Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
నిత్య యవ్వనస్తులు మీరు కావాలనుకుంటే..ఇలా చేయండి...!
ఆధునిక యుగంలో నలుగురితో సమానంగా జీవించేందుకు ఉద్యోగాలు, వృత్తులపై దృష్టి సారించడం ఎక్కువైపోయింది. ఆదాయం కోసం ఆరోగ్యం, అందం గురించి ఏమాత్రం లెక్క చేయని ఎంతో మంది ఉన్నారు. అలాంటివారు మీరైతే.. ఈ కథనం చదవాల్సిందే. వాతావరణ కాలుష్యం మనిషిని పట్టిపీడిస్తోంది. ఇలాంటి తరుణంలో రసాయినాలు కలిపిన మందులు వాడకం మరింత ప్రమాదకరం. వైద్యం కూడా ఖరీదైపోయింది. వెంట్రుకలు రాలిపోవడం, చర్మం ఎండిపోవడం వంటి సమస్యలకు చెక్ పెట్టి, యవ్వనంగా కనిపించాలంటే..ఏం చేయాలి?
ఎప్పటికైనా అన్ని వయసులూ దాటుకుని వృద్ధాప్యంలోకి అడుగుపెట్టక తప్పదు. కానీ వృద్ధాప్యంలో పడ్డాక కూడా 'మీకు ఇంత వయసున్నట్టు కనబడరు' అనే మెచ్చుకోలు పొందామంటే అది మన ఆరోగ్యాన్నీ, ఆహారపు అలవాట్లను సూచిస్తుంది. ఇంకా అనవసరపు ఆందోళనలకు లోనుకాకుండా, పొల్యూషన్ బారినపడకుండా ఉంటే కాలాన్ని పది- పదిహేనేళ్లు వెనక్కు తిప్పుకోవచ్చు. అదెలాగో పరిశీలిద్దామా!

ఆహారం: చిన్ననాటి నుంచే ఆహారపు అలవాట్లు ఒక క్రమపద్ధతిలో ఉంటే అది మన శరీర సౌందర్యానికి చక్కని పునాదిగా ఉపయోగపడుతుంది. శరీరానికి అందాల్సిన పోషకాలు, విటమిన్లు సమపాళ్లలో అందించాలి.

నూనెలు: ఆహారంలో నూనెలు, కొవ్వులు, కోలాలు, కాఫీలు లేకుండా చూసుకోవాలి. ఆరోగ్యంగా ఉన్నవారి శరీరతత్వం సౌందర్యాన్నే సూచిస్తుంది. మీరు తినే ఆహారంలో తప్పనిసరిగా ఇక్కడ ఇచ్చినవి జత చేసుకుంటే 'మీరే కాలేజి' అనిపించుకోవడం ఖాయం. ఇవన్నీ రోగ నిరోధక శక్తిని పెంచేవే కాక జీర్ణక్రియ చక్కగా పనిచేయడానికి ఉపయోగపడతాయి. మీ ఆహారంలో అవి ఎంత శాతం ఉంటున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి.

ప్రకృతి ప్రసాదితాలు పళ్లు-కూరలు : క్యాబేజీ, బ్రొకొలీ, ముల్లంగి, ఉసిరి, క్యారెట్ ఇవన్నీ విటమిన్లు సమృద్ధిగా గల కూరగాయలు. విటమిన్ ఎ, సిలు కంటి చూపుకు, కంటికి సంబంధించిన జబ్బులనుంచి రక్షణనిస్తాయి. కూరగాయలు ఎక్కువగా ఉడికిస్తే అందులో ఉన్న పోషకాలు, ఖనిజాలు నష్టపోతాం.

గ్రీన్ లీఫ్ : పాలకూర లేదా ఇతర ఆకుకూరలన్నీ శరీరానికి కావలసిన ఐరన్‌ను అందించి అనీమియా బారినపడకుండా చేస్తాయి. సమృద్ధిగా పోషకాలను అందించే కళ్లకింపైన రంగులున్న కూరగాయలు గుండె జబ్బులను, మానసిక వత్తిడి, డిజార్డర్స్ వంటి జబ్బుల నుంచి రక్షణనిస్తాయి. ఇంకా క్యాన్సర్‌ను నిరోధించే లక్షణాలు కూడా వీటిలో ఉన్నాయి.

పండ్లు: పళ్ల విషయానికొస్తే బొప్పాయి, అరటిపండు, సపోటాల్లో ఐరన్, పొటాషియం, విటమిన్ 'ఇ' ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మానికి నిగారింపునిచ్చి యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.

టమాటా: అధిక రోగనిరోధకశక్తి గల కూరగాయ టమాటా. ఇది గుండె సంబంధిత వ్యాధులను, ఉదర, నోటి, పేగు క్యాన్సర్లను అరికడుతుంది. ఇందులో 'ఎ', 'ఇ' విటమిన్లు ఎక్కువగా ఉండడం వల్ల కళ్లకు, చర్మానికి చాలా మంచిది. టమాటాను బ్యూటీపార్లర్‌లో ఫేస్ మాస్కుల్లో కూడా ఉపయోగిస్తారు.

ఎండుఫలాలు: బాదం, పిస్తా, జీడిపప్పుల్లో విటమిన్ ఇ, ఐరన్, పొటాషియమ్, జింక్, ఒమెగా-3 ఫాటీ ఆసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ శరీర సౌందర్యాన్ని పెంచేవి. ఇందులో ఉండే నూనెలో ముఖం కాంతివంతంగా కనిపించడానికి ఉపకరిస్తాయి.

పెరుగు-తేనె: పెరుగులో చలువ చేసే గుణం ఉంటుంది. ఇది అరుగుదలను మెరుగుపరిచే ఆహారం. తేనె శక్తినిచ్చే ఔషధం. తేనె వత్తిడిని తగ్గించడమే గాక మతిమరుపును కూడా అరికడుతుంది.

బెర్రీస్: స్ట్రాబెర్రీస్, నల్లద్రాక్ష, బ్లూబెర్రీస్, నేరేడు పండ్ల వంటి వాటిలో సైటో కెమికల్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ నిరోధకశక్తిని కలిగి ఉంటాయి. నేరేడుపండ్లలో విటమిన్ ఎ, సి ఉంటాయి. ఇవి చక్కెరవ్యాధిని నిరోధిస్తాయి. వీటిలో అరుగుదలను పెంచే గుణాలు కూడా ఉన్నాయి.

సోయాబీన్స్: ఇవి హార్మోన్ ఇంబాలెన్స్‌ను అరికడుతుంది. బ్రెస్ట్, పేగు, ఉదర క్యాన్సర్ల నివారణకు ఉపయోగపడతాయి. వయసు పైబడనీయకుండా ఇందులో ఉన్న సైటిక్ యాసిడ్స్ ఉపయోగపడతాయి. హార్ట్, అల్జీమర్ జబ్బులను, ఈస్ట్రోజన్‌ను అరికడుతుంది. మెనోపాజ్ దశను దరిచేరకుండా నిరోధిస్తుంది.

నీళ్లు-పళ్లరసాలు: శరీరం మెరుస్తూ ఉండాలంటే రోజూ ఎంత ఎక్కువ నీరుతాగితే అంత మంచిది. ఒకటి, రెండు కూరగాయల, లేదా పళ్లరసాలు తీసుకోవడం చాలా మంచిది. సొరకాయ, దోసకాయ, ఆరెంజ్, బత్తాయి, నిమ్మరసం మంచిది. కొబ్బరి నీళ్లలో కూడా అందాన్ని పెంచే గుణాలు అధికం.

పుచ్చకాయ: పుచ్చకాయ చర్మ సౌందర్యానికి చాలా మంచిది. ఇందులో ఎ, బి, సి విటమిన్‌లు పుష్కలంగా ఉండి చర్మాన్ని పునరుజ్జీవింప చేస్తాయి. గింజల్లో ఉన్న సోడియం, జింక్, విటమిన్-ఇ గుణాలు యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.

కొకోవా: ఇందులో ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా ఉండి ఆరోగ్యవంతమైన రక్తప్రసరణకు సహకరిస్తాయి. లో, హై బ్లడ్‌ప్రెషర్స్‌ను నివారిస్తుంది. దీన్ని కేకుల్లో, మిల్క్‌షేక్స్‌లో వాడడం మంచిది. ఇక చాక్లెట్స్ అయితే బిట్టర్ చాక్లెట్స్ ఉపయోగించాలి. ఇతర చాక్లెట్లలో ఉన్న ఫాట్ ఇందులో ఉండకపోవడం వల్ల ఇవి అందాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ ఇచ్చిన ఆహారపు సూత్రాలన్నీ పాటిస్తే ఇంతకు మించిన ఆరోగ్య, సౌందర్య సాధనాలు ఇక వేరే ఏమీ ఉండవనేది మీరే గ్రహిస్తారు.

వ్యాయామం: ఇవి కాకుండా కొద్దిపాటి వ్యాయామం సరిపోతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజే ఈ ఆరోగ్య సూత్రాల్ని పాటించి నవయవ్వనం సొంతం చేసుకోండి మరి.

గ్రీన్ టీ: మరో యాంటిఆక్సిండెంట్ గ్రీన్ టీ. ఇది కావల్సిన శక్తిని ఇస్తుంది. మైండ్ ను రిఫ్రెష్ చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. ఇది కూడా వయస్సు పైబడనీయకుండా ఉంచే వాటిలో ఒక అద్భుతమైనటువంటిదే.



Click it and Unblock the Notifications