Latest Updates
-
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్‌వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా..
కాంతివంతంగా మెరిసిపోవాలంటే క్రీములతో పనిలేదు....!
సాధారణంగా మనం గమనించినట్లైతే కొంతమంది మహిళల చర్మం కొన్ని సార్లు నిర్జీవంగా తయారవుతుంటుంది. దీనికి అనేక రకాల కారణాలు ఉంటాయి. అయితే చాలా మంది ఏం చేయాలో తెలియక చర్మాన్ని సంరక్షించుకొనేందుకు ఎన్నో ప్రయత్రాలు చేస్తుంటారు. కానీ ఏం ప్రయోజనం ఉండదు.దీంతో ఏం చెయ్యాలో అర్ధం కావడంలేదని వాపోతుంటారు. కొంతమంది టివిలో, పేపర్‌లో వచ్చే ప్రకటలను చూసి వందల రూపాయలు పోసి అనేక రకాల క్రీములు కొంటున్నారు. వాటి వల్ల ఎంత వరకు ప్రయోజనం కలుగుతుందనేది మాత్రం ప్రశ్నార్థకంగానే మిగిలి పోతోంది. అందుకే కృత్రిమంగా తయారు చేసే క్రీములపెై ఆధార పడడం అంత మంచిది కాదంటున్నారు సౌందర్య నిపుణులు. సహజసిద్ధంగా తయారయ్యే పండ్లు, గింజలతో కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు అంటున్నారు.

మనం నిత్యం ఉపయోగించే పండ్లు మనకు ఎంత గానో ఉపయోగపడతాయి. కేవలం శరీరానికి శక్తి నివ్వడమే కాకుండా చర్మానికి మంచి కాంతి తేవడం లో ఇవి ఎంతగానో దోహదపడుతాయి. మరి అందుకు ఉపయోగపడేవి ఏంటో చూద్దాం...
ప్రొద్దుతిరుగుడుపువ్వు గింజలు: తేలికగా, క్రిస్పీగా ఉండే ఈగింజలలో ఫాటీ యాసిడ్స్ అధికంగా. సన్ ఫ్లవర్ ఆయిల్ ను శరీరానికి మర్ధన చేయడం వల్ల చర్మం మెరిసేలా చేస్తాయి. మొటిమలు, మచ్చలు కూడా తగ్గుతాయి. వారానికి రెండు సార్లు రెండు టేబుల్ స్పూన్‌ల ప్రొద్దుతిరుగుడు గింజలు తీసుకోవాలి. వంటకు కూడా సన్‌ఫ్లవర్‌నూనెను ఉపయోగించడం మంచిది.
గింజధాన్యాలు: చర్మకణాల పెరుగుదలకు ఉపయోగపడే ప్రోటీన్లు గింజ దాన్యాలలో అధిక మోతాదులో ఉంటాయి. చుండ్రును నిర్మూలించే బయోటిన్ అనే పోషకం వీటిలో ఉంటుంది. బయోటిన్ జుట్టు త్వరగా పెరగడానికి తోడ్పడుతుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా గింజధాన్యాలు తింటే గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ధాన్యాలను ఉడకబెట్టి గుగ్గిళ్ళ రూపంలో తీసుకుంటే చాలా మంచిది. దీనివల్ల నట్‌కేలరీలు, జింక్ అధికశాతం లభిస్తాయి. జింక్ దుమ్ము, ధూళి, కాలుష్యం వల్ల కలిగే రాషెస్ రాకుండా చేస్తుంది. క్రమం తప్పకుండా గింజధాన్యాలు తినడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది.
గోధుమలు: గోధుమలలో బి గ్రూపుకు చెందిన విటమిన్‌లు సమృద్ధిగా ఉంటాయి. చర్మంలో డెడ్ స్కిన్ కణాల స్థానం లో కొత్తకణాల పెరుగుదలలో ముఖ్యపాత్ర వహిస్తాయి. స్ట్రెస్, ఇన్‌ఫెక్షన్‌ల కారణంగా చర్మం పాడవకుండా కాపాడతాయి.పగిలిన చర్మాన్ని మృదువుగా తయారు చేస్తుంది. వీటిలో ఉండే నియాసిన్, చర్మ ణాలు రక్తంలో ఉన్న పోషకాలను గ్రహించేలా చేస్తుంది. గోధుమపిండితో చేసే బిస్కెట్స్, బ్రెడ్‌ను ఎక్కువగా తినాలి.
నట్స్: కేలరీలు, జింక్ అధిక శాతం ఉంటాయి. జింక్ దుమ్ము, ధూళి, కాలుష్యం వల్ల కలిగే రాషెస్ రాకుండా చేస్తుంది. క్రమం తప్పకుండా నట్స్ తినడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది.
కలబంద: ప్రతిరోజూ కలబంద జ్యూస్ తాగడం వల్ల చర్మంపై వచ్చే దురదలు, మొటిమలు, పిగ్మెంటేషన్ సమస్యలను తగ్గిం చుకోవచ్చు. రోజుకు ముప్పైమిల్లీ లీటర్ల జ్యూసును తీసుకోవాలి.
బొప్పాయి: చూడగానే నోరూరించే బొప్పాయి పండులో తక్కువ కేలరీలుంటాయి. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. నిర్జీవమైన చర్మాన్ని కాంతి వంతంగా చేస్తుంది. బొప్పా యి గుజ్జు తో ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు. ప్రతిరోజూ ఒక కప్పు బొప్పాయి ముక్కలు తింటే మంచిది.
నారింజ: నారింజలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావయోలెట్ కిరణాల ప్రభా వం చర్మంపై పడకుండా చేస్తుంది. చర్మం ముడుతలు పడకుండా, టైట్‌గా ఉంచే కొలాజిన్‌ను ఉత్పత్తి చెయ్యడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు ఒక నారింజను తినడం మంచిది. రోజుకు రెండు వందల గ్రాముల విటమిన్ సి అవసరమవుతుంది. నారింజ జ్యూస్ తాగడం కన్నా పండు రూపంలో తినడమే మంచిది.



Click it and Unblock the Notifications