Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
మొటిమల మీద కొంత శ్రమ, కాస్త శ్రద్ధ పెడితే చాలు...అందం మీదే
ప్రస్తుత కాలుష్య వాతావరణంలో కొందరికి ముఖాన మొటిమలు పెద్ద సమస్యగా పరిణమిస్తున్నాయి. చర్మం జిడ్డుగా ఉండేవారిలో ఈ సమస్య ఎక్కువ. మొన్నమొన్నటిదాకా మొటిమల నివారణ అంత తేలిక కాదు అనుకునేవారు. ఇప్పుడలా కాదు. మొటిమలను తగ్గించుకునేందుకు ఎన్నో మందులొచ్చాయి. మొటిమలు ముఖంమీదే కాదు, వీపు భాగాన, ఉదార భాగాన కూడా వస్తాయి. ఇవి నొప్పిని, దురదను కలిగిస్తాయి. దాంతో చాలామంది మొటిమలను గిల్లుతూ, గోకుతూ ఉంటారు. అలా చేయడం ఎంతమాత్రం మంచిది కాదని చెప్తున్నారు నిపుణులు.
గిల్లడంవల్ల నొప్పి తగ్గకపోగా, మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. సాధారణంగా మొటిమలకు బెంజాయిల్ పెరాక్సాయిడ్, సాలిసైలిక్ యాసిడ్, ట్రేక్లోసన్ లాంటి యాంటీ బాక్టీరియల్ మందులతో చికిత్స చేస్తారు. ఈ మందులు క్రీములు లేదా జెల్ రూపంలో దొరుకుతాయి. ఇవి బాక్టీరియాను వెంటనే తొలగించి, మొటిమలను మాన్పుతాయి. చర్మాన్ని మృదువుగా కూడా మారుస్తాయి. విటమిన్-౩ తో కూడిన నికోటినమైడ్ లాంటి మందులు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ నూ కలిగించవు. మనం కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మొటిమలను నివారించుకోవచ్చు. చర్మాన్ని నిరంతరం సంరక్షించుకోవాలి. మొటిమలను అశ్రద్ధ చేయకుండా డాక్టర్ కు చూపించి చికిత్స చేయించుకోవాలి.

ఒక్క మొటిమ చాలు మన సంతోషాన్ని ధ్వంసం చేయడానికి. నొప్పిగా ఉండటమే కాకుండా అంద విహీనతకు కారణమౌతుంది. ఏ పార్టీకో, ఫంక్షన్ కో వెళ్ళాల్సివచ్చినప్పుడు ముక్కుమీదో, బుగ్గమీద మొటిమలు ఉన్నాయనుకోండి మహా వెలితిగా ఉంటుంది. కొంత శ్రమ, కాస్త శ్రద్ధ ఉంటే మొటిమలను నివారించుకోవడం ఏమంత కష్టం కాదు. మన శరీరంలో కళ్ళు, చెవులు, గుండె, ఊపిరితిత్తులు లాంటి అవయవాలతోబాటు చర్మం కూడా చాలా ముఖ్యమైనదని గుర్తుంచుకోవాలి. మొత్తం శరీరాన్ని అంతా కప్పి ఉంచేది చర్మమే కదా. కనుక చర్మాన్ని కాపాడుకుంటే మొటిమలు రావు. వచ్చినా తగ్గిపోతాయి. మందుల సంగతి అలా ఉంచి ఈ కింది జాగ్రత్తలు పాటించినట్లయితే మొటిమలు తగ్గుతాయి.
1. సొంటి, లవంగాలు నీటితో నూరి లేపనం తయారుచేసి రాస్తూ వుంటే మొటిమలు తగ్గుతాయి.
2. ముల్తాని మట్టిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే ఫలితం కనిపిస్తుంది. చర్మం పొడిగా, సున్నితంగా ఉంటే ఈ ప్యాక్ వేసుకోకూడదు.
3. జాజికాయను నీటితో అరగదీసి ఆ లేపనాన్ని ముఖానికి రాస్తే మొటిమలు తగ్గుతాయి.
4. నీరుల్లి గడ్డను సగానికి కోసి ఆ ముక్కను మొటిమలపై రుద్దుతూ వుంటే తగ్గుతాయి.
5. బియ్యం కడిగిన నీటిని మొటిమలపైన మృదువుగా రుద్దితే తగ్గుతాయి.
6. మొటిమ గనుక చితికినట్లయితే దానిమీద ఐస్ క్యూబ్ ఉంచి సుతిమెత్తగా రుద్దినట్లయితే అందులో ఉన్న రసి అంతా వచ్చేస్తుంది.
7. బయటకు వెళ్ళి వచ్చినప్పుడు, దుమ్ము చేరకుండా తప్పకుండా చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కోవాలి.
8. వేప ఆకులను నీళ్ళలో ఉడికించి, ఆ నీటిని బకెట్ నీళ్ళలో కలుపుకుని స్నానం చేస్తే ఎంతో మంచిది. ఇలా చేయడంవల్ల మొటిమలే కాదు అనేక రకాల చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి.
9. కస్తూరి పసుపును నిమ్మరసంతో కలిపి ఆ మిశ్రమాన్ని రాస్తే మొటిమలు తగ్గుతాయి. చిటికెడు పసుపు ముఖానికి రాసి, కొద్దిసేపటి తర్వాత ముఖం కడుక్కోవడం ద్వారా మొటిమలను తగ్గించుకోవచ్చు.
10. పుదీనా ఆకులను ముఖాన పరచి ఉంచి పావుగంట తర్వాత తీసి చల్లటి నీళ్ళతో ముఖాన్ని కడుక్కోవాలి. ఆకులను రుద్దనవసరం లేదు. అలా చేస్తే మొటిమలు మరింత నొప్పిచేస్తాయి.



Click it and Unblock the Notifications