Latest Updates
-
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
అందానికి దివ్వ ఔషదం పెరుగు

ఆరోగ్యాభివృద్ధికి పెరుగు చక్కని దివ్యౌషధం. ఎండాకాలంలో పెరుగు తినటం వలన మంచి జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. కడుపులో మంటను అరికడుతుంది. పెరుగు ప్రతిరోజు తీసుకోవడం వలన శరీరం దృఢత్వాన్ని, బలాన్ని సంతరించుకుంటుంది. బలమైన, చక్కని ఆరోగ్యానికి పెరుగు దివ్యమైనది. పెరుగులో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. పాలలో మీగడ తీయకుండా తయారయిన పెరుగు చాలా మంచిది. ఆరోగ్యంలోనే కాదు సౌందర్యంలోనూ పెరుగు ఎక్కువగా ఉపయోగపడుతుంది. మరి దానివల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
1. ఒక కప్పు పెరుగులో చెంచా నిమ్మరసం కలిపి ముఖానికి మర్ధన చేసి పావుగంట తర్వాత శుభ్రపరిస్తే మృతకణాలు తొలగిపోయి చర్మం శుభ్రపడుతుంది. ఇది మంచి క్లెన్సర్ గా ఉపయోగపడుతుంది. అలాగే అరకప్పు పెరుగులో చెంచా తేనె కలిపి గంటపాటు పక్కన ఉంచి ముఖం, మెడకు రాసి చేతులతో బాగా రుద్ది పది నిమిషాలయ్యాక చల్లటి నీళ్లతో కడిగేయాలి. చర్మం తాజాగా ఉంటుంది.
2. శనగపిండి, పెరుగు కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, పది నిముషాల తర్వాత, పరిశుభ్రమైన నీటితో కడగాలి. కొద్దిరోజులు ఇలా చేసినట్లయితే మొటిమలను దూరం చేసుకోవచ్చు.
3. పొడి చర్మతత్వం ఉన్న వారు పావు కప్పు ఓట్ మీల్ పొడికి తగినంత పెరుగును కలిపి ముఖానికి పూత వేయాలి. దాని మీద తేమ పూర్తిగా ఆరాక కడిగేస్తే ముఖం కొత్త కాంతులను సంతరించుకుంటుంది.
4. ముఖం మీద నల్లని మచ్చలు వున్నట్లయితే ముల్లంగి రసాన్ని తీసి తగినంత మజ్జిగను కలిపి ముఖానికి రాసుకొని అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి వేయాలి. మంచి ఫలితం ఉంటుంది.
5. పావు కప్పు అరటిపండు గుజ్జుకు కొద్దిగా పెరుగును కలిపి ముకానికి రాసి బాగా మర్దన చేయాలి. ఇరవై నిమిషాలయ్యాక ముందు గోరువెచ్చటి నీళ్లు, ఆ తర్వాత చన్నీళ్లతో కడిగేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది. తగినంత తేమ అందుతుంది.
6. నాలుగు చుక్కలు బాదంనూనె, పన్నీరు, ఒక స్పూన్ మజ్జిగ కలిపి స్నానానికి ముందు శరీరానికి, మెడకు, ముఖానికి రాసుకొని అరగంట తర్వాత టవల్‌తో తుడుచుకొని స్నానం చేస్తే చర్మసౌందర్యాన్ని పెంచుతుంది.
7. రెండు టీస్పూన్ల పెరుగులో నాలుగు చుక్కల దోసకాయ రసం కలిపి ఆ మిశ్రమంలో దూదిని ముంచి ముఖం తుడిచేస్తే చర్మం శుభ్రపడుతుంది. ఇలా వారానికోసారి చేయడం వల్ల మేను ప్రకాశవంతంగా తయారవుతుంది.
8. ఎండవలన చర్మం కమిలినట్లయితే, రెండు స్పూనుల టమోటా రసంలో ఐదు స్పూన్ల మజ్జిగ కలిపి రాసుకొని కొద్దిసేపయ్యాక కడిగేయాలి. నాలుగు స్పూన్ల మజ్జిగలో కొద్దిగా వెనిగర్ కలిపి కాళ్ళకు పట్టిస్తే బిరుసుతనాన్ని పోగొడుతుంది.



Click it and Unblock the Notifications
