Latest Updates
-
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.? -
పూజ గదిలో దీపం ప్రతిసారీ ఆరిపోతుందా.. మీ ఇంట్లో ఈ కష్టాలు తప్పవు.! -
రోజూ అవే చపాతీలు, రోటీలు తిని బోర్ కొట్టిందా? మట్కా రోటీ ఇలా చేస్తే పిచ్చెక్కించే టేస్ట్! -
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి!
మేని ఛాయ రెట్టింపు చేయడానికి ఫేషియల్ కు ముందు ఎంచేయాలి...?

ఫేషియల్ వల్ల వయస్సు పెరగడంవల్ల వచ్చే ముడతలు, లక్షణాలు చర్మానికి ఏర్పడవు. అయితే, ఫేషియల్‌కు ముందు తమ చర్మం ఏ రకానికి చెందినదన్నదీ తెలుసుకోవాలి. జిడ్డు చర్మమున్న వారికి హైడ్రోజన్ మసాజ్ వాటర్ బేస్డ్ మసాజ్ చేయాలి. అటువంటి చర్మానికి ఫ్రూట్ జెల్‌ను వాడతారు. పొడి చర్మానికి సాధారణ చర్మానికి, ఆయిల్ మసాజ్ చక్కగా ఉపయోగపడుతుంది. ఆయిల్ మసాజ్‌కు నువ్వుల నూనె, సోయానూనె, బాదంనూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్ వీట్ అయిల్స్‌ను ఉపయోగించవచ్చు.ఫేషియల్ చేయడానికి ముందుగా చర్మాన్ని శుభ్రపరచుకోవాలి. అందుకు నాణ్యత కలిగిన ఫేస్‌వాష్‌ను కానీ, క్ల్లెన్సింగ్ కానీ ఉపయోగించడం మంచిది.
ఆ తరువాత ఆప్రికాట్ లేదా ఆరెంజ్ స్క్రబ్‌ను ఉపయోగించి మృదువుగా ముఖాన్ని మర్దనా చేయాలి. నాలుగైదు నిమిషాల తర్వాత ఏదో ఒక ఆయిల్‌తో సున్నితంగా మసాజ్ చేయాలి. తరువాత ముఖానికి హెర్బల్ ప్యాక్‌ను వేసుకుని ఆరేవరకూ వుంచాలి. తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.ఫేషియల్ పూర్తయిన తర్వాత ముఖం ఎంతో మృదువుగానూ, అందంగానూ, ఆరోగ్యంగానూ మారిపోవడం గుర్తించవచ్చు. అయితే ఫేషియల్ ఏదో సందర్భంగానూ, పార్టీలకు, శుభకార్యాలకు హాజరయ్యేటప్పుడు మాత్రమే కాదు. నెలకి ఒకసారన్నా ఫేషియల్ చేసుకుంటే ముఖ సౌందర్యం మరింత పెరుగుతుంది.
అందం ద్విగుణీకృతం చేసుకోవడానికి చాలామంది ఫేషియల్స్ ఎంచుకొంటారు. అయితే ఆ సమయంలో చర్మ సంరక్షణ పట్ల దృష్టి సారించాలి. అప్పుడే మేని చాయ ఇనుమడిస్తుంది. ఫేషియల్ చేయించుకొన్నాక సబ్బులు, పై పూతలు ఒకటి రెండ్రోజులు వాడటం మానేయాలి. అలంకరణకు దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే, వాటి తాలూకు ఘాటైన రసాయనాల ప్రభావం చర్మంపై పడి, కళ తప్పుతుంది. అలాగే పిగ్మెంటేషన్ ఉన్న చోట ఐస్ ముక్కలతో రుద్దాలి. అప్పుడే అలసిన చర్మానికి స్వాంతన అందుతుంది.
రెండు మూడు రోజుల వరకూ ప్లక్కర్ తో కనుబొమ్మలు తీయడం, త్రెడింగ్ చేయించుకోవడం వల్ల చర్మం మరింత ఒత్తిడికి గురవుతుంది. దానికి బదులు ముందుగా వీటిని తీశాక ముఖానికి పూత చేయించుకోవడం ఉత్తమం. వేడి నుంచి స్వాంతన పొందడానికి ఈత(స్విమ్మింగ్)కు వెళుతుంటారు చాలా మంది. అయితే షేషియల్ చేయించుకొన్న రెండు మూడు రోజుల వరకూ స్విమ్మింగ్ కు వెళ్లకపోవడం మంచిది. ఆ నీళ్ల వల్ల ఫేషియల్ ప్రభావం అంతగా పని చేయదు. ఇంట్లోనే చల్లటి నీళ్లతో ముఖ కడక్కోవడానికి ప్రాధాన్యమివ్వాలి.
ఒక్కోసారి చర్మం కమిలిపోవడం, దద్దుర్లు రావడం జరుగుతుంది. అలాంటప్పుడు మెత్తని ఐసు ముక్క తీసుకొని ముఖంపై తుడుచుకుంటూ ఉండాలి. అలానే ముఖం మీద వ్యాక్సింగ్ లాంటివి ఏమీ చేయకూడదు. ఆ రోజంతా సూర్య కిరణాల ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఫేషియల్ చేయించిన రోజు అలంకరణ వేసుకోవడం తప్పనిసరైతే మినరల్ బేస్డ్ మేకప్ నకు ప్రాధాన్యమివ్వాలి.



Click it and Unblock the Notifications