Latest Updates
-
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ రెసిపీ.. టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ దహీ తడ్కా -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో బ్రేకప్ అయ్యిందా? ఇకపై క్రిమినల్ కేసులు పెట్టడం అంత సులభం కాదు! -
నోరూరించే మామిడికాయ పచ్చడి..ప్రెషర్ కుక్కర్ లో అప్పటికప్పుడు ఈజీగా చేసేయండిలా.. -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బనానా లస్సీ.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్ది! -
డేటింగ్ యాప్స్‌లో కొత్త రకం ఉచ్చు.. మీ ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? -
పొద్దున్నే లేవగానే ఒళ్లంతా నొప్పులా? కండరాలు పట్టేస్తున్నాయా? ఆ వ్యాధులకు సంకేతమే! -
సర్వార్థ సిద్ధి యోగం, రవి యోగం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా..వైరల్ ఫిష్ ఫ్రై ఈజీగా ఇలా చేసేయండి -
బుద్ధ పూర్ణిమ ఈసారి ఎప్పుడొస్తోంది? బ్యాంక్ పనులు ఉన్నవారు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి! -
మేష రాశిలోకి బుధుడు: ఈ రాశులవారికి ఇక మాటల్లో పదును.. నిర్ణయాల్లో దూకుడు!
చర్మపై రంధ్రాలని సహజం గా నిర్మూలించడం ఎలా ?
చర్మం పై రంధ్రాల(పోర్) ని నిర్మూలించడానికి ముందు ఆ రంధ్రాలు ఏర్పడిన కారణాలను మీరు అన్వేషించాలి. చాలా మంది ఆ రంధ్రాల సైజు ని పూర్తిగా తగ్గించలేరు కానీ అవి చిన్నగా కనబటేటట్టు మాత్రం చెయ్యగలరు. వయసు మీద పడే కొద్దీ చర్మం లో ని ఎలాస్టిసిటీ తగ్గి చర్మం పై రంధ్రాలు పెద్దవి గా కనిపిస్తాయి.
ముఖం పై చర్మం మీద ఏర్పడిన రంధ్రాలు ఎంతో ఇబ్బందికి గురి చేస్తాయి. చర్మాన్ని కాంతి హీనంగా అందం లేకుండా చూపిస్తాయి. ముక్కు, నుదురు మరియు గడ్డం పై ఈ రంధ్రాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రంధ్రాల సైజు ని శాశ్వతం గా తగ్గించలేము. కానీ ఇవి చిన్నవిగా కనిపించేలా చెయ్యవచు.
చర్మం పై రంధ్రాలు ఏర్పడేందుకు కారణాలు
1. ఈ రంధ్రాల సైజు ని నిర్దేశించడం లో జన్యుశాస్త్రం ముఖ్య పాత్ర పోషిస్తుంది. దురదృష్టవశాత్తు జెనెటిక్స్ ద్వారా ఏర్పడిన వాటిని అరికట్టలేము.
2. జిడ్డు చర్మం కలిగిన వారికీ సహజం గా నే ఈ చర్మం పై రంధ్రాలు పెద్దవి గా ఉంటాయి. చర్మం ఉత్పత్తి చేసే సెబమ్ అనే నూనె చర్మాన్ని ఎండిపోకుండా కాపాడుతుంది.
3. మీది మరీ ఆయిలీ స్కిన్ అయితే దుమ్ము తేలికగా మీ చర్మానికి చేరిపోయి చర్మం పై ఉన్న రంద్రాలని మరింత పెద్దదిగా చేస్తుంది.
4. కాస్మెటిక్స్ మరియు దుమ్ము వలన ఈ రంధ్రాలు ముసుకుపోతాయి.
5. సరైన కాస్మెటిక్స్ వాడకం లేనందువల్ల కూడా ఈ రంధ్రాలు ఏర్పడతాయి
6. ముఖం పై నునె ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం
7. ముఖ చర్మాన్ని ఆరోగ్యం గా ఉంచుకోకపోవడం
హోం రెమెడీస్ - వంటింటి చిట్కాలు

ఐస్ క్యూబ్ : ఈ చికిత్స చాలా సులభం. ఒక కాటన్ వస్త్రం లో ఐస్ క్యూబ్ ని ఉంచి మీ ముఖం పై రుద్దాలి. చర్మం పై రంధ్రాలని ఐస్ క్యూబ్స్ గట్టిగా చేస్తాయి. చర్మాన్ని మెరుగ్గా చేసుకోవడానికి ఈ పద్దతిని ప్రతి ఉదయం పాటించండి. ఈ విధానం చర్మం సహజం గా ఉత్పత్తి చేసే సెబమ్ (నూనె గ్రంధులు) ని సాధారణం గా ఉంచడానికి తోడ్పడుతుంది.

