Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
పదే పది నిముషాల్లో మిమ్మల్ని గ్లామరస్ గా మార్చే సులభ చిట్కాలు
ప్రస్తుతకాలంలో ఉరుకుల పరుగుల జీవితంలో రోజూ.. రోజూ గడవడం ఒక చాలెంజ్. ఎందకంటే ఉదయం నిద్రలేవగానే రెడీ అవ్వడం, కాలేజుల, ఆఫీసులంటూ పరుగుతీయడంతో ఇక మన ఆరోగ్యం మీద, అందం మీద శ్రద్ద పెట్టే సమయం ఏదీ.? ఇటువంటి సందర్భంలో ఒక రోజు సాయంత్రం దగ్గర బందువులు లేదా స్నేహితులు పార్టీలకు, ఫంక్షన్లకు పిలిస్తే ఎలా ఉంటుంది? పార్టీలు, పెళ్ళిళ్ళు, సోషియల్స్ ఫంక్షన్స్ కు సడన్ గా వెళ్ళాల్సి వస్తే మీ ముఖం డల్ గా.. నిర్జీవంగా.. కనిపిస్తుంది.
అప్పుడు ఉన్నట్లుండి బ్యూటీషియన్స్ లేదా స్పాలకు వెళ్ళలేరు. మీకు మీరే రెడీ అవ్వాలసిందే. అప్పుడు హడావిడిగా ఏది పడితే అదే వేసేసుకుని మేకస్ చేసేసుకుని వెళుతుంటారు. అలాకాకుండా పది నిముషాల్లో మీరు చక్కగా.. అందంగా తయారవ్వడానికి ఇంట్లో ఉన్నవస్తువులతోనే అందంగా పది నిముషాల్లో ఎలా తయారవ్వొచ్చు.
అందుకు కొన్ని పద్దతులు ఉన్నాయి. పది నిముషాల్లో మిమ్మల్ని గ్లామరస్ గా మార్చే పద్దతులేంటో ఒక సారి చూద్దాం...
పది నిముషాల్లో మీ ముఖంలో కొత్త మెరుపులు:

ఫేస్ ప్యాక్స్: రెండు మూడు ఆరెంజ్ తొనలు లేదా నిమ్మ మరియు కొన్ని చుక్కల తేనె వంటివాటితో పదినిముషాల్లో మీరు తాజాగా మారిపోవచ్చు. ఈ మూండింటి మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. దీన్ని అలాగే పదినిముషాలు ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి. అంతే ముఖ్యంలో కొత్త మెరుపు సంతరించుకుంటుంది.

మీమ్మల్ని అందంగా కనబడేలా చేసే మీ చర్మ సౌందర్యమే. కాబట్టి ముఖంలో మొటిమలు, మచ్చలు లేకుండా చేసుకొనేందుకు ప్రాధాన్యత ఇవ్వండి. మొటిమల మీద తక్షణ ప్రభావం చూసేదే రెడ్ సాయిల్(ఎర్రమట్టి). ఇది ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండి మొటిమలను పది నిముషాల్లో తగ్గిస్తుంది. అలాగే సాండిల్ వుడ్ పేస్ట్ లేదా టూత్ పేస్ట్ కూడా తక్షణ ప్రభావాన్ని చూపెడుతాయి.

పురుషులు తమ అందాన్నిచిటికెలో మెరుగుపరచుకోవాలంటే వారి గడ్డ, మీసాలు క్లీన్ షేవ్ చేయడం లేదా ఫ్రెంచ్ టైప్ గెడ్డం స్టైల్ మార్చడం వంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు.

స్ర్కబ్బింగ్-ఆప్రికాట్, వాల్ నట్ లేదా బాదాం పౌడర్ తో ముఖాన్ని చేతులను స్ర్కబ్ చేయడంతో బ్లాక్ హెడ్స్ ను తొలగించడం మాత్రమే కాదు, తక్షణ మెరుపును అందిస్తుంది.

శరీరం నుండి వచ్చే చెమట మరియు చెడు వాసన మనిషి యొక్క అందాన్ని హరిస్తుందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మీ బహుమూలల్లో షేవ్ చేయడం శుభ్రంగా ఉంచుకోవడం అన్నది మీ బ్యూటీలో ఒక భాగమే.

దంతసంరక్షణ-మీ పళ్ళను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. నోటి నుండి వచ్చే చెడు వాసన చీకాకు కలిగిస్తుంది. కాబట్టి పార్టీ, శుభకార్యాలకు వెళ్ళే ముందు బ్రెష్ చేయడం మరిచిపోకండి.

ఒక చెంచా పెరుగు, మరియు పసుపు, శెనగపిండి వంటివి అద్భుతమైన బ్లీచింగ్ ఏజెంట్స్ గా పనిచేస్తాయి. అంతే కాదు, పొటాటో లేదా టమోటోలతో ఫేస్ ను స్ర్కబ్ చేయవచ్చు. వీటితో శుభ్రం చేసుకోవడం వల్ల సన్ టాన్ తొలగించి, ముఖాన్ని బ్రైట్ గా చేస్తుంది.

చాలా మంది గోళ్ళ వాటి సంరక్షణ గురించి అంతగా పట్టించుకోరు, గోళ్ళను ట్రిమ్ చేయరు, కాబట్టి పార్టీలు, ఫంక్షన్లకు వెళ్ళే ముందు గోళ్ళు చక్కగా సరైన ఆకారంలో ఉన్నాయో లేదో చూసుకొని, ట్రిమ్ చేసుకోవాలి.

అధిక మేకప్ ను ఉపయోగించకూడదు. మీ చర్మఛాయకు అవసరం అగు మేకప్ మాత్రమే ఉపయోగించాలి. కొన్నిరకాల లిప్ స్టిక్స్ మరియు మస్కార వంటివి మిమ్మల్ని భయంకరంగా మార్చుతాయి.

పార్టీ, ఫంక్షన్లకు వెళ్ళే ముందు మీకు నప్పే దుస్తులతో పాటు ఆభరణాలు ధరించాలి. ఎక్కువ ఆభరణాలు ధరించడం వల్ల మీ అందం తగ్గిపోతుంది.

మీ హైబ్రోను ట్రిమ్ చేసుకోవడం వల్ల షేప్ తొలగి అందవిహీనంగా కనబడుతారు. కాబట్టి ఐబ్రోపెన్సిల్ ఉపయోగించి మీ అందాన్ని పెంచుకోవచ్చు.

హెయిట్ స్టై మీ ముఖసౌందర్యాన్ని బట్టి ఉండాలి.

ముఖానికి నాన్ గ్రీసి మాయిశ్చరైజర్ క్రీమ్ ను శరీరానికి మరియు ముఖానికి అప్లై చేయడం వల్ల ఫ్రెష్ గా మరియు మంచి షైనింగ్ తో మెరుస్తుంటారు.



Click it and Unblock the Notifications
