Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఎప్పటికీ యవ్వనస్తులుగానే ఉంచే 20 సూపర్ ఫుడ్స్..!
అందంగా..ఆరోగ్యంగా ఉండాలంటే ఎవ్వరికైన ఇష్టమే. మరి అందానికి, ఆరోగ్యానికి ప్రతీక చర్మ సౌందర్యం. చర్మ ఆరోగ్యాన్ని బట్టి, వారి అందం, ఆరోగ్యాన్ని లెకింపవచ్చు. హెల్తీ స్కిన్ పొందడానికి చాలా రకాల మార్గాలున్నాయి. సాధారణంగా అందం కోసం మన చర్మం మీద రకరకాల ఫ్యాన్సీ క్రీములను అప్లై చేస్తుంటాం. మరియు ఖరీదైన స్కిన్ ట్రీట్మెంట్స్ ను తీసుకుంటాం. కానీ, మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని బేసిక్స్ రూల్స్ నే మర్చిపోతుంటాం. మరియు ఆహారం తీసుకోవడంలో కూడా అదే పొరపాటు చేస్తుంటాం. కొన్ని రకాల సూపర్ ఫుడ్స్ చర్మాన్ని శుభ్రపరచడానికి అద్భుతంగా పనిచేస్తాయి. ఆరోగ్యకరమైన చర్మం పునరుద్ధరణ ప్రక్రియను వేగం చేసే కొన్నిప్రత్యేక ఆహారాలు కూడా ఉన్నాయి.
కాబట్టి ప్రాథమికంగా, ఆరోగ్యకరమైన చర్మాన్ని అందంగా ఉంచడానికి కొన్ని ఆహారాలు పనిచేస్తాయి. ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యకరమైన, మంచి చర్మసౌందర్యం చాలా తక్కువ మందిలో చూస్తున్నాం. ఎందుకంటే మనం చాలా విధాలుగా కాలుష్యానికి గురిఅవుతున్నాం, అలాగే టాక్సిక్ ఫుడ్ కు ఆకర్షింపబడుతన్నాం. ఇవన్నీ కూడా చర్మ మీద ప్రభావాన్ని చూపెడుతాయి. దాని ఫలితంగా పిగ్మెంటేషన్, అలర్జీలు మరియు చర్మంలో కళంకం ఏర్పడుతుంది. కాబట్టి చర్మం కోసం కరెర్ట్ అయిన సూపర్ ఫుడ్స్ తీసుకోకపోతే వయస్సు పైబడ్డవారిగా కనిపించేలా చేస్తాయి. అటువంటి పరిస్థితుల్లో, ఆరోగ్యకరమైన చర్మం కోసం ఆహారాలు మాత్రమే మిమ్మల్ని యవ్వనంగా ఉంచడానికి సహాయపడుతాయి.
మీరు చిన్న వయస్సులోనే, వయస్సు మళ్ళినవారిగా కనబడకుండా ఉండాలనుకుంటే, అప్పుడు మీరు చర్మ ప్రక్షాళన ఆహారాలు(స్కిన్ క్లీనింగ్ ఫుడ్స్) తీసుకోవాలి. చర్మం నుండి టాక్సిన్స్(విషాన్ని)బయటకు నెట్టివేయడానికి మరియు స్కిన్ సెల్స్ పునరుద్దరణ ప్రక్రియ చురుకుగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకు కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవాలి. అప్పుడే చర్మం హెల్తీగా ఉంటుంది.
ఆరోగ్యకరమైన చర్మానికి, ఉపయోగకరమైన, మరియు నిరుపయోగమైన కొన్ని ఆహారాలను బోల్డ్ స్కై లిస్ట్ అవుట్ చేసింది. మరి ఆ ఆహారాలను మీ డైట్ లిస్ట్ లో చేర్చుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చు...

యూత్ ఫుల్ స్కిన్ పొందడానికి 20 సూపర్ ఫుడ్స్..!
పుదీనా: పుదీనా, ఇది ఒక మూలిక. ఇది జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది. దాంతో ఆ ప్రభావం స్కిన్ మీద కూడా చూపెడుతుంది. జీర్ణక్రియతో మీరు బాధపడుతున్నప్పుడు, మీ చర్మంలో చాలా బ్రేక్ అవుట్స్ కు దారితీస్తుంది. అలా కాకుండా ఉండాలంటే పుదీనా ఆకులు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల చర్మ రిలాక్స్ అవుతుంది.

యూత్ ఫుల్ స్కిన్ పొందడానికి 20 సూపర్ ఫుడ్స్..!
పెరుగు: పెరుగు లో విటమిన్ సి మరియు మిక్క్ ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే క్యాల్షియం మరియు ప్రోటీన్స్ కలిగిన ఈ డైరీప్రొడక్ట్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతాయి.

యూత్ ఫుల్ స్కిన్ పొందడానికి 20 సూపర్ ఫుడ్స్..!
బెల్ పెప్పర్: చర్మ ఆరోగ్యానికి బెల్ పెప్పర్(క్యాప్సికమ్ )ఒక సూపర్ ఫుడ్ వంటిది. ముఖ్యంగా ఎల్లో మరియు రెడ్ బెల్ పెప్పర్స్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల, వృద్ధాప్యం చర్మం వేగాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

యూత్ ఫుల్ స్కిన్ పొందడానికి 20 సూపర్ ఫుడ్స్..!
ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్, నూనెల్లో అన్నింటికంటే చాలా తక్కువ కొవ్వు కలిగిన నూనె ఆలివ్ ఆయిల్. సుద్దమైన ఆలివ్ ఆయిల్లో యాంటియాక్సిడెంట్ పుష్కలంగా ఉండి స్కిన్ సెల్ పునరుద్దరణను వేగవంతం చేస్తాయి.

యూత్ ఫుల్ స్కిన్ పొందడానికి 20 సూపర్ ఫుడ్స్..!
నెటేల్స్: నెటేల్స్, ఇవి టెక్నికల్ గా మీన గార్డెన్ లో కలుపు మొక్కల్లా ఉంటాయి. వీటిని టీతో తీసుకోవడం వల్ల, వీటితో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉండి, చర్మం విశ్రాంతి పొందడానికి సహాయపడుతుంది.

యూత్ ఫుల్ స్కిన్ పొందడానికి 20 సూపర్ ఫుడ్స్..!
సాల్మన్: సాల్మన్ ఫిష్ లో హెల్తీ ప్రోటీన్ పుష్కలంగా ఉంది. మరియు మరో కోల్డ్ వాటర్ ఫిష్, ఇవి చర్మానికి వైద్యపరమైన లక్షణాలను కలిగిస్తాయి.

యూత్ ఫుల్ స్కిన్ పొందడానికి 20 సూపర్ ఫుడ్స్..!
రెడ్ బీన్స్: కిడ్నీ బీన్స్ మరియు ఇతర లెగ్యుమ్స్ పుష్కలమైన జింక్ కలిగి ఉంటాయి. ఇవి స్కిన్ ఏజింగ్ మరియు చర్మంలో కళంకాన్ని, ఈ జింక్ నిరోధిస్తుంది. అందువల్లనే వెజిటేరియన్స్ రెడ్ కిడ్నీ బీన్స్ ను తీసుకోవడం చాలా ముఖ్యం.

యూత్ ఫుల్ స్కిన్ పొందడానికి 20 సూపర్ ఫుడ్స్..!
దానిమ్మ: దానిమ్మ పండు, చర్మాన్ని రక్షిస్తుంది. చర్మం డ్యామేజ్ కు దారితీసే ఫీరాడికల్స్ తో పోరాడటానికి దానిమ్మలోని ఫోలీఫినాయిల్స్ బాగా సహాయపడుతాయి. ఇంకా ఇవి చర్మంలోని రక్త ప్రసరణకు బాగా సహాయపడుతుంది.

యూత్ ఫుల్ స్కిన్ పొందడానికి 20 సూపర్ ఫుడ్స్..!
యాసియి: ఈ సిట్రస్ మరియు చాలా చిన్నగా నలుపుగా ఉండే బ్లాక్ బెర్రీస్ ను యాసియి అంటారు. వీటి అత్యంత శక్తివంతమైన యాంటీయాక్సిడెంట్లసు పుష్కలంగా ఉంటాయి. ఈ చిన్న బెర్రీలలో యాంటీఆక్సిడెంట్స్ అధిక మోతాదులో ఉండి, చర్మం యంగ్ గా ఉంచేందుకు బాగా సహాయపడుతుంది.

యూత్ ఫుల్ స్కిన్ పొందడానికి 20 సూపర్ ఫుడ్స్..!
గుడ్డులోని పచ్చసొన: గుడ్డులోని పచ్చసొన పుష్కలమైన జింక్ మరియు సెలీనియం కలిగి ఉంటుంది. ఇది స్కిన్ సెల్ పునరుద్దరణ ప్రక్రియకు బాగా సహాయపడుతాయి. కానీ అధికంగా గుడ్డు తినడం వల్ల శరీరంలో వేడి పుట్టి, స్కిన్ పగలడానికి కారణం కావచ్చు. కాబట్టి, రోజులో రెండు గుడ్లకు మించి తినకూడదు.

యూత్ ఫుల్ స్కిన్ పొందడానికి 20 సూపర్ ఫుడ్స్..!
ఆర్టిచోకెస్: ఇవి చూడటానికి అగ్లీగా మరియు విసుగుపుట్టించేవిగా ఉన్నాయి, కానీ ఆ పండ్లలో అద్భుతమైన ఒక గొప్ప యాంటీఆక్సిడెంట్స్ ఉండి అవి మనలోని బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడానికి సహాయపడుతాయి., అంతే కాదు, ఇవి సాధారణంగా జీర్ణక్రియ కోసం, ఆవిధంగా చర్మానికి మెరిసేటి, స్పష్టమైన చర్మాన్ని అంధిస్తుంది.

యూత్ ఫుల్ స్కిన్ పొందడానికి 20 సూపర్ ఫుడ్స్..!
డార్క్ బెర్రీస్: డార్క్ బెర్రీ అంటే, క్రాన్ బెర్రీ మరియు బ్లూ బెర్రీ వంటివి మీ చర్మ సౌందర్యానికి సహాయపడే పుష్కలమైన యాంటీఆక్సిడెంట్స్ ను అంధిస్తాయి. దాంతో మీలో వృద్ధాప్యంను ఆలస్యం చేసి మరియు డ్యామేజ్ అయిన చర్మాన్ని రిపేర్ చేస్తుంది.

యూత్ ఫుల్ స్కిన్ పొందడానికి 20 సూపర్ ఫుడ్స్..!
ఫెన్నల్: ఫెన్నల్ చర్మానికి మరియు కడుపుకు చల్లగా ఉంచుతుంది. మరియు మన చర్మంలో మొటిమలకు ప్రధానకారణం మన శరీరంలో వేడి అని మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి, మన శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఫెన్నల్ ను మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా ముఖ్యం.

యూత్ ఫుల్ స్కిన్ పొందడానికి 20 సూపర్ ఫుడ్స్..!
వాల్ నట్: వాల్ నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇంకా ఇందులో కాపర్ కూడా ఉండి, చర్మసౌందర్యానికి ఉపయోగపడే స్కిన్ కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.

యూత్ ఫుల్ స్కిన్ పొందడానికి 20 సూపర్ ఫుడ్స్..!
సన్ ఫ్లవర్ సీడ్స్: సన్ ఫ్లవర్ సీడ్స్ లో స్కిన్ ఫ్లెండ్లీ విటిమిన్ ఇ పుష్కలంగా ఉంది. ఇందులో ఇంకా మంచి కొలెస్ట్రాల్ మరియు ఆశ్చర్యకరమై లోక్యాలరీలను కలిగి ఉంది. కాబట్టి మీ చర్మసౌందర్యానికి గొప్పగా ఉపయోగపడే ఈ పుష్కలమైన విటమిన్ ఇ ప్రొద్దుతిరుగుడు విత్తనాలను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.

యూత్ ఫుల్ స్కిన్ పొందడానికి 20 సూపర్ ఫుడ్స్..!
సోయా: చర్మంలోని ఎగుడుదిగుడు వర్ణక పరిణామము తగ్గించడంలో మంచి ఫలితాలు సోయా ప్రొడక్ట్స్ లో గుర్తించారు . సోయా ప్రొడక్ట్స్ తినడం వల్ల హైపర్ పిగ్మెంటేషన్ ను తగ్గించుకోవచ్చు.

యూత్ ఫుల్ స్కిన్ పొందడానికి 20 సూపర్ ఫుడ్స్..!
గ్రీన్ టీ: గ్రీన్ టీ లో పుష్కలమైన యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి. చర్మసమస్యలను నివారించడంలో గ్రీన్ టీ చాలా గొప్ప ఔషదంలా పనిచేస్తుంది. వృద్ధాప్యంను ఆలస్యం చేస్తుంది.

యూత్ ఫుల్ స్కిన్ పొందడానికి 20 సూపర్ ఫుడ్స్..!
అవొకాడో: ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా కలిగినటువంటి ఒక వెజిటేరియన్ ఫుడ్. ఈ ఆయిల్ ఫ్రూట్ చర్మ వ్యాకోచానికి బాగా సహాయపడుతుంది.అయితే ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇది ఒక ఫ్యాటింగ్ ఆహారం.

యూత్ ఫుల్ స్కిన్ పొందడానికి 20 సూపర్ ఫుడ్స్..!
బ్రొకోలీ: యాంటీఆక్సిడెంట్స్ మరియు ఫైబర్ కంటెంట్ ఫుష్కలంగా ఉండే గ్రీన్ లీఫీ వెజిటేబుల్ అని మనందరికీ తెలిసిన విషయమే. ఆరోగ్యకరమైన చర్మానిక బ్రొకోలీ ఒక అద్భుతమైన ఆహారం.

యూత్ ఫుల్ స్కిన్ పొందడానికి 20 సూపర్ ఫుడ్స్..!
టమోటో: టమోటో సిట్రస్ యాసిడ్ పుష్కలం. అందువల్ల యాంటీఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా కలిగి ఉంటాయి. అయితే, స్కిన్ టోన్ ను అద్భుతంగా ఉంచే లికోపిన్ పుష్కలంగా కలిగి ఉంటుంది.



Click it and Unblock the Notifications











