Latest Updates
-
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.!
కోమలత్వం చేకూరేనిలా...!

అనాస పండును ముక్కలుగా కోసుకుని మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. ఈ గుజ్జు కొద్దిగా ఓట్స్ పొడి, నాలుగు చుక్కల నిమ్మరసం చేర్చాలి. దీన్ని ముఖానికి , మెడకు రాసి బాగా రుద్దుకోవాలి. పది నిమిషాలయ్యాక గోరు వెచ్చని నీళ్లతో ముఖం శుభ్రపరచుకుంటే మేని మెరపులు సొంతమవుతాయి.
ఒక కప్పు ఓట్ మీల్ లో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, చెంచా చొప్పున బాదం పొడి, టమాటా గుజ్జును కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత ముఖం కడుక్కుంటే కాంతిమంతంగా ఉంటుంది.
పెసరపప్పును మిక్సీలో బరకగా పట్టించి అందులో చెంచా పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని స్నానం చేశాక ముఖానికి రుద్దుకొని పదినిమిషాలయ్యాక కడిగేస్తే మృతకణాలు తొలగిపోతాయి. మేని తాజాదనాన్ని సంతరించుకుంటుంది.
ఆరు చెంచాల పాలలో నాలుగు చుక్కల నిమ్మరసం, చెంచా వెనిగర్, నాలుగు చుక్కల రోజ్ వాటర్ కలిపి అందులో దూదిని ఉండలుగా చేసి వేయాలి. అరగంటయ్యాక వాటితో చర్మంపై గట్టిగా అదిమి పట్టి తుడుచుకోవాలి. తర్వాత పొడిగా ఉన్న దూదితో మరోసారి తుడవాలి. రాత్రి పడుకొనే ముందు ఇలా చేయడం వల్ల చెమట సమస్య తగ్గుముఖం పడుతుంది.
గులాబీ రేకులను పేస్ట్ చేసి, రసం తీయాలి. ఈ రసాన్ని యాస్ట్రింజెంట్ లో కలిపి ఫ్రిజ్ లో పెట్టాలి. చల్లగా అయ్యాక బయటకు తీసి అందులో దూదిని ముంచి ముఖానికి అద్దినట్టు తుడవాలి. కొద్దిసేపయ్యాక చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే జిడ్డు సమస్య నియంత్రణలో ఉంటుంది.
పది బాదం పప్పులను, కొన్ని చిక్కటి పాలు, రెండు చెంచాల ఓట్ మీల్, రెండు చెంచాలి చైనాక్లే , సంగం చెక్క నిమ్మరసం తీసుకుని అన్నింటినీ కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. దాన్ని ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత దూదితో తుడుచుకుంటే చర్మం సహజ మెరుపును సంతరించుకుంటుంది. కోమలంగా మారుతుంది.
పావు చెంచా నిమ్మరసంలో చెంచా చొప్పున, పాలు, కీరదోస రసాన్ని కలుపుకొని ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి. రోజూ బయటకు వెళ్లి వచ్చిన వెంటనే ఈ విధంగా చేస్తే ఈ మిశ్రమం చర్మం లోపలి వరకూ చేరి శుభ్రపడుతుంది.
అలసట, పని ఒత్తిడి ఇతరత్రా కారణాల వల్ల కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. చర్మం పొడి బారతుంది. ఇలాంటప్పుడు రెండు క్యాబేజీ ఆకుల రసం తీసుకొని దానిలో పావు చెంచా ఈస్ట్, టీస్పూన్ తేనె కలిపి గట్టిగా అయ్యేవరకూ తిప్పాలి. తర్వాత ముఖం, మెడ, చేతులు భాగంలో పట్టించాలి. ఇలా చేయడం వల్ల మచ్చలు, వలయాల సమస్య దూరమవుతుంది.



Click it and Unblock the Notifications