తేనె : చర్మం పై రంధ్రలని తగ్గించడానికి తేనె ఎంత గానో ఉపయోగపడుతుంది. నూనె చర్మం గల వారికి కూడా ఈ చిట్కా ఉపయోగపడుతుంది. రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల తేనె లో నిమ్మ రసం కలిపి హెర్బ్ హనీ మాస్క్ ని తయారు చేసుకోండి . ఈ మిశ్రమం తో మీ చర్మాన్ని మసాజ్ చేసి కనీసం అయిదు నిమిషాల వరకు అలాగే ఉంచండి. ఆ తరువాత్ గోరువెచ్చటి నీటితో కడిగేయండి.

టమాటో రసం : చర్మం పై రంద్రాలని కుదించేందుకు టమాటో రసం ఉపయోగపడుతుంది. మీ ముఖం పై టమాటో రసాన్ని రాసి కనీసం 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత్ గోరువెచ్చటి నీటితో కడగండి. ఈ విధం గా వారం లో కనీసం మూడు సార్లు చేస్తే అందమైన చర్మం మీ సొంతం.

దోసకాయ రసం : చర్మ సౌందర్యం లో దోస రసానికి ప్రత్యేక స్థానం . పెద్ద చర్మ గ్రంధుల ఇబ్బందుల తో సహా అనేక ఇబ్బందులకు ఇది మంచి చిట్కా . ముఖానికి మాస్క్ లాగే కాక శరీరం లో ని వ్యర్ధాలను నిర్మూలించడానికి ఈ రసం తాగటానికి ఉపయోగపడుతుంది. దోసకాయ రసం లో కొంచెం ఉప్పు కలిపి మీ ముఖానికి అప్లై చేసి కొన్ని నిముషాలు అలాగే ఉంచాలి.

ఓట్ మీల్ : అయిదు టేబుల్ స్పూన్ల తేనే లో రెండు టేబుల్ స్పూన్ల ఓట్ మీల్ కలిపి, రెండు స్పూన్ల మిల్క్ పౌడర్ కూడా కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ముఖంపై సమానం గా ఈ మిశ్రమాన్ని అప్లై చేసి వృత్తాకారం లో మసాజ్ చెయ్యండి. ఆ తరువాత కడగండి. ఈ విధంగా వారం లో కనీసం రెండు సార్లు చెయ్యాలి.
చర్మం పై రంధ్రలని కుదించేందుకు చిట్కాలు

ఫేస్ వాష్: ప్రతి రోజు రాత్రి మేకప్ ని జాగ్రత్తగా శుభ్రం చేసుకోండి. సాలిసైక్లిక్ ఆసిడ్ కలిగిన సోప్ తో మీ ముఖాన్ని శుభ్రపరచుకోండి. ఈ పదార్ధం తో మురికి మరియు జిడ్డు ని వదిలించడం వల్ల చర్మపు రంధ్రాలు తెరచుకుని చర్మం శుభ్రపడుతుంది.

మాయిశ్చరైజర్: మాయిశ్చరైజర్ ఎంచుకునేటప్పుడు జిడ్డు లేనటువంటిది మరియు ఎలర్జీలు కలిగించనటువంటిది వాడండి. సాలిసైక్లిక్ ఆసిడ్ లో మాయిశ్చరైజర్ కలిసి ఉండడం వల్ల కొన్ని రకాల చర్మాలకు ఇరిటేషన్ కలిగించవచ్చు.

సోపులు: రసాయనాలు అధికంగా లేనటువంటి మేలు రకం సోపులను, గాఢత తక్కువ ఉన్న సోపులను మరియు మెడికేటడ్ సోపులను ఉపయోగించడం మేలు.

సన్ స్ర్కీన్ లోషన్: ప్రతి రోజు సన్ స్క్రీన్ వాడండి. నిజానికి చాలా మందికి సూర్య రశ్మి వల్ల చర్మ సౌందర్యం దెబ్బ తింటుందని తెలియదు. కొల్లజేన్ చర్మపు పొరలు సున్నితం గా ఉంటాయి.

అవసరమైనప్పుడు ప్రత్యెక శ్రద్ధ వహించండి. తగిన చికిత్స కొరకు చర్మ వైద్యున్ని సంప్రదించండి. మీ చర్మానికి తగినటువంటి అనేక ప్రత్యేక చికిత్స విధానాల ద్వారా కొన్ని చర్మ సమస్యలను అధిగమించవచ్చు. తెలివైన వినియోగాదారులుగా సరి అయిన చికిత్సని ఎంచుకోండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి చికిత్సని ఎంచుకోండి.



Click it and Unblock the Notifications