Latest Updates
-
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.!
అకస్మాత్ గా శరీర రంగులో మార్పు..నల్లబడుతున్నారా...!?

1. స్నానం చేశాక తుడుచుకున్నప్పుడు చూసుకుంటే మన చర్మపు రంగు ఏమిటో ప్రస్తుతం బైటికి కనిపించే శరీర అవయవాల రంగేమిటో తెలుస్తుంది. అంత తేడా ఉండటానికి కారణం బట్టలతో చర్మాన్ని రక్షణగా ఉంచటం, అలా అని శరీరం మొత్తం బట్టలతో చుట్టుకోమని కాదు. శరీర రక్షణ ఎంత వరకు అవసరమో అంతవరకూ నిండుగా బట్టలు కప్పి ఉంచుకోవాలి.
2. స్నానం చేశాక కాలాన్ని బట్టి మాయిశ్చరైజర్ రాసుకోవటం, చలికాలం అయితే కోల్డ్‌క్రీమ్ రాసుకోవటం చేయాలి.
3. ఎండలో బైట తిరగేటప్పుడు కేర్ తీసుకోవాలి. సూర్యుని నుంచి వచ్చేయ యువి కిరణాలు చర్మసౌందర్యాన్ని డిస్ట్రబ్ చేస్తాయి. మెరిసిపోయే మీ అందాన్ని హరింపచేస్తాయి. సూర్యకిరణాల్లో హానిచేసే యువి-బి కిరణాల నుంచి కూడా విటమిన్-సి వల్ల రక్షణ పొందవచ్చు. శరీరఛాయ నల్లబడకుండా ఎక్స్‌ట్రా బెనిఫిట్ ఇస్తుంది.
4. విటమిన్ 'సి మెలనిన్ ఉత్పత్తిని నిషేధించి చర్మరంగును, కాంతిని మెరుగుపరుస్తుంది. వయసుని పళ్లరసాలు తగ్గిస్తాయి.
5. చర్మానికి కొత్తదనముతో పాటు చర్మం చిట్లకుండా ఉండాలంటే ఆహారంలో విటమిన్ 'ఎ’ కూడా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
6. ప్రతి రోజూ ముఖాన్నికనీసం నాలుగుసార్లైనా కడుక్కోవాలి.
7. ఒక్కరోజులో రెండు మూడు సార్లైనా లేదా అంత కంటే ఎక్కువే బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు కొంతమంది బద్దకిస్తుంటారు. అలా చేయకుండా బయట నుంచి ఇంటికి రాగానే ముఖం కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి. మగవాళ్లు ఎంత హెల్స్ చేసినా కొన్ని పనులు తప్పవు. రాగానే వాష్‌బేషిన్ దగ్గరకెళ్లి ముఖం కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి.
8. ఎవరైనా సరే, ఎంత రంగు వున్నావారైనా బైటకెళ్లి వచ్చినప్పుడు దుమ్ము, ధూళి ముఖానికి పట్టేసి నల్లబరుస్తుంది. అలానే నిర్లక్ష్యంగా నెలలు జరిగితే నల్లమరకలు కూడా ఏర్పడతాయి. అవి పోవటానికి నెలకి నాలుగుసార్లు ఫేషియల్ నెలలో పదిహేను రోజులకొకసారి ఫేస్ ప్యాక్ లు వెరసి ఆరునెలలు కష్టపడితే గానిపోవు.
9. అలా నల్లబడ్డాక బ్యూటీపార్లర్స్, క్రీమ్‌లు చకచక వాడేసి మళ్లీ మామూలుగా అయిపోయి ఆపై మళ్లీ యధాప్రకారం పట్టించుకోక పోవటం ఎక్కువమంది చేసే పొరపాటు. అందుకే ఒక అలవాటు చేసుకోవాలి. బయటికెళ్లి రాగానే ఫేస్ వాష్ చేసుకోవాలి. ఈ సూత్రాన్ని ఎక్కడున్నా, ఎక్కడికెళ్లినా మరవద్దు.
10. వాష్ బేషిన్ వద్ద సబ్బు, టవల్ ఎప్పుడూ ఉండేలా చూడండి. సోప్ నాసిరకానిది కాకుండా చూసుకోండి. ముఖం కడుక్కున్నప్పుడు టవల్ తో రుద్దేయ్యకుండా అద్దుతూ తుడుచుకోండి.



Click it and Unblock the Notifications
