Latest Updates
-
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్‌తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే..
అలోవెరా జెల్ తో పట్టులాంటి చర్మం సౌందర్యం...
చూడటానికి ముళ్ళ మొక్కలా ఉంటుంది. అలోవెరా జెల్ ఉపయోగాలు అన్ని ఇన్ని కావు . చర్మ సంరక్షణ విషయంలో ఇది అద్భుతంగా పని చేస్తుందంటారు సౌదర్యనిపుణులు. చర్మ సంరక్షణ, ర్యాషెస్, కోతలు, గాయాలు, చర్మం కమిలిపోవటం మొదలగువాటికి అలోవెరా మంచి మెడిసినన్ అని అందరికి తెలిసిందే. అలోవెరా సహజసిద్ధమైన మాయిశ్చరైజర్. పోడిచర్మంతో బాధపడేవారు తరుచుగా అలోవెరా ఆయిల్ రాస్తుంటే చర్మం మృదువుగా మెత్తగా అవుతుంది. వాతావరణ కాలుష్యం కారణంగా మన చర్మం అనేక రకాల విషపదార్ధాల ప్రభావానికి గురవుతుంది. అలోవెరా జెల్ వాటి బారి నుంచి చర్మాన్ని పరిరక్షించి ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాదు అయితే అలోవెరా జ్యూస్ తాగితే వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు మరింత అధికం. ఎంతో సురక్షితం. ఈజ్యూస్ లో వివిధ పోషకాలు, విటమిన్లు, మినరల్స్, ఎమినో యాసిడ్స్ వంటి పోషకాలెన్నో వుంటాయి. ఇది జెల్ , ఆయింట్మెంట్ , లోషన్ ల రూపం లో అటు సౌందర్య సాధనం గా ఇటు ఔషధం గా దీని వాడుక విపరీతం గా పెరిగింది

1. అలోవెరా జెల్‌కి స్వచ్ఛమైన ఆలివ్ ఆయిల్‌ని కలపాలి. ఈ మిశ్రమాన్ని మొహం మీద ముడతలు ఉన్నచోట, కాళ్ళు పగుళ్ళు ఉన్నచోట రాసుకుంటే మాయం అవుతాయి.
2. అలోవెరా ఎండవల్ల పాడైన చర్మాన్ని తిరిగి పునర్జీవింపచేస్తుంది. ఆలివ్ ఆయిల్ చర్మానికి తేమని అందించి, సాగే గుణాన్ని పెంచుతుంది. మీ చర్మం మరీ పొడిబారిన తత్వం ఉన్నదైతే ఆలివ్ ఆయిల్ పాళ్ళని పెంచవచ్చు.
3. అలాగే చర్మం జిడ్డుతత్వం కలిగినదైతే మాత్రం ఆలివ్ ఆయిల్‌ని వాడకుండా అలోవెరాజెల్‌ని మాత్రమే వాడితే సరిపోతుంది. పైవన్నీ శ్రమంతో కూడినవనిపిస్తే ప్రతిరోజూ మీరు స్నానం చేసే నీటిలో పువ్వు రోజూ పూల రేకులు, రెండు చుక్కల ఆలివ్ ఆయిల్, రెండు చుక్కల నిమ్మరసం వేసి స్నానం చేయండి. స్నానానికి సబ్బుకు బదులు సున్నిపిండి వాడితే చర్మం మృదువుగా తయారువుతుంది.
4. అలో ఆలివ్ ఆయిల్, బాదం పేస్ట్ కలిపి ముఖానికి ఆప్లై చేయాలి. 20నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగితే ముఖం పొడిబారకుండా ఉంటుంది.
5. ఒక స్పూన్ గ్లిసరిన్, రెండు చుక్కల నిమ్మనూనె, ఒక స్పూన్ అరోమా జోజోవా ఆయిల్‌లో అలో జెల్‌ని కలపాలి. ఈ మిశ్రమాన్ని స్నానం చేసిన తర్వాత ముఖానికి రాసుకోవాలి. ఇది మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.
6. ఒక స్పూన్ అలో జెల్, ఒక స్పూన్ గంధం పొడి, అరచెంచా బొప్పాయి పొడి, రెండు చెంచాలు గులాబీరేకుల పొడిని లావెండర్ ఆయిల్‌తో కలపాలి. దీన్ని ఒంటికంతా పట్టించవచ్చు. దీనివల్ల చర్మం పగలకుండా ఉంటుంది.
7. బంగాళాదుంప రసం, నిమ్మరసం, అలోవెరా జెల్ కలిపి ముఖానికి రాయాలి. 20నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇది మంచి బ్లీచ్‌గా పనిచేస్తుంది. మొటిమల మచ్చలనూ తగ్గిస్తుంది.
8. బాదం ఆయిల్, మంజిస్తా పౌడర్, బొప్పాయిపొడిలో అలోవెరా జెల్ కలపాలి. దీన్ని ముఖానికి రాసి అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం నిగారిస్తుంది.
9. మొటిమల నివారణకు... అలోవెరా, వేపపౌడర్, గంధంపొడి కలిపి రాత్రి పూట రాయాలి. 20నిమిషాల తర్వాత కడిగేస్తే మొటిమల మచ్చలు తగ్గుతాయి.
10. సన్ బర్న్స్ నుంచి ఉపశమనాన్ని కలగజేస్తుంది . పురుగు కుట్టినా కాలినగాయాలైనా అలోవెరా జెల్ రాస్తుంటే ఫలితం త్వరగా కనిపిస్తుంది. ఏవైనా దెబ్బలు తగిలినప్ఫుడు ఆ భాగంలో బాక్టీరియా నివాసం ఏర్పరచుకుని అంత త్వరగా గాయాన్ని తగ్గనివ్వదు . అలోవెరా ఆ బ్యాక్టీరియా ని సమూలంగా నాశనం చేస్తుంది.



Click it and Unblock the Notifications