Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చిరు ‘జల్లు’లు...సొగసు పరవళ్లు...గ్రీన్ టీ తో మెరుపు కళలు...!

ముఖ్యంగా చర్మ సంరక్షణలో ఎలాంటి అలర్జీలు రాకుండా చర్మం ప్రకాశవంతంగా ఉండాలంటే చెంచా బాదం నూనె, రెండు చుక్కల నిమ్మ నూనె కలిపి ముఖం, మెడకు మర్ధన చేసుకోవాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేయాల్సి ఉంటుంది.
ఈ కాలంలో చర్మం అతిగా పొడిబారదు. అదే సమయంలో జిడ్డుగానూ మారదు. కాబట్టి న్యూట్రల్ ప్యాక్ లను ఎంచుకుంటే మంచిది. రెండు చెంచాల ఓట్స్ పొడిలో మూడు చుక్కల తేనె, నాలుగు చుక్కల ఆలివ్ లేదా విటమిన్ ఈ నూనె, అరచెంచా టమాటా గుజ్జు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది నిమిషాలయ్యాక మెల్లిగా రుద్దుతూ కడిగేసుకోవాలి. ఇది శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్ ప్యాక్ లా పనిచేయడమే కాదు. పేరుకొన్న దుమ్ము, ధూళి కూడా తొలగిపోయేలా చేస్తుంది.
చర్మంపై ఫ్రీరాడికల్ ప్రభావాన్ని తగ్గించాలంటే శుభ్రత విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రీన్ టీతో క్లెన్సింగ్ చేసుకుంటే ఎంతో మార్పు కనిపిస్తుంది. అరకప్పు నీటిని తీసుకొని బాగా మరిగించి అందులో కొద్దిగా గ్రీన్ టీ పొడి వేయాలి. ఐదు నిమిషాల తర్వాత వడకట్టి అందులో అరచెంచా తేనె, ఐదు చుక్కల నిమ్మరసం కలుపుకోవాలి. ఈ నీటిలో దూదిని ముంచి ముఖంమంతా మృదువుగా రుద్దుకోవాలి. లేదంటే ఆ నీటిలో పలుచటి వస్త్రాన్ని ముంచి ముఖంపై ఐదు నిమిషాలు కప్పుకోవాలి. దీని వల్ల చర్మం తాజాగా కనిపిస్తుంది.
మెరిసే చర్మం కోసం మూడు చెంచాల మయోనైజ్‌కు ఒక చెంచాడు గ్రీన్ టీ కలిపి మెత్తగా చేయాలి. ఈ మిశ్రమన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని 20 నిమిషాల తరువాత కడిగేయాలి. చర్మం తడిపొడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
ముఖాన్ని శుభ్రం చేసుకున్న తరువాత గ్రీన్ టీతో మళ్లీ ఒకసారి కడుక్కోవాలి. ఆ తర్వాత మళ్లీ శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. గ్రీన్ టీ యాస్ట్రిజెంట్‌గా పనిచేసి, చర్మానికి స్వాంతననందిస్తుంది. అదే సమయంలో మొటిమలను కూడా నివారిస్తుంది. చర్మానికి మెరుపు తీసుకొస్తుంది.
ముఖానికి రాసుకునే క్రీంలో బరకగా ఉండే గ్రీన్ టీ పౌడర్‌ను రెండు టీస్పూన్ల పరిమాణంలో తీసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, చర్మంలోకి ఇంకిపోయే విధంగా వలయాకారంలో బాగా మర్దనా చేయాలి. కాసేపటి తరువాత కడిగేసుకుంటే, చర్మానికి మంచి తాజాదనాన్ని అందిస్తుంది. మీ ముఖం చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది.
కొద్దిగా ఓట్స్ పొడి తీసుకుని అందులో నాలుగైదు చుక్కల నిమ్మరసం కలిపి. ఆ ర్వాత కొన్ని పాలు చేర్చి మెడ భాగానికి పూతలా వేసుకోవాలి. పదినిమిషాల తర్వాత మృదువుగా రుద్దుతూ ఆ పూతను తొలగించేయాలి. దీనివల్ల మెడ కూడా ఆరోగ్యంగా కనిపిస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్లతో పోషణ చేస్తే.. చర్మంలో సాగేగుణం పెరుగుతుంది. ఫలితంగా ముడతలు కనిపించవు. చర్మం కూడా బిగుతుగా మారుతుంది. అలాంటి చికిత్సే ఇది. ముందుగా గ్రీన్ టీతో చర్మాన్ని శుభ్రపరచాలి. అందులో డెడ్ సీ మడ్, ఆరికాట్ స్ర్కబ్ తో మృతకణాల తొలగిస్తుంది. మినరల్ మసాజ్ క్రీంతో ఐదు నుచి పదినిమిషాలు మర్ధన చేయాలి. డెడ్ సీ మడ్ తో ముఖానికి పూత రాస్తే, ఇది సమర్థవంతంగా పనిచేసి. చర్మానికి ప్రత్యేక మెరుపును తెస్తుంది. వర్షాకాలంలో ఈ చికిత్స ప్రత్యేకం.
కళ్లు దురదపెట్టడం, ఎర్రబడం వంటివి వర్షాకాలంలో సహజమే ఆ సమస్యల్ని నివారించాలంటే. కీరదోస రసం, క్యారెట్ రసం సమపాళ్లలో తీసుకుని అందులో దూదిని ముంచి కళ్లపై పెట్టుకుని పదినిమిషాలయ్యాక తీసేయాలి. కళ్లు మిలమిలాడతాయి.



Click it and Unblock the Notifications