Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
సాప్ట్ స్కిన్ కోసం...చాలా సులభమైన చిట్కాలు
ముఖ్యంగా అందం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఫలితం ఉండదు. అందం కోసం వెనకా ముందు ఆలోచించకుండా ఎక్కువ డబ్బులు వాటికోసం వెచ్చిస్తుంటారు. అందుకే కొన్ని ఇట్లో సాధ్యమైయ్యే ఫేషియల్స్ తో మీ ముఖాన్ని చాలా సున్నితంగా మృదువుగా తయారయ్యే కొన్ని చిట్కాలు మీకోసం....

1. ముందుగా ఒక చిన్న బౌల్ లో వేరుశెనగ పప్పు పొడి, నిమ్మరసం మరియు తేనే వేసి బాగా మెత్తని పేస్ట్ లా తయారు చేసి ముఖానికి, మెడకు అప్లై చేయాలి. ఇది ముఖం మీద బాగా అరనివ్వాలి. అందుకోసం అరగంట సమయం పడుతుంది. అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖం మీద చల్లకొని సున్నితంగా మర్దన చేయాలి. ఆ తర్వాత ఎక్కువగా చల్లటి నీళ్లు పోసి శుభ్రం చేసుకొంటే ముఖం సున్నితంగా తయారవుతుంది.
2. ఒక చిన్న బౌల్ గుడ్డులోని తెల్లటి సొన, తేనె తీసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు బాగా పట్టించి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. అలా చేయడం వల్ల ముఖం చల్లదనంతో పాటు నునుపుగా తయారువుతుంది.
3. ఒక బౌల్ లో బాగా పండిన అరటిపండు, కొద్దిగా పచ్చిపాలు వేసి బాగా మెత్తగా చిదిమి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
4. బాగా పండు మాగిన పపాయను కట్ చేసి చిన్న ముక్కను తీసుకొని మెడ, ముఖం అంతా బాగా మర్ధన చేయాలి. ఇలా పదిహేను నిమిషాల పాటు మర్దన చేసిన తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి.
5. ఒక చెంచా మిల్క్ పౌడర్ లో మామిడియాక తొక్కతో చేసిన పౌడర్ ను మిక్స్ చేసి కొద్దిగా పాలు కలిపి ముఖానికి పట్టించాలి. అలాగే మెడ, చేతులకు బాగా మట్టించి ఇరవై నిమిషాల పాటు అలాగే ఉండనిచ్చి తర్వాత నీళ్లతో కడిగేపసుకోవాలి.
6. రెండు చెంచాల పసుపును ఆరెంజ్ జ్యూస్ తో మిక్స్ చేసి ముఖం, మెడకు స్ర్కబ్ చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి.
7. ఒక చిన్న బౌల్ లో కొద్దిగా తేనె, వెన్న, అరటిపండు గుజ్జు, లెమన్ జ్యూస్ మిక్స్ చేసి బాగా కలిపి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకొని ఈ మిశ్రమాన్ని రాత్రి నిద్రపోయే ముందు ముఖానికి పట్టించి అలాగే రాత్రంతా ఉండనిచ్చి, ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి.
8. ఒక చెంచా తేనెను తీసుకొని ముఖానికి, మెడకు పట్టించి, ఇరవై నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేసుకోవాలి.
9. మొక్కజొన్న పిండిని తీసుకొని అందులో గుడ్డులోని తెల్లసొన కలిపి, ముఖానికి అప్లై చేయాలి. బాగా తడి ఆరిన అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో మసాజ్ చేసి ఆ తర్వాత నీటితో కడిగేసుకోవాలి. ఇలా పది నుండి పదిహేను రోజులపాటు కంటిన్యూవ్ గా చేసినట్లైతే ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.
10. క్యాబేజ్ ను బాగా ఉడికించి ఆ నీళ్ళతో ముఖాన్ని సుభ్రం చేసుకుంటే ముఖంలో పేరుకొన్న దుమ్ము, ధూళి వదిలిపోతుంది.
11. తాజాగా ఉన్న మెంతి ఆకుల్ని తీసుకొని మెత్తని పేస్ట్ లా తయారు చేసుకొని ముఖానికి పట్టించి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
12. ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత మీ శరీరం మొత్తానికి వాజిలిన్ లేదా పెట్రోలియం జెల్లీ రాసుకోవాలి. రాసుకొన్నఒక గంట తర్వాత మళ్లీ స్నానం చేసుకోవాలి. ఇలా నెలకు రెండు సార్లు చేస్తుంటే మార్పు చాలా మీకే తెలుస్తుంది.
13. నిమ్మరసంలో చెక్కరను మిక్స్ చేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి, శరీరం మొత్తానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.
14. మూడు టీస్పూన్ల బేబీ ఆయిల్ లో రెండు చెంచాల పంచదార పొడిని కలిపి శరీరం మొత్త స్ర్కబ్ చేయాలి. తర్వాత పది..పదిహేను నిమిషాల పాటు అలాగే వదిలేసే ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి.
15. ఈ చిట్కాలన్నీ మీ చర్మసౌందర్యాన్ని కాపాడి కాంతి వంతంగా..కోమలంగా మార్చుతాయి. కాబట్టి మీరు కూడా ప్రయత్నించి చూడండి అప్పుడే ఫలితం ఏంటో మీకు తెలుస్తుంది.



Click it and Unblock the Notifications