Latest Updates
-
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.!
ఏడే ఏడు రోజుల్లో ఫెయిర్ స్కిన్ పొందడం ఎలా?
సాధారణంగా చాలా మంది ఫెయిర్ గా మరియు మెరిసే చర్మ సౌందర్యాన్ని కలిగి ఉండాలని కోరుకుంటారు. అందుకు మార్కెట్లో వివిధ రకాలైన బ్యూటీ ప్రొడక్ట్ అందుబాటులో ఉన్నాయి. అవి మీ చర్మాన్ని కొన్ని వారల్లో ఫెయిర్ గా మార్చుతాయని హామీ ఇస్తుంటారు. అయితే అవేవీ పనిచేయవు. మనందరమూ ఫెయిర్ స్కిన్ పొందాలని కోరుకుంటాం. అందుకు కెమికల్స్ తో తయారు చేసిన ఖరీదైన ఫెయిర్ నెస్ క్రీమ్స్ కోసం పర్స్ ఖాలీ చేసుకోవడం కంటే..కొన్ని హోం రెమడీస్ తో నేచురల్ పద్దతులను ఉపయోగించి మీ చర్మం ఫెయిర్ గా మరియు మెరిసేలా మార్చుకోవచ్చు. ఈ హోం రెమడీస్ మీ రెగ్యులర్ స్కిన్ కేర్ లో చేర్చుకోవచ్చు.
మీ చర్మ ఛాయను మెరుగుపరుచుకోవడానికి వివిధ రకాల హోం రెమడీస్ అందుబాటులో ఉన్నాయి. ఉదా: నిమ్మరసం. ఇది మీ చర్మాన్ని శుభ్రపరుచుటకు మరియు చర్మ ఛాయను మార్చడానికి బాగా సహాయపడుతుంది . ఫేస్ ప్యాక్స్ అప్లై చేయడంతో పాటు, హెల్తీ డైట్ ను ఫాలో చేయడం చాలా అవసరం. శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపడానికి మరియు శరీరాన్ని శుభ్రం చేయడానికి ఫైబర్ మరియు నీటిశాతం అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం చాలా అవసరం. ఇవి కూడా చర్మం ఛాయను మార్చడంలో బాగా సహాయపడుతాయి.
చర్మం అలసినట్లు మరియు చాలా నిర్జీవంగా కనిపిస్తుంటే అధికంగా నీరు తీసుకోవాలి. శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగాలంటే తప్పక వ్యాయామం చేయడం చాలా అవసరం. మంచి చర్మ ఛాయను పొందాలంటే, చర్మానికి అధిక వేడి, ఎండతగలకుండా కాపాడుకోవడం ఒక మంచి పద్దతి. సూర్య రశ్మిలోని హానికరమైన యూవీ కిరణాలు మీ చర్మాన్ని రంగు మార్చడమే కాదు చర్మాన్ని డ్యామేజ్ చేస్తాయి. ఇవన్నీ కలిసి చర్మం పాడు చేయడానికి దారితీస్తాయి. కాబట్టి మీరు ఏడే ఏడు రోజుల్లో మెరిసేటి మరియు ఫెయిర్ స్కిన్ పొందాలని కోరుకుంటున్నట్లైతే అందుకు ఒక్కడ కొన్ని సింపుల్ చిట్కాలు లున్నాయి వాటిని ఉపయోగించి మంచి ఫలితాలను పొందండి..

ఫేస్ వాష్: ముఖాన్ని కడుక్కోవడం అనేది చాలా ముఖ్య విషయం. మీ చర్మాన్ని నిర్జీవంగా మరియు అలసటగా ఉన్నప్పుడు ముఖం కడుక్కోవడం వల్ల ముఖం మీద ఉన్న దుమ్ము, ధూళి తొలగిపోయి తాజాగా కనబడుతారు. కాబట్టి రోజులు రెండు మూడు సార్లు ముఖం కడుక్కోవడం చాలా అవసరం.

ఫెయిర్ ఫేస్ ప్యాక్స్: జస్ట్ 7 రోజుల్లో మీరు ఫెయిర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందడానికి వివిధ రకాల ఫేస్ ప్యాక్ లు ఉన్నాయి. ముఖానికి స్ర్కబ్ అప్లై చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది మరియు నేచురల్ గా చర్మ ఛాయ మెరుగుపడుతుంది.

నిమ్మ: నిమ్మ నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్. సహజంగానే మంచి చర్మ ఛాయను పెంపొంధించడానికి సహాయపడుతుంది. తాజా నిమ్మ తొక్కతో మీ ముఖాన్ని స్ర్కబ్ చేయడం లేదా ఫేస్ ప్యాక్ లలో మీ నిమ్మరసాన్ని చేర్చడం వల్ల ఏడు రోజుల్లో మీ చర్మానికి గ్లో వస్తుంది. కాబట్టి నిమ్మతొక్కతో ప్రతి రోజూ మీ ముఖం మీద స్ర్కబ్ చేయండి.

పండ్లు: పండ్లలో అరటిపండు, బొప్పాయి, అవొకాడో వంటివి చాలా ప్రభావంతంగా పనిచేసి మెరుగైన చర్మఛాయను తీసుకొస్తాయి. ఈ పండ్లను చర్మానికి అప్లై చేయడం వల్ల చాలా మంచి ఫలితాలను పొందవచ్చు.

సూర్య రశ్మికి దూరంగా: హానికరమైన యూవీ కిరణాలు స్కిన్ ను డ్యామేజ్ చేస్తాయి. మరియు సన్ టాన్ కు గురిచేస్తాయి. కాబట్టి ఫెయిర్ అండ్ టాన్ ఫ్రీ స్కిన్ పొందాలంటే సూర్య రశ్మికి దూరంగా ఉండండి.

బయట వెళితే హాట్ తప్పనిసరి: మీరు అవుట్ డోర్ కు వెళ్లినప్పుడు, సూర్య రశ్మి, దుమ్ము, ధూళి మరియు కాలుష్యం నుండి మీ చర్మానికి రక్షణ కల్పించడానికి హాట్ తప్పనిసరిగా ధరించండి.

ఎక్స్ ఫ్లోయేట్: వారంలో కొన్ని సార్లు చర్మాన్ని ఎక్స్ ఫ్లోయేట్ చేయడం వల్ల చర్మం శుభ్రపడుతుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. తాజా చర్మ సౌందర్యాన్ని రివీల్ చేస్తుంది.

పెరుగుతో మసాజ్: పెరగు ప్రోబయోటిక్ ఇది చర్మాన్ని శుభ్రపరుస్తుంది మరియు ఫెయిర్ గా మార్చుతుంది. కాబట్టి ప్రతి రోజూ పెరుగుతో ముఖానికి మసాజ్ చేయండి.

క్లీనింగ్: చర్మాన్ని శుభ్రపరచడంలో టీట్రీ మరియు అలోవెరా జెల్ చాలా ప్రభావంతంగా పనిచేస్తాయి. ఇంకా కాటన్ బాల్స్ ను పాలల్లో ముంచి ముఖానికి మసాజ్ చేయడం వల్ల డర్టీ ఫేస్ శుభ్రపడుతుంది.

నీళ్ళు త్రాగాలి: నీళ్ళును తగినంత త్రాగడం వల్ల శరీరాన్ని శుభ్రం చేసి చర్మానికి మంచి మెరుపు తీసుకొస్తుంది . మంచి చర్మఛాయను మరయు మెరిసే చర్మాన్ని పొందడానికి ఇదొక మంచి మార్గం.



Click it and Unblock the Notifications