Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
బ్లాక్ హెడ్స్ నుండి చర్మసౌందర్యాన్ని ఎలా కాపాడుకోవాలి..?

1. టీస్పూన్ గ్లిజరిన్, టీ స్పూన్ రోజ్ వాటర్ కలిపి...ఆ మిశ్రమంలో కాటన్ బాల్ ముంచి మొటిమలు, నల్లమచ్చల మీద రోజూ రాత్రి పడుకునే ముందు రాసి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా రెండు వారాలపాటు అప్లై చేస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ తగ్గి చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది.
2. రోజు క్రమం తప్పకుండా ఎనిమిది గ్లాసుల నీళ్లు త్రాగటంతోపాటు, గింజలు లేని పచ్చ ద్రాక్షపండుని మధ్యకు కట్ చేయాలి. ఆ కట్ చేసిన ముక్కలతో ముఖాన్ని పైకి కిందకి వలయాకారంలో నెమ్మదిగా మసాజ్ చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా రెండు వారాలపాటు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
3. బ్లాక్ హెడ్స్ ఉంటే నెలకోసారి ఫేషియల్ లేదా స్కిన్ క్లీనప్ చేయడంవల్ల సూక్ష్మ రంద్రాలు శుభ్రపడుతాయి. అయితే ఆ తర్వాత ఫేస్ ప్యాక్ తప్పనిసరిగా వేసుకోవాలి. ఫేస్ ప్యాక్ వేస్తే సూక్ష్మరంద్రాలు మూసుకుపోతాయి. కాబట్టి బ్లాక్, వైట్ హెడ్స్ రావు.
4. ముందుగా మూడు కప్పుల నీటిని మరిగించి, అందులో రెండు టేబుల్ స్పూన్ల వంటసోడా వేసి, ఈ నీటిలో టవల్ ను ముంచి ముఖానికి అద్దుతూ ఉండాలి. ఇలా ఐదారుసార్లు చేసిన తర్వాత వరిపిండిలో పెరగు కలిపి ఆ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్నచోట రాసి ఐదు నిమిషాల పాటు వలయాకారంగా రుద్దాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడిగేలయాలి.
5. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేవి చర్మంపై ఓపెన్ పోర్స్(సూక్ష్మ రంద్రాలు)లో మలినాలు(మురికి) చేరడంవలన వస్తాయి. అలాగే జిడ్డు చర్మం, తలలో చుండ్రు ఉన్నవారిలో ఎక్కువగా వచ్చే అవకాశంవుంది. కాబట్టి నెలకోసారి ఫేషియల్ లేదా స్కిన్ క్లీనప్ చేసుకోవాలని కాస్మాటాలజిస్టులు పేర్కొంటున్నారు. స్కిన్ క్లీనప్ చేసుకున్న తర్వాత ఫేస్ ప్యాక్ తప్పనిసరిగా వేసుకోవాలని దీంతో సూక్ష్మ రంద్రాలు(పోర్స్) మూసుకుపోతాయని వారు తేలిపారు. సూక్ష్మ రంద్రాలు మూసుకు పోవడంవలన బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ బెడద ఉండదంటున్నారు కాస్మాటాలజిస్టులు.



Click it and Unblock the Notifications
