Latest Updates
-
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.!
వేసవి చర్మ సౌందర్యానికి మగవారి కోసం ప్రత్యేక ఫేస్ ప్యాక్ లు..!
ప్రస్తుత రోజుల్లో అందం గురించి ఎక్కువ కేర్ తీసుకోడం స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులు కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. వారి అందం గురించి వివిధ రకాల బ్యూటీ ట్రీట్మెంలు కూడా తీసుకుంటూ వారి అందాన్ని మెరుగుపరుచుకుంటున్నారు . అయితే వారి వారి చర్మ తత్వం తెలిసి ఉంటేనే తగు జాగ్రత్తలు తీసుకోవగలుగుతారు. సూర్య రశ్మి , దుమ్ము దూళి వల్ల చర్మం నిర్జీవంగా మరియు వయస్సు పైబడిన వారిగా కనబడేలా చేస్తుంది. కాబట్టి ఇటువంటి సమస్యల నివారణకు బ్యూటీ ట్రీట్మెంట్ ల వరకూ పోకుండా ఇంట్లోనే హోం మేడ్ ఫేస్ ప్యాక్ లను ఎందుకు ఉపయోగించకూడదు? హోం మేడ్ ఫేస్ ప్యాక్స్ తో చర్మం శుభ్రపడటమే కాదు స్కిన్ డ్యామేజ్ ను అరికడుతుంది. మరి మగవారి చర్మ సౌందర్యానికి హోం మేడ్ ఫేస్ ప్యాక్స్ ఎలా ఉపయోగించాలో చూద్దాం...

తాజా పుదీనా: ఈ సమ్మర్ లో చర్మానికి చల్లగా అనిపించే కూల్ మింట్ ఫేస్ ప్యాక్ కన్నా మరేది పనిచేస్తుంది?చర్మాన్నికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చర్మానికి చల్లదనాన్ని కల్పిస్తుంది. పుదీనా ఆకులను, కొద్దిగా పసుపు మిక్స్ లో వేసి బాగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు దీన్ని ముఖానికి పట్టించాలి . తర్వాత కళ్ళ మీద కీరదోసకాయ చక్రాలను పెట్టుకొని కొద్దిసేపు కదలకుండా 10-15నిముషాలు విశ్రాంతి తీసుకోవాలి . తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
చల్లాని పాలు: పాలు ఇంట్లో ఉండే తాజావి. చాలా ఇన్ట్రెస్టింగ్ ఫేస్ ప్యాక్ . దీన్ని మగవారు ప్రతి రోజూ వెసుకోవచ్చు . ఇది చర్మాన్ని మెరిపించడమే కాదు, చర్మాన్ని శుభ్రం చేసి చర్మ రంద్రాల్లో దాగిఉన్న మురికిని తొలగిస్తుంది. చల్లటి పాలలో కాటన్ బాల్స్ ను డిప్ చేసి ముఖానికి అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత 10-15నిముషాలు తర్వాత శుభ్రం చేసేసుకోవాలి. నిర్జీవమైన ఫేస్ ను ఇప్పుడు చూడండి ఎలా మెరిసిపోతుంటుదో.
అరటితో మ్యాజిక్: బాగా పండిన అరటి పండును మిక్సీ జార్ లో వేసి బాగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసుకొన్న అరటిపండుగుజ్జుకు రోజ్ వాటర్, ఆలివ్ ఆయిల్ మరియు కొంచెం కోకా బట్టర్ వేసి బాగా మిక్స్ చేసి, మీ ముఖానికి అప్లై చేయాలి. ఇతి బాగా ఆరేవరకూ 20 నిముషాల పాటు అలాగే ఉంచుకొని ఆ తర్వాత చల్లటి నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి ఈ ఫేస్ ప్యాక్ పురుషులకు చాలా వెరైటీ వండర్స్ ను కలిగిస్తుంది. అంతే కాదు మొటిమలు, మచ్చలు తొలగించడమే కాదు, చర్మంలో దాగిఉన్న మురికిని తొలగిస్తుంది.
బొప్పాయి: బొప్పాయి గుజ్జుకు కొద్దిగా నిమ్మరసం మరియు పాలు మిక్స్ చేసి బాగా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఇది చర్మాన్ని శుభ్రపరచడమే కాదు మరియు డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. ఇది తయారు చేసి వేసుకోవడం చాలా సులభం మరియు అన్ని రకాల చర్మతత్వాలకు ఉపయోగపడుతుంది.
కీరదోసకాయ: కీరదోస ఫేస్ ప్యాక్ మరో అద్భుతమైనటువంటిది. ఎవరైతే చర్మం చల్లగా ఉంచుకోవాలనుకుంటారో..మరియు చర్మాన్ని మెరిసేలా చేస్తుంది . కీరదోస గుజ్జులో నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇది తడి ఆరే వరకూ అలాగే ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఫలితం మీరే చూడండి.
మడ్ ఫేస్ ప్యాక్: మట్టితో ఫేస్ ప్యాక్ వేసుకోవడం మహిళ చర్మానికి మాత్రమే కాదు పురుషుల చర్మతత్వానికి కూడా బాగా సహాయపడుతుంది. ఇది బయట మార్కెట్లో సులభంగా దొరుకుతుంది . ఈ మట్టికి రోజ్ వాటర్ కలిపి మిక్స్ చేయాలి. అలాగే సాండిల్ వుడ్ పౌడర్ కూడా వేసి మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి .



Click it and Unblock the Notifications