Latest Updates
-
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి!
సాధారణ ఫేయిర్ నెస్ క్రీమ్ ఒక్కటి చాలు.....!

ముందుగా మీరు ఏదైనా ఫెయిర్ నెస్ క్రీమ్ వాడే ముందు దాన్ని చేతి భాగంలో కొద్దిగా ప్యాచ్ లాగా రాసి... దాని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదని తెలుసుకున్న తర్వాతే వాడటం మంచిది. ఏదైనా క్రీమ్ ఎంపిక తర్వాత ఇలా టెస్ట్ చేసుకోకపోతే కొన్నిసార్లు కొందరిలో కాంటాక్ట్ డెర్మటైటిస్, అలర్జిక్ రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి. అదే కొద్దిగా ప్యాచ్‌లా రాసుకొని పరీక్షించడం వల్ల కొన్ని ప్రమాదాలను సమర్థంగా నివారించవచ్చని తెలుసుకోవాలి.
స్టెరాయిడ్స్ తో పాటు స్కిన్ లెటైనింగ్ క్రీమ్స్ వాడే సమయంలో మీ చర్మానికి సూట్ అయ్యేదాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. స్కిన్ లెటైనింగ్ క్రీమ్స్ వాడే సమయంలో దాని ఎక్కువగా వాడకూడదు. నిర్ణీత వేళల్లో తగిన మోతాదులోనే ఉపయోగించాలి. ఎందుకంటే ఒక్కోసారి మరింత ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మంలోని రంగునిచ్చే కణాలు సన్నగిల్లిపోతాయి. అది ఒక్కోసారి కొన్ని దుష్ర్పభావాలకు దారితీయవచ్చు. స్టెరాయిడ్స్ ఉన్న క్రీమ్స్ వల్ల చర్మం తెల్లగా అయినట్లు కనిపించినా దాన్ని విచ్చలివిడిగా వాడటం వల్ల స్టెరాయిడ్ డెర్మటైటిస్ అనే సమస్య రావచ్చు. ఫలితంగా చర్మం పలచబారడం వంటి దుష్పరిణామాలు సంభవించవచ్చు.
ఒక్కోసారి చర్మంపై పుండ్లు, రాషెస్ కూడా రావచ్చు. స్టెరాయిడ్స్ ఉన్న క్రీమ్స్ మరీ ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మంపై మొటిమలు వంటివి వచ్చే అవకాశం ఉంది. చర్మం మరింత మృదువుగా అయి చిన్న చిన్న గాయాలకే మరింత ఎక్కువగా మారవచ్చు. స్టెరాయిడ్స్ ఉన్న క్రీమ్స్ మితిమీరి ఉపయోగించడం వల్ల వయసు పైబడే ప్రక్రియ వేగంగా జరగవచ్చు. శరీరంలోని చర్మకణాలను బిగుతుగా ఉండే కొలెజెన్ దెబ్బతిని ముడుతలు రావడం వేగంగా జరగవచ్చు.
సన్ స్క్రీన్స్ ఉపయోగించడం అన్నది ఎప్పుడూ మంచిదే. అయితే అందులో ఎస్‌పీఎఫ్ 25 లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న సన్ స్క్రీన్స్ వాడటం మంచిది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటి ఎండ నేరుగా పడేలా తిరగకపోవడ మంచిది లేదా అందుకు తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగని అస్సలు ఎండలో తిరగకపోవడం వల్ల విటమిన్ డి లోపం క్యాల్షియమ్ లోపం కూడా రావచ్చు. అందుకే అప్పుడప్పుడూ ఎండ తగులుతూ ఉండాలి.
మీ చర్మం మరింత పొడిబారకుండా, మరీ జిడ్డు లేకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. మొటిమలు ఉన్నవారు, సున్నితంగా ఉండే చర్మం గలవారు తమకు అలవాటైన మేకప్ సామగ్రి, అలవాటైన పెర్ ఫ్యూమ్స్‌ను మాత్రమే ఉపయోగించాలి. కొత్తవి ఉపయోగించాల్సి వస్తే ఒక్కసారి పరీక్షించిన తర్వాతే కొనాలి.



Click it and Unblock the Notifications
