక మృదువుగా మునివేళ్లతో మర్దన చేయాలి. కొద్దిసేపయ్యాక నీళ్లో దూదిని లేదా స్పాంజిని ముంచి రెండుసార్లు అద్ది.. పొడి వస్త్రంతో తుడుచుకొంట ఇబ్బంది ఉండదు. లేదంటే సమస్య రెంట్టింపుఅవుతుంది.
వెనిగర్ తో ఇలా: వెనిగర్ నీళ్లు సమపాళ్లలో తీసుకొని ఖాళీ స్ప్రేసీసాలో నింపాలి. ముఖం మీద చల్లుకొని దూదితో తుడుచుకోవాలి. అలానే ఉదయం స్నానం చేసేటప్పుడు నీళ్లలో కప్పు వెనిగర్ కలుపుకొంటే బయటకు వెళ్ళినప్పుడు చర్మాన్ని ఎండప్రభావం నుంచి కాపాడుకోవచ్చు.
బొప్పాయి హాయి: బొప్పాయి ముక్కలను ఫ్రిజ్ లో ఉంచి మెత్తగా చేసి నాలుగైదు నిమిషాలు మర్దన చేసుకోవాలి. తర్వాత కడిగేసి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. చర్మం మీద మృతకణాలు, మురికి తొలగిపోయి.. శుభ్రపడుతుంది. ఈ పండు అన్ని చర్మతత్వాల వారికీ నప్పుతుంది.
క్రీమ్ లకు దూరంగా: నూనెతత్వం ఎక్కువగా ఉండే క్రీమ్ లకు, క్రీమ్ ఆధారిత ఫౌండేషన్ కు దూరంగా ఉండాలి. మేకప్ సాధ్యమైనంత తక్కువగా వేసుకోవాలి. ముఖానికి, చేతులకు విటమిన్ ‘ఇ’తో చేసిన సన్ స్ర్కీన్ ను ఎంచుకుంటే మంచి ఫలితాలుంటాయి.
శరీరానికి సాంత్వన: గోరువెచ్చటి నీళ్లలో అరకప్పు వంట సోడా లేదా ఓట్స్ పొడి కలిపి స్నానం చేస్తే అలసిన శరీరానికి సాంత్వన అందుతుంది. అలానే పుల్లటి పెరుగులో ముల్తానీమట్టి చేర్చి.. ముఖానికి పూతలా వేయాలి. పదినిమిషాలయ్యాక కడిగేస్తే మేనికి తేమ అందుతుంది. జిడ్డు సమస్య తగ్గుతుంది.



Click it and Unblock the Notifications