Latest Updates
-
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి!
వేపతో మొటిమలు, మచ్చలు లేని కాంతివంతమైన చర్మం సౌందర్యం..
వేపాకు ఓ ఔషద మొక్క. వేపాకును మించిన ఔషధమేదీ లేదని మనం తరచూ వింటూనే ఉంటాం. ఇది చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుందన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఎన్నో రకాల ఔషద గుణాలున్న వేపాకులతో చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు. యాంటీ సెప్టిక్ లక్షణాలు కలిగి ఉన్న వేపాకు మంచి ఆస్ట్రిజెంట్ గా కూడా పనిచేస్తుంది. జిడ్డు స్వభావంతో ఉండే చర్మం కలిగినవారికి వేపాకు అద్భుతంగా పనిచేస్తుంది.
దీనిలో ఉండే యాంటిసెప్టిక్ గుణాలు గాయాలను పెరగకుండా, వాటివలన చర్మానికి ఎటువంటి హాని జరగకుండా కాపాడతాయి. అంతేకాకుండా విషజ్వరాలను అదుపుచేయగల శక్తిని కూడా వేపాకు కలిగి ఉంటుంది. కమిలిన, ఎర్రగా కందిపోయిన చర్మానికి వేపాకు ఇట్టే ఉపశమనాన్ని ఇస్తుంది. చర్మానికి ఎంతో చల్లదనాన్ని కూడా ఇస్తుంది. కొన్ని జ్వరాలు వచ్చి తగ్గాక వేపాకును స్నానానికి వాడటం మన సంప్రదాయంలో గమనించవచ్చు.

ఎలాంటి చర్మానికి: ఇది చర్మసౌందర్యానికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పా లంటే మహిళల చర్మతత్వానికి సరిపడే లక్షణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. ముఖంపై ఎటువంటి చర్మసంబంధ సమస్యలు తలెత్తినా వాటి నివారణకు వేపాకు ఎంతగానో ఉపకరిస్తూ సౌందర్య సాధనంలా పనిచేస్తుంది. ముఖానికి నునుపైన మెరిసే ఛాయను ఇస్తుంది. వేపతో తయారుచేసిన సౌందర్యసాధనాలు కూడా మనకు మార్కెట్లో ఎక్కువగా లభిస్తుంటాయి.
1. వేపఆకులు: ఓ కప్పు నీటిని స్టీలు గిన్నెలో పోసి, మరో కప్పు వేపాకులను ఆ నీటిలో వేసి 20 నిమిషాలపాటు బాగా మరిగించాలి. చల్లారిన తరువాత వడగట్టి ఫ్రిజ్‌లో భద్రపరచు కోవాలి. ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకున్న తరువాత ఫ్రిజ్‌లో భద్రపరచిన వేపాకు మిశ్రమాన్ని తీసుకుని ముఖానికి అద్దుకోవాలి. ఇలా క్రమంతప్పకుండా చేస్తే, ముఖంలో జిడ్డుతత్వంపోయి, ఎల్లప్పుడూ ఫ్రెష్‌గా కనిపిస్తుంది.
2. వేప ఆకుల పేస్ట్: కొన్ని వేపా ఆకులను వేడినీటిలో ఉడికించి మెత్తటి పేస్ట్ లా తయారు చేసి ఈ మిశ్రామన్ని ముఖానికి పట్టించాలి. పదిహేను నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. దాంతో కాంతివంతమైన మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. చర్మంలో దురద, ఎరుపుదనం, మొటిమలు, మచ్చలను తొలగిపోయేలా చేస్తుంది.
3. వేప, నిమ్మ మరియు రోజ్ వాటర్: ఇది మరొక హోం మేడ్ ఫేస్ ప్యాక్ ఇది ముఖంలో మెటిమలు, మచ్చలు పూర్తిగా తొలగించి ముఖంలో కొంత కాంతులను ఏర్పరుస్తుంది. ఒక బౌల్ తీసుకొని అందులో రోజ్ వాటర్ మరియు నిమ్మరసం వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే రెండు రోజుల్లో మీ ముఖంలో మొటిమలు, మచ్చలు మాయం అవుతాయి.
4. వేప, శెనగపిండి, పెరుగు: ఇది పొడి చర్మతత్వం కలవారు ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మిక్సింగ్ బౌల్లో ఒక టీస్సూన్ శెనగపిండి పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి తర్వాత వేప ఆకుల పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మాన్ని సున్నితంగా మార్చుతుంది.
5. వేపఆకలు-పాలు: సున్నితమైన, మెరిసే చర్మ సౌందర్య సొంత చేసుకోవాలంటే నిమ్మ ఆకుల పేస్ట్ కు కొద్దిగా పాలు మిక్స్ చేసి ముఖానికి, మెడకు పట్టించాలి. దాంతో తాజా, సున్నితంగా ఉండే చర్మం మీ సొంత అవుతుంది.
6. వెంట్రుకల సమస్యల నివారణా చికిత్సల్లో కూడా వేపాకులను విరివిగా వాడుతుంటారు. వేపాకు లను వేసి కాచిన నీటితో జుట్టును శుభ్రం చేస్తూ ఉంటే.. వెంట్రుకలు రాలటం తగ్గటమేగాకుండా, జుట్టు బాగా పెరుగుతుంది. అంతేగాకుండా వెంట్రుకలు నిగనిగలాడుతూ ఉంటాయి. పేలు, చుండ్రులాంటి సమస్యలకు సైతం వేపాకు రసం చక్కగా పనిచేస్తుంది. వేపాకు రసాన్ని వారానికి ఒకసారి రాసుకుంటూ ఉంటే జట్టు ఆరోగ్యంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications
