Latest Updates
-
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక!
8 సూపర్ ఫుడ్స్ తో యవ్వనం..ఆరోగ్యం మీ సొంతం
సాధారణం ప్రతి రోజూ మనం తీసుకొనే ఆహార పదార్థాలను బట్టే మన వ్యక్తిత్వం నిర్ధేశించబడుతుంది అనడంలో సందేహం లేదు, జ్ఞాపక శక్తి మెరుగుపడాలన్నా, మానసిక ఒత్తిడులు తట్టుకోవాలన్నా, జీవితంలో ఎదుర్యే ఎన్నో సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలన్నా కావలసింది ఆరోగ్యం, ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం.
ఆరోగ్యం వ్యక్తిత్వాన్నే కాదు వృద్ధాప్యాన్ని కూడా నిర్దేశిస్తుంది. రోజవారి జీవితంలో ఎదుర్యే సమస్యలు, మానసిక ఒత్తిడులు మన చర్మంపై కూడా ప్రభావం చూపిస్తాయి. అందుకే వయసుతో సంబంధం లేకుండా చర్మం ముడుతలు పడి, నిర్జీవంగా తయారవుతుంది. చర్మ సంరక్షణకు ఎంత విలువైన కాస్మొటిక్స్ వాడినా, మన శరీరంలో చర్మానికి కావలసిన హార్మోన్ ల ఉత్పత్తి సమపాళ్ళలో లేకపోతే ప్రయోజనం ఉండదు. అందుకే చర్మ సంరక్షణకు మనం తినే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చర్మానికి కావలసిన హార్మోన్ ల ఉత్పత్తి మెరుగుపడి చర్మం యవ్వనంగా ఉండటమే కాక కాంతిలీనుతూ ఉంటుంది.
చర్మం కాంతివంతంగా ముడుతలు లేకుండా యవ్వనంగా నిగనిగలాడుతూ ఉండాలంటే ఈ సారి మీరు ఇంటికి కావలసిన స్టేషనరీ తెచ్చుకొనేటప్పుడు ఇవి తప్పకుండా ఉండేలా జాగ్రత్తపడండి...

ఆరోగ్యంగా ఉండటానికి యాపిల్ చేసే మేలు అంతా ఇంతా కాదు, రోజుకు ఒక యాపిల్ తిన్నా గంపెడు ఆరోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే. కాబట్టి ప్రతి రోజు ఆహారంలో ఏదో ఒకపూట కనీసం ఒక యాపిల్ అయినా తినాలి. ఆపిల్ లో ఉండే సి విటమిన్ చర్మంలోని ముడతలను తగ్గించి యవ్వనంగా ఉంచుతుంది.

సోయాబీన్ లో ఉండే ఫ్లేవోన్స్, శరీరంలోని హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల కలిగే రుగ్మతలను దూరంగా ఉంచుతుంది. ఇందులో చర్మానికి కావలసిన పోషకాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. సోయా బీన్స్ కారణంగా కొవ్వు శాతాన్ని తగ్గించడం, ఎముకల్లో దృఢత్వం పెంచడం వీలవుతుంది.

టమాటాల్లో అధిక మోతాదులో ఉండే లైకోపిన్, చర్మాన్ని కాంతిహీనం చేసే సెల్స్ ని అదుపులో ఉంచుతాయి. పచ్చి టమాటాల్లో కంటే వండిన టమాటాల్లో 5 రెట్లు ఎక్కువ లైకోపిన్ ఉంటుంది. చర్మానికే కాదు రకరకాల గుండెకు సంబంధించిన వ్యాధుల నుండి ఈ లైకోపిన్ దూరంగా ఉంచుతుంది.

ఆకుకూరల్లో విటమిన్ సి, పుష్కలంగా ఉంటుంది, అది చర్మం కాంతివంతంగా ప్రకాశించడంలో దోహదపడుతుంది. అంతేకాదు ఆకుకూరల్లో ఉండే క్యారోటినాయిడ్స్ చర్మం ముడతలను తొలగించి, ఆరోగ్యంగా ఉంచుతుంది.

వేరు శనగల్లో అధిక మోతాదులో ఉండే విటమిన్ ఇ, సిలీనియం, జింక్ శరీర సౌందర్యానికి కావలసిన హార్మోన్ ల ఉత్పత్తిలో సహకరిస్తాయి. రక్తప్రసరణ మెరుగుపరచి మంచి ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యానికి ఉపకరిస్తాయి.

వెల్లుల్లిని మించిన యాంటి ఆక్సిడెంట్ లేదు, వెల్లుల్లిని ఏదో రూపంలో ఆహారంలో ఉండేటట్లు చూసుకుంటే చాలు, ఎన్నో రోగాలు మన దగ్గరికి కూడా రావు, వెల్లుల్లిలో ఉండే ఆంటిసెప్టిక్ , ఆంటి బ్యాక్టీరియల్, ఆంటీ వైరల్స్, స్కిన్ ఇన్ఫెక్షన్ నుండి దూరంగా ఉంచుతాయి. రక్తాన్ని శుద్ధపరచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. బ్లడ్ ప్రెషర్ ను క్రమబద్ధం చేసి రక్తంలో చెడు కొవ్వును తగ్గించి ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది.

మరో యాంటిఆక్సిండెంట్ గ్రీన్ టీ. ఇది కావల్సిన శక్తిని ఇస్తుంది. మైండ్ ను రిఫ్రెష్ చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. ఇది కూడా వయస్సు పైబడనీయకుండా ఉంచే వాటిలో ఒక అద్భుతమైనటువంటిదే.

వయస్సును తగ్గించడంలో ప్రతి రోజూ మనం తీసుకొనే డైయట్ లో నీరు కూడా ఒక భాగమే. నీరు ఇంటర్నల్ గాను, ఎక్సటర్నల్ గాను మంచి ప్రయోజనకారి. ప్రతి రోజూ ఎనిమిది నుండి పది గ్లాసుల నీరు తాగడం వల్ల శరీరానకి కావల్సిన తేమ అంది ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంచుతుంది.
తెలుఫుకున్నారు కదా.. మరి ఇప్పటి నుండి ఇవి మీ ఆహారంలో తప్పకుండా ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకుంటారు కదూ.. ఇంకో ముఖ్య విషయం, మంచి ఆహారం తింటే ఎంత ఆరోగ్యమో, ఆరోగ్యానికి కీడు చేసే ఆహారం తింటే అంతే అనారోగ్యం...
జంక్ ఫుడ్, సిగరెట్లు, ఆల్కహాల్, ఇవి కూడా మన ఆరోగ్యంతో పాటు, మన అందం పై కూడా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి తిండి విషయంలో జాగ్రత్తగా ఉందాం. అందం, ఆరోగ్యం సొంతం చేసుకుందాం.



Click it and Unblock the Notifications
