Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
పుచ్చకాయలోని హెల్త్ మరియు బ్యూటీ బెనిఫిట్స్...!
పుచ్చకాయ (Watermelon) నే కర్బూజా అని కూడా అంటారు. ఎండలో దాహార్తిని తీర్చుకోవాలంటే మొదట ప్రాధాన్యం ఇచ్చేది ఎర్రని పుచ్చకాయలకే. అన్ని సీజన్లలోనూ ఇవి దొరుకుతున్నా ఈ కాలంలో లభ్యమయ్యే వాటికి నాణ్యత, రుచీ ఎక్కువ. బి విటమిన్లు , పొటాషియం పుష్కలంగా ఉండే పుచ్చకాయ నుంచి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా అందుతాయి. బి విటమిన్లు శరీరానికి శక్తినందిస్తే.. పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. వడదెబ్బ బారినపడి శరీరం నిస్తేజం అయిపోకుండా కాపాడుతుంది. వేడికి కమిలిన చర్మానికి చల్లని పుచ్చకాయ గుజ్జును రాస్తే తిరిగి చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.
మనసును ఆహ్లాదపరిచే సువాసన... అంతకు మించి ఎక్కువ రుచి, తక్కువ కెలొ రీలు, కొవ్వు దీని ప్రత్యేకత. కాయలో యాంటీ ఆక్సిడెంట్‌గుణాలు అధికం. అందుకే హానికారక ఫ్రీరాడికల్స్‌ను అద్భుతంగా ఎదుర్కొంటుంది. ఎండల్లో చర్మం వడదెబ్బ బారినపడి కమిలిపోకుండా రక్షిస్తుంది. మెరిసే చర్మాన్ని అందిస్తుంది. అంతే కాదు ఇందులో బ్యూటీ మరియు స్కిన్ బెనిఫిట్స్ పుష్కలంగా ఉన్నాయి. బీ-కాంప్లెక్స్ విటమిన్లు సమృద్ధిగా ఉండటంతో వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లు దాడి చేయకుండా అడ్డుకుంటుంది. నియాసిన్, పాంటోథోనిక్ ఆమ్లం, విటమిన్ సి, మాంగనీస్‌లు దీనిలో అధికంగా ఉంటాయి. బి.పి.ని తగ్గిస్తుంది. ఈ పండులో అమినో యాసిడ్ " సిట్రులిన్" ఎక్కువగా ఉంటుంది . ఇది మరో ఎమినో యాసిడ్ " ఆర్జినిన్ " గా రూపంతరము చెందుతుంది . ఈ ఆర్జినిన్ ''ఇన్సులిన్ సెన్సిటివిటీ''ని పెంచుతుంది . దాంతో శరీరంలో పేరుకొన్న కొవ్వునిల్వలు భారీగా తగ్గుతాయి. ఇన్ని గుణాలున్న ఈ వాటర్ మెలోన్ ను చర్మానికి రాయడం కానీ లేదా ప్రతి రోజూ తినడం కానీ చేస్తే ఆరోగ్యం తో పాటు అందం కూడా సొంత అవుతుంది. చర్మ సంరక్షణలో బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం..

1. నేచురల్ టోనర్: ఈ ఎర్రని, జ్యూసీ ఫ్రూట్ నేచురల్ ఆస్ట్రిజెంట్ చర్మం రంగును మార్చుతుంది. అందుకు ఈ కర్జూజ గుజ్