Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
సుగంధ పరిమళాల రోజ్ వాటర్ ఎలా ఉపయోగించాలి..?

అలాగే కేవలం గులాబీ పువ్వులతో చేసిన పుష్పగుచ్ఛాలకి చాలా గుర్తింపు ఉంది. గులాబీ పువ్వుల రేకులు, కాండం నుంచి గులాబీ నూనెని తయారు చేస్తారు. గులాబీ పువ్వుల రేకు నుండి తయారుచేసే రోజ్ వాటర్మనకి మార్కెట్లో దొరుకుతున్న రోజ్ వాటర్ వంటకాల్లో, సౌందర్య పోషణలో, వైద్య విధానంలో, ఆధ్మాత్మిక రంగంలో చాలా ప్రముఖంగా వినియోగిస్తున్నారు. ఈ రోజ్ వాటర్‌ని, రోజ్ ఆయిల్ తయారీలో ఉప ఉత్పత్తి గా తయారుచేస్తారు. రోజు వాటర్ ను చర్మం సంరక్షణలోనూ, కేశ సంరక్షణకు ఒక సహజ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. అయితే ఈరోజ్ వాటర్ ని మార్కెట్లో కొని తెచ్చుకోవడం కంటే, ఇంటి వద్దే తయారు చేసుకొని మీ సహజ చర్మ తత్వాన్ని పొందవచ్చు. అదెలాగో చూద్దాం...
ఇంట్లోనే రోజు వాటర్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం...?
1. ఒక బౌల్లో తాజా గులాబీ పువ్వుల రేకులను వేసి అందులో నీరు పోసి బాగా మరిగించాలి.
2. కాచిన తర్వాత క్రిందికి దింపుకొని ఒక గిన్నెలో పోసి మూతపెట్టి బాగా చల్లారనివ్వాలి. కొన్ని గంటలు చల్లారిన తర్వాత ఈ రోజ్ వాటర్ ను ఒక మూత ఉన్న డబ్బా లేదా బాటిల్లో నింపుకొని ఫ్రిజ్ లో పెట్టి 24 గంటలపాటు ఉంచాలి.
3. ఒక రోజు గడిచిన తర్వాత ప్రిజ్ లో నుండి బయటకు తీసి గట్టి మూత వుండే బాటిల్స్ లో వడపోసికొని ఈ తాజా, ఫ్రెష్ రోజ్ వాటర్ ను ఫ్రిజ్ లో నిల్వచేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వినియోగించుకోవచ్చు.
ముఖానికి రోజ్ వాటర్:
1. కాటన్ బాల్స్ ను రోజ్ వాటర్ లో ముంచి ముఖం మీద అద్దాలి. ఇలా చేయడం వల్ల చర్మం మాత్రమే శుభ్రపడదు. చర్మ గ్రంధును తెరచుకొనేలా చేసి, చర్మం తాజాగా ఉండేలా చేస్తుంది.
2. చర్మానికి తేమను అందించేందుకు కొన్ని రకాల ఫేస్ ప్యాకులలో ఈ రోజ్ వాటర్ ను కొన్ని చుక్కలు కలిపి ముఖానికి అప్లైచేసి, అరగంట తర్వాత శుభ్రం చేసుకొన్నట్లైతే ముఖం సున్నితంగా, కాంతివంతంగా తయారవుతుంది.
3. ముల్తానీ మట్టి: ఇది అన్ని ఫేస్ ప్యాక్స్ లో కంటే చాలా మంచి ఫేస్ ప్యాక్ ఇది వేసుకోవడం ద్వారా చర్మం ప్రకాశించేలా చేస్తుంది. ముల్తానీ మంట్టిలో కొద్దిగా రోజ్ వాటర్ చుక్కలను కాలిపి ఈ పేస్ట్ ను ముఖానికి, మెడకు పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రంచేసినట్లైతే ముఖం ప్రశావంతంగా మెరుస్తుంటుంది.
4. ఆరెంజ్ ఫేస్ ప్యాక్: చర్మం రంద్రాల తెరచుకొనేలా చేస్తుంది. ఆరెంజ్ తొక్కలను ఎండబెట్టి తర్వాత పౌడర్ చేసుకోవాలి. అందులో కొన్ని చుక్కల రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే ముఖం సహజ రూపంతో.. ప్రకాశవంతంగా తయారవుతుంది.



Click it and Unblock the Notifications