Latest Updates
-
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.!
సౌందర్య సుగుణాల రాశి టమోటో...!

వయసు మీదపడటంతో ఏర్పడే ముడతలకు చెక్ పెట్టాలంటే టమోటా గుజ్జుతో ప్యాక్ వేసుకుంటే సరిపోతుందని లండన్‌లోని రాయల్ సొసైటీ ఆఫ్ మెడిసన్ కళాశాల నిర్వహించిన పరిశోధనలో తేలింది. ఎరుపాటి టమోటాల గుజ్జును ముఖానికి ప్యాక్ వేసుకోవడమే గాకుండా.. క్రమం తప్పకుండా టమోటా జ్యూస్ తాగడం, వంటల్లో అధికంగా టమోటాలను చేర్చడంతో మహిళల అందం మరింత పెరుగుతుందని ప్రొఫెసర్ బిర్చ్-మచిన్ తెలిపారు.
టమోటోను ఫేస్ ప్యాక్ ను ముఖానికి ప్యాక్ వేయడం వల్ల చర్మం రంధ్రాలను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. ఈ ప్యాక్ వల్ల చర్మం తాజాగా ఉంటుంది. 21-47 వయసు గల మహిళలపై ఈ పరిశోధన చేయబడింది. ఈ పరిశోధనలో టమోటాలు తీసుకునే వారిలో సూర్యరశ్మి నుంచి చర్మాన్ని సంరక్షించగల సామర్థ్యం అధికంగా కలదని తెలిసింది.
టమోటోస్ తీసుకునే మహిళల్లో చర్మ రక్షణ పెరిగిందని తేలింది. ఐదు టేబుల్ స్పూన్లు (55గ్రాములు) టమోటా గుజ్జుకు పది గ్రాముల ఆలివ్ ఆయిల్‌ను ప్రతీరోజూ పన్నెండు వారాల పాటు వాడిన 20 మంది మహిళల్లో సాధారణ మహిళల కంటే చర్మ సౌందర్యం 33 శాతం మరింత పెరిగిందని పరిశోధనలో వెల్లడైంది.
టమోటోను తీసుకొని వాటిని బాగా గుజ్జులా తయారు చేసి అందులో కొద్దిగా ఓట్ మీల్ మరియు ఒక చెంచా పెరుగు కలిపి, ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రచేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సన్ టాన్ తొలగించి చర్మం మెరిసేలా చేస్తుంది.
చర్మం సున్నితంగా , ఎక్కువ కాలం ఫ్రెష్ గా ఉండాలంటే కొద్దిగా టమోటో గుజ్జులో లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే వేడితాపాన్ని తగ్గించి చర్మాన్ని దృడంగా ఉంచుతుంది.
మురొక ముఖ్యమైన కాంబినేషన్ ముల్తానీ మట్టికి కొద్దిగా టమోటో గుజ్జు మిక్స్ చేసి ముఖానికి వేసి ఇరవై నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. తర్వాత గోరు వెచ్చిన నీటితో శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ ముఖం మీద బ్లాక్ హెడ్స్ ఉన్నట్లైతే టమోటో ఫేస్ ప్యాక్ వేసుకొన్నా సరిపోతుంది. ఇది సహజ స్ర్కబ్బింగా ఉపయోగపడుతుంది.
సహజ చర్మ సౌందర్యానికి గంధం చాలా బాగా పనిచేస్తుంది. గంధానిలో కొంత టమోటో గుజ్జును కలిపి, ముఖానికి రాసుకొని కొద్ది సేపటి తర్వాత శుభ్రం చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం ప్రకాశవంతంగాను, సహజ అందంతో మెరుసిపోతుంది. ఈ టమోటోలతో ప్రతి రోజూ స్ర్కబ్బింగ్ చేసుకున్నా సహజ రూపాన్ని సంతరించుకుంటుంది. టమోటో జ్యూస్ లో కొద్దిగా నిమ్మరసం, గంధం కలిపి ముఖానికి , మెడకి అప్లై చేయాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
టైమ్ లేనప్పుడు మరో సహజమైనటువంటి పద్దతి టమోటో జ్యూస్ లో కొద్దిగా పాలు కలిపి ముఖానికి మెడకు అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications
