Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
కుంకుమపువ్వు ఫేస్ ప్యాక్ తో ముఖంలో గులాబీ మెరుపులు
బ్యూటీ ప్రొడక్ట్స్ లో అద్భుతమైనటువంటి వస్తువు కుంకుమ పువ్వు. సౌందర్యానికి కుంకుమ పువ్వు ఉపయోగించడం వల్ల ముఖంలో గులాబీ మెరుపులు మెరవాల్సిందే. కుంకుమ పువ్వు ఒకరకమైన ఖరీదైన సుగంధ ద్రవ్యము. ఈ భూభాగం లో అత్యంత ఆకర్ణీయమైనది , ఖరీదైనది , అద్భుత ఔషధ గుణాలు కలిగినది కుంకుమపువ్వు. కుంకుమ పువ్వును ఇంగ్లీషులో శాఫ్రాన్ ఫ్రాన్ అంటారు.
గర్భిణులు కుంకుమపువ్వు కలిపిన పాలు తాగితే పిల్లలు తెల్లగా పుడతార'ని అంటుంటారు. ఇది అపోహేనని కొందరు కొట్టిపారేస్తారు. ఏది నిజమో కచ్చితంగా తెలియకపోయినా... రంగూరుచీవాసనా ఉన్న అరుదైన సుగంధద్రవ్యమే కుంకుమపువ్వు. అందుకే అది అందరికీ 'ప్రియమైన' ఎర్ర బంగారం..!
కుంకుమ పువ్వు గంధంలా తయారుచేసి మొహానికి రాస్తే మొటిమలు తగ్గి, చర్మం సున్నితంగా ఆకర్షణీయంగా తయారవుతుంది. తాజా చర్మంతో ముఖం చర్మంలో మెరుపును తీసుకొస్తుంది. కాబట్టి కుంకుమ పువ్వుతో కొన్ని రకాల ఫేస్ ప్యాక్ లు ఇంట్లోనే ఎలా తయారు చేసుకొని అప్లై చేయాలో తెలుసుకుందాం...

1. కుంకుమ పువ్వు: ఇది చాలా సులభమైన ఫేస్ ప్యాక్. దీన్ని కొద్దినిముషాల్లోనే తయారు చేసేయవచ్చు. ఇక కుంకుమ పువ్వు, పాలు కలిస్తే ముఖంలో లేతగులాబీ మెరుపులు మెరవాల్సిందే. ఎందుకంటే చర్మానికి పాలు ఎంత అద్భుతమైన మార్పును తీసుకొస్తాయో.. కుంకుమ పువ్వు అంత కంటే రెంటింపు మార్పును తీసుకొస్తుంది కనుక. ఇదిమెటిమలు మచ్చలు పోగొడుతుంది. పాలను బాగా కాచి అందులో కుంకుమపువ్వు వేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానిక పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకొంటే మెరిసే చర్మం మీ సొంత అవుతుంది దీన్ని ప్రతి రోజూ లేదా వారినికి రెండు మూడు సార్లు అప్లై చేసుకోవచ్చు.
2. కుంకుమపువ్వు మరియు సాండిల్ వుడ్ పౌడర్: బ్యూటీ ఉత్పత్తుల్లో మరో అద్బుతమైన వస్తువు. మంచి గంధం. చాలా రకాల ఫేస్ ప్యాక్ లు సాండిల్ వుడ్ తోనే తయారు చేస్తారు. ఇది సున్నితమైన, ఆయిల్ చర్మం కలవారి చాలా మంచిది. ఇది సన్ టాన్, మొటిమలు మచ్చలనుండి రక్షణ కల్పిస్తుంది. కాబట్టి క్లియర్ మరియు గ్లోయింగ్ స్కిన్ కోరుకొనే వారు సాండిల్ వుడ్ పౌడర్ లో కుంకుమపువ్వు మిక్స్ చేసి కొద్దిగా పాలు చేసి మిక్స్ చేసి ముఖం, మెడకు పట్టించి శుభ్రం చేసుకోవాలి.
3. బొప్పాయి మరియు కుంకుమపువ్వు: బొప్పాయిలో యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్స్ అధికంగా ఉండటం వల్ల చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. అలాకోరుకొనే వారు ఈ హోం మేడ్ కుంకుమపువ్వు ఫేస్ ప్యాక్ ను ప్రయత్నించండి. ఒక మిక్సింగ్ బౌల్లో బొప్పాయి ముక్కలు, పాలు, తేనె మరియు కుంకుమపువ్వును వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించి పదిహేను నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.
4. కుంకుమపువ్వు -పాలు-నూనె: చర్మంలో కాంతిని పొందడానికి బాగా పనిచేసే ఫేస్ ప్యాక్ ఇది. ఇక బౌల్లో పాలు పోసి అందులో కుంకుమపువ్వు నానబెట్టాలి. తర్వాత అందులోనే కొన్ని చుక్కల రోజ్ వాటర్, కొబ్బరినూనెల లేదా ఆలివ్ ఆయిల్ వేసి, బ్రెడ్ ముక్కలు వేసి కలిపి ముఖానికి పట్టించి, పదినిముషాల తర్వాత స్ర్కబ్(రుద్దాలి)చేయాలి. దాంతో మీ చర్మంలో తప్పక మార్పుతీసుకొస్తుంది.



Click it and Unblock the Notifications