Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
ఖర్చు చేయకుండానే సౌందర్యాన్ని పెంచే 7వస్తువులు
అందం గురించి చెప్పాలంటే చాలా జాగ్రత్తలు తీసుకొంటే తప్ప ఉన్న అందాన్ని మరింత రెటింపు చేసుకోలేరు. అయితే తమ అందాన్ని కాపాడుకోవడానికి మహిళలు నానా తంటాలు పడుతూ, డబ్బును వధా చేస్తుంటారు. చివరగా వారికి మిగిలేది జీరో. బ్యూటీ పార్లర్స్ కు వెళ్ళి వచ్చిన ఒకటి రెండు రోజులకు కొంచెం తేడా కనిపించినా తర్వాత.. తర్వాత తిరిగి యాథా స్థితికి చేరుకుంటుంది.
డబ్బు కర్చుతో పాటు, బ్యూటీ పార్లర్స్ లో ఉపయోగించే రసాయనాలు ప్రభావం ముఖంలో మొటిమలు, మచ్చలు. ప్రయోజన లేనివాటికి డబ్బు ఖర్చు చేసే కంటే ప్రయోజనం ఉన్న మన వంటింటి వస్తువును ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాఅని వంటింటిట్లో ఉపయోగించే అన్ని వస్తువులు సౌందర్యానికి ఉపయోగపడుతాయనుకోకూడదు. అందులో మంచి ఫలితాలనిచ్చే వస్తువు కొన్ని మీకోసం...

అందాన్ని పెంచుకోవడంలో బేకింగ్ సోడా ఒకటి. అది మీకు తెలుసా? మీ పళ్ళు తెల్లగా మిళమిళ మెరవాలన్నా.. గారపళ్ళు తెల్లబడాలన్నా ఈ బేకింగ్ సోడాను చిటికెడు పళ్ళు రుద్దే బ్రెష్ మీద చిలకరించుకొని రుద్దితే మంచి ఫలితాన్ని మీరు చూడవచ్చు. అలాగే బేకింగ్ సోడాతో పాటు కొంచె తేనె కూడా చేర్చి స్ర్కబ్ చేయాలి. కాబట్టి బేకింగ్ సోడాను వేస్ట్ చేయకుండా అందమైన పళ్ళ కోసం ఉపయోగించండి.

ఇంట్లో ఉపయోగించే ఆలివ్ ఆయిల్ ను శరీరానికి మాత్రమే కాదు, చర్మానికి కూడా మంచిది.!చాలా మంది ఈ ఆలివ్ ఆయిల్ ను బాడీ మాయిశ్చరైజర్ గానూ, కంటి మేకప్ ను తొలగించడానికి, స్లాప్ ట్రీట్మెంట్ లోనూ విరివిగా ఉపయోగిస్తుంటారు. ఎక్కువ జిడ్డు చర్మం కలిగిన వారు బాడీ ఆయిల్ కు బదులు ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.

ఇది అద్భుతమైన సువాసననిచ్చే వంటింటి మసాలా దినుసు. ఇది వంటలలో అద్భుతమైన రుచిని అంధిచడమే కాదు, చర్మ సౌందర్యాన్ని పెంచడంలో కూడా చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా మొటిమల మీదా దీని ప్రభావం బాగా పనిచేస్తుంది మూడు చెంచాల తేనెకె ఒక చెంచా చెక్క పొడిని చేర్చి మెత్తని పేస్ట్ లా తయారు చేసి రాత్రి పడుకొనే ముందు ముఖానికి పట్టించి, ఉదయాన్నే చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ప్రతి రోజూ మీ కురులను పొడిగా అందంగా ఉంచుకోవాలనుకొన్నప్పుడు ఈ డ్రైయర్స్ షీట్స్ బాగా ఉపయోగపడుతాయి. ఈ డ్రైయర్ షీట్స్ వివిధ రకాలుగా మార్కెట్లో లభ్యం అవుతాయి. కాబట్టి వీటిని తీసుకొని తలను తుడుచుకోవడం వల్ల కురులు మెత్తగా తడి ఆరేలా చేసి, చిక్కు పడకుండా చేస్తుంది.

కుకింగ్ స్ర్పే నిజమైన బ్యూటీ ప్రొడక్ట్. మీరు దరించే టాప్స్, కోట్స్ అతి త్వరగా ఆరబెట్టుకోవాలన్నా, చేతులకు నెయిల్ పాలిష్ త్వరగా ఆరేలా చేసి, డబుల్ కోట్ వేసుకోవాలన్నా, ఈ వాసనలేని కుక్కింగ్ స్ప్రేను ఉపయోగించవచ్చు.

టూత్ పేస్ట్ క్లాసిక్ బ్యూటి కిచెన్ సహాయకారిని. ఇది స్పాట్ ట్రీట్మెంట్ గా ఉపయోగపడుతుంది. కాలిన మచ్చలు పోగట్టడానికి, తక్షణ ఉపశమనానికి సహాయపడుతుంది. గోళ్ళును శుభ్రం చేసి తెల్లగా మార్చడానికి ఈ టూత్ పేస్ట్ చేతులకు రాసుకొని శుభ్రం చేసుకోవచ్చు.

పెట్రోలియం జెల్లీ తో చాలా రకాల ప్రయోజనకరమైన ఉపయోగాలున్నాయి. ఇది అందానికి మాత్రమే కాదు, కాలుకు తొడిగే షూ వల్ల కాళ్ళుకు ఏర్పడే బొబ్బలు నివారించడానికి బాగా పనిచేస్తుంది.



Click it and Unblock the Notifications