Latest Updates
-
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.!
చర్మంలోని సహజ రంగును కాపాడుకోవడానికి చిట్కాలు
ప్రపంచం మొత్తంలో స్కిన్ పిగ్మెంటేషన్ సమస్యను చాలా మంది స్త్రీ , పురుషలు ఎదుర్కొంటున్న బ్యూటీ సమస్య. స్కిన్ పిగ్మెంటేషన్ నివారించుకోవడానికి అనేక మెడికేషన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఈరోజు. స్కిన్ పిగ్మెంటేషన్ సమస్యను నివారించుకోవడానికి అనేక రకాల ఖరీదైన స్కిన్ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్ మరియు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ సమస్యను నివారించుకోవాలంటే నేచురల్ హోం రెమడీస్ అద్భుతంగా సహాయపడుతాయి.
స్కిన్ పిగ్మెంటేషన్ అంటే చర్మం రంగు మారడం. కొందరికి ఎండలో తిరిగితే వెంటనే చర్మం నల్లబడటం జరుగుతుంటుంది. అంతే కాదు, వాతావరణంలో మార్పుల వల్ల, కాలుష్యం వల్ల కూడా స్కిన్ పిగ్మెంటేషన్ కు కారణం అవుతుంది. చర్మం రంగు అంటే స్వతహాగా చర్మం రంగు మారి దీని వలన అసమానమైన చర్మపు రంగుకు దారి తీయడం. ఈ చర్మపు రంగు మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. చర్మపు రంగు జన్యు పరంగా సిద్ధించి ఉండవచ్చు. ఎండలో ఎక్కువగా తిరగడం, ఒత్తిడి, మొటిమల మచ్చలు, హార్మోనుల స్థాయిలోని హెచ్చుతగ్గులు లేదా కాలుష్యం వంటి వాతావరణ మూలకాలు, దీనికి ఇతర కారణాలై ఉండవచ్చు.
దీనికి మీరేం చేయాలి!
చర్మం సహజ రంగును కాపాడుకొనే ఉపాయం:

ఎక్కువగా ఎండలో తిరగకండి:
బయట తిరేగే వారు సాధ్యమైనంత వరకూ ఎండను అవాయిడ్ చేయాలి. ఎండలో వెళ్ళదల్చుకుంటే తప్పకుండా, గొడుగు తీసుకెళ్ళాలి. సూర్య రశ్మిలోని యూవీ కిరణాలు చర్మం రంగును మీద ప్రభావం చూపెడుతుంది కాబట్టి సూర్య రశ్మికి దూరంగా ఉండటం చాలా మంచిది.

ఎస్ పి ఎఫ్ 30 ఉన్న సన్ స్క్రీన్ లోషన్ ను ప్రతి రోజు వాడండి:
ఎస్ పి ఎఫ్ 30ఉన్న సన్ స్క్రీన్ లోషన్ ఎండకాలంలోనే కాదు, ఏసీజన్ అయినా, శరీరానికి అప్లై చేయవచ్చు.

సన్ స్క్రీన్ లోషన్
ఒక వేళ మీరు బయట ఉన్నట్టయితే ప్రతి మూడు గంటల కొకసారి సన్ స్క్రీన్ లోషన్ ను తిరిగి పూయండి.

ట్రెటినోయిన్
రాత్రి వేళ్ళలో ఖచ్చితమైన సంరక్షణను పాటించండి. ట్రెటినోయిన్ లేదా కోజిక్ వంటి ఆమ్లాలు ఉన్న క్రీమును వాడండి.

కేరెట్ గుజ్జు
కేరెట్ గుజ్జును, ముల్తానా మట్టితో (ఫుల్లర్ మట్టి) కలిపి ఒక చిక్కటి గుజ్జుగా తయారు చేయండి. ఒక విటమిన్ సి బిళ్ళను పొడి చేసి కలపండి. మీ ముఖం పైన పూసి, కడగడానికి ముందు ఇరవై నిముషాల పాటు ఉంచండి. ఇలా ప్రతి వారం చేయండి.

పాల పిండి
4 టీ స్పూనుల పాల పిండిని తీసుకొని, హైడ్రోజన్ పెరాక్సైడ్ తో కలిపి పేస్ట్ లా చేయండి. దీనికి గ్లిసరిన్ కలిపి చర్మం రంగు మారిన ప్రదేశాలలో పూయండి. దీనిని 15-20 నిమిషాల పాటు ఉంచండి. తర్వాత చల్లటి నీటితో కడగండి. హైడ్రోజన్ పెరాక్సైడ్, గ్లిసరిన్ ఔషధాల దుకాణాల్లో సులువుగా లభ్యమౌతాయి.

బంగాళదుంప
ఒక బంగాళదుంపను తోలు తీసి కొన్ని చుక్కల నీటిని దాని పైన వేయండి. చర్మం పైన మచ్చలుగా ఉన్న ప్రాంతంలో రుద్దండి. బంగాళదుంప రసం చర్మం పై ఉన్న మచ్చల రంగును తగ్గించేందుకు దోహదం చేస్తుంది.

ఓట్ మీల్ పొడి
ఓట్ మీల్ పొడిని, పెరుగుతో కలిపి కొన్ని చుక్కల నిమ్మరసం, టమోటా రసం కూడా కలపండి. ఆశించిన ఫలితాలను సాధించడానికి వారానికొకసారి దీనిని ప్రభావిత ప్రాంతాలలో పూయండి.

నిమ్మరసం
తులసి ఆకులను, నిమ్మరసంతో కలిపి చర్మం రంగులోని మచ్చలను తగ్గించడానికి ప్రభావితప్రాంతాలలో పూయండి.

పంచదార
ఆలివ్ ఆయిల్ లో కలిపిన పంచదారతో మీ శరీర౦ పై రుద్దండి. పంచదార పూర్తిగా కరిగే దాక రుద్దాలి. దీన్ని మీ చేతులు, కాళ్ళు, మెడ, శరీరంలోని ఇతర ప్రభావిత ప్రాంతాలలో వాడవచ్చు.

తేనే
నిమ్మరసం, తేనే, బాదం నూనె ప్రతీదీ ఒక టీ స్పూన్ తీసుకోండి. సహజసిద్ధమైన మెరిసే చర్మం కోసం దీనిని మీ ముఖంపై పదిహేను నిమిషాల పాటు మర్దన చేయండి.

మంచి నీళ్ళు
తగినన్ని మంచి నీళ్ళు తాగడం వలన మీ శరీరంలోని మలినాలు తొలిగిపోతాయి. తద్వారా అన్ని చర్మ సమస్యల నుండి విముక్తి కలుగుతుంది

పచ్చి బొప్పాయి
పచ్చి బొప్పాయిను పచ్చి పాలతో కలిపి పది నిమిషాల పాటు ముఖంపై మర్దన చేయండి. ఈ లేపనం .మీ చర్మం పైన మచ్చలకు ప్రభావవంతమైన చికిత్స.

మజ్జిగ
మజ్జిగతో మొహాన్ని కడగడం వలన కూడా నల్ల మచ్చలను తగ్గించుకోవచ్చు. ఈ సులువైన గృహ నివారాణోపాయాల ద్వారా చర్మపు రంగులోని అసమానతలను తగ్గించకోవడానికి ప్రయత్నించండి. క్రమబద్దమైన చర్మ సంరక్షణ, ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం, మీ తరుఫున కొన్ని చర్మసంరక్షణ జాగ్రత్తలు మీ చర్మం లోని సహజ మెరుపును కాపాడుకోవడానికి సాయపడతాయి.



Click it and Unblock the Notifications
