Latest Updates
-
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా!
వేసవిలో భాదించే మొటిమలు...మచ్చలు....

1. ముఖ్యంగా నూనెతో కూడుకున్న ఆహార పదార్థాలు, రాజమా, శెనగలు మొదలైనవి తీసుకోకూడదు. మాంసాహారాన్ని తినే అలవాటుంటే మానుకోవాలి. అలాగే డెయిరీ ఉత్పత్తులను తినకోకూడదు. ఇందులో హార్మోన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ హార్మోన్లు నేరుగా రక్తంలో కలిసి విషపూరితంగా తయారవుతాయి. కాబట్టి మీరు మొటిమలనుంచి బయటపడాలంటే వీటిని తినడం మానేయండి.
2. ఉదాహరణకు పన్నీర్, పెరుగు, పాలు, చాకొలేట్లు తదితర డెయిరీ ఉత్పత్తులను తినకూడదు. రిఫైండ్ ఫుడ్ మరియు చల్లని పానీయాలను సేవించంకండి. ఊరగాయను తినడం తగ్గించాలి కాని పచ్చడిని ఆహారంగా తీసుకోవచ్చంటున్నారు ఆరోగ్యనిపుణులు.
3. ప్రతి రోజు దాదాపు రెండు నుంచి మూడు లీటర్ల నీటిని సేవిస్తుంటే శరీరంలోనున్న కొవ్వు బయటికి వచ్చేస్తుంది. భోజనం తిన్న తర్వాత వెంటనే నీటిని త్రాగకండి. నీరు త్రాగాలనిపిస్తే కొద్ది ద్దిగా త్రాగాలి. భోజనం చేసిన అరగంట తర్వాత కడుపారా నీటిని త్రాగితే వీటి మించిన పదార్థం మరొకటి లేదు.
4. ఎండలోకి వెళ్లడం మూలంగా ఈ మచ్చలు పెరుగుతాయి. కాబట్టి మీరు ఎండలో తిరగడం మానేయాలి. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే గొడుగు తీసుకెళ్లాలి. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మచ్చలు పెరగకుండా ఉంటాయి.
5. గుడ్డులోని తెల్లసొన తీసుకుని దీనికి నిమ్మరసం కలిపి ముఖానికి మర్దనా చేసుకుంటే చర్మం తాజాగా ఉంటుంది.
6. కొంచెం తేనె తీసుకుని అందులో అరటిపండు మెత్తగా గుజ్జులా చేసి కలపాలి. దీనిని ముఖానికి రాసుకుంటే ముఖంపై ముడతలు తొలగిపోతాయి.
7. కొత్తిమీర రసం, ఆలుగడ్డ రసం తీసుకుని వాటికి రెండు చుక్కలు నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. ఇలా చేస్తే మొటిమల వలన ఏర్పడిన మచ్చలు తగ్గుతాయి.
8. జిడ్డు చర్మం కలవారు ప్రతిరోజూ క్రమం తప్పకుండా టమాట రసం రాసుకుంటుంటే మొటిమలతో ఏర్పడిన గుంటలు పోతాయి.
9. మొటిమలు వేదిస్తుంటే ఒక పది నిమ్మ ఆకులు తీసుకుని మెత్తగా పేస్టు చేసుకుని, అందులో చిటికెడు పసుపు కలిపి రాసుకోవాలి. ఇలా ఒక వారం రోజుల పాటు చేస్తే ఫలితం ఉంటుంది.
10. పుదీనా ఆకులను మెత్తగా ఫెస్ట్‌లా చేసుకొని ముఖానికి మాస్క్‌లా వేసుకోవాలి. పూర్తిగా ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేయండి. కొన్ని రోజులపాటు ఇలా చేస్తే మొటిమలు మాయమైపోతాయి.



Click it and Unblock the Notifications