Latest Updates
-
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి!
మాన్ సూన్ చర్మ సంరక్షణ-జాగ్రత్తలు...

ఈ సీజన్‌లో చర్మానికి చెప్పలేనంత హాని కలుగుతుంది. చర్మం ఒకసారి పొడిబారిపోయి బిగదీసుకుపోయినట్లుంటే ఇంకోసారి జిడ్డుపట్టి బంకలు సాగుతుంటుంది. జాగ్రత్త తీసుకోకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి తక్కువ గాఢతగల ఫేస్‌వాష్‌తో ముఖం కడుక్కుని, రెండు మూడు నిమిషాల తర్వాత అంటే ఆ తడి ఆరకముందే మంచి మాయిశ్చరైజర్ తో సున్నితంగా మర్దించాలి. అలా చేయడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది.
ఇది వర్షాకాలం కదా, సన్‌స్క్రీన్ లోషన్లతో పనేముందనుకోకుండా ఎండలో బయటకు వెళ్లడానికి పది, పదిహేను నిమిషాల ముందుగా ముఖానికి, మెడకు, చేతులకు తప్పనిసరిగా సన్‌స్క్రీన్ లోషన్ పూయండి. ఎండలోనే ఎక్కువ సమయం గడపవలసి వస్తే ప్రతి మూడుగంటలకూ ఒకసారి అప్లై చేస్తూ ఉంటే మీ ముఖసౌందర్యం దెబ్బతినదు.
మృదువైన చర్మం: ఒక టీ స్ఫూన్ కమలారసంలో తేనె కలుపుకొని ముఖానికి పట్టించాలి. 20 నిమిషాలాగి కడిగేయాలి. తేనె అన్ని రకాల చర్మతత్వాలకూ సరిపోతుంది. ముఖం జిడ్డుగా మొటిమలతో ఉన్నట్టయితే ఒక టీ స్ఫూన్ తేనె, ఒక టీ స్పూన్ పెరుగు, కొద్దిగా పసుపు కలిపి అప్లై చేసి 20 నిమిషాలాగి కడిగేయాలి.
పొడిచర్మం : ఈ కాలంలో చర్మతత్వాన్ని అనుసరించి దానికి తగిన పరిరక్షణ చర్యలు తీసుకోవాలి. ఒక టేబుల్‌స్ఫూన్ చల్లని పాలు, రెండు చుక్కలు ఏదో ఒక వెజిటబుల్ ఆయిల్, ఆలివ్, నువ్వుల నూనె లేదా సన్‌ఫ్లవర్ కలిపి శుభ్రమైన దూది దానిలో ముంచి చర్మానికి అప్లై చేయాలి.
ఫేస్ వాష్ : చాలినన్ని నీటిలో క్యాబేజీ ఉడికించి చల్లారాక ఈ నీటిని ఫేస్‌వాష్‌గా ఉపయోగించాలి. క్యారెట్ తురుమును స్క్రబ్‌గా వాడుకోవచ్చు. విటమిన్ ఎ అధికంగా ఉండే క్యారెట్ ఈ కాలం సమస్యలకు చక్కగా పనిచేస్తుంది.
మాయిశ్చరైజింగ్ :ఏ చర్మం కలవారైనా మాయిశ్చరైజింగ్ కోసం రోజుకు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు తాగితే మంచిది. అంతేకాదు, ఫ్రూట్ సలాడ్స్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల మన శరీరం మరింత నిగారింపు సంతరించుకుంటుంది.
స్క్రబింగ్: జిడ్డు చర్మం: పొప్పడి పండు గుజ్జు, బియ్యం పిండి కలిపి ముఖానికి పట్టించాలి. దీనివల్ల చర్మం మీద బ్లాక్ హెడ్స్ తగ్గిపోతాయి. మొటిమల మచ్చలు కూడా తగ్గుతాయి.
పొడి చర్మం: పది బాదం పప్పులను కాసేపు నానేసి గ్రైండ్ చేసుకోండి. దానిని ముఖానికి రాసుకోని ఐదు పది నిమిషాలు మసాజ్ చేసే చర్మం మీద ఉన్న మృత కణాలు తొలగిపోతాయి. అప్పుడు మీ ముఖం మరింత అందంగా కనిపిస్తుంది.
ఫేస్‌మాస్క్: పొడిచర్మం కలవారు అర టీస్పూన్ తేనె, ఒక టీ స్పూన్ రోజ్‌వాటర్, ఒక టీస్పూన్ పాలపొడి కలిపి పేస్టు మాదిరిగా చేసి ముఖానికి పట్టించాలి.20 నిమిషాలాగి నీటితో కడిగేయాలి. అరటి, యాపిల్, బొప్పాయి, కమలాలవంటి పండ్లను చిదిమి ముఖానికి పట్టించి 20 నిమిషాలాగి కడిగేయాలి. ఇది అన్నిరకాల చర్మతత్వం వారికీ పనిచేస్తుంది. బొప్పాయిలో ఎంజైమ్స్ ఎక్కువగా ఉంటే అరటి చర్మాన్ని టైట్ చేస్తుంది. యాపిల్‌లోని పెక్టిన్ చర్మాన్ని క్లెన్స్ చేస్తుంది. కమలా ఫలంలో ఉండే సి విటమిన్ సాధారణ యాసిడ్ ఆల్కలైన్‌ని సమతుల్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది.
మసాజ్: నాలుగేసి చుక్కల చొప్పున చందనం రోజ్ వాటర్‌లను100 ఎంఎల్ స్వచ్ఛమైన నువ్వుల నూనెను ఆలివ్ ఆయిల్‌తో కలిపి శరీరానికి మసాజ్‌చేసుకుంటే చర్మం పగలకుండా మృదు వుగా ఉంటుంది. దురదలుచర్మం పొడిబారిపోయి దురద పెడుతుంటే... ఒక మగ్గునీటిలో రెం‚డు స్పూన్ల వెనిగర్ కలిపి స్నానం చేశాక ప్రభావిత ప్రదేశంపై ఆ నీటితో కడగాలి.
చేతులు.. పాదాలు: 3 స్పూన్ల రోజ్‌వాటర్‌లో ఒక స్పూన్ గ్లిజరిన్ కలిపి చేతులు, పాదాలకు అప్లై చేసి అరగంటాగి నీటితో కడిగేయాలి. ఈ జాగ్రత్తలతో చర్మం వాతావరణ ప్రభావానికి లోనుకాకుండా మృదువుగా ఉంటుంది. వర్షాకాలంలో నీటిలో తరచూ నానడం వల్ల చర్మ సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా కాలి మడమలు, వేళ్ళ మధ్య చర్మం ఎర్రబడటం, దురద రావడం జరుగుతుంటుంది. ఈ సమస్య నివారణకు పెరుగలో పసుపు, ఉసిరిపొడి, శనగలపొడి, కొద్దిగా నమ్మరసం కలిపి సేప్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని వేళ్ల మధ్య, కాలి మడలకు రాసి, అరగంట తర్వాత చర్మ సమస్య తగ్గుతుంది. దీనిని బాడీ స్ర్కబ్ గా కూడా ఉపయోగించవచ్చు.



Click it and Unblock the Notifications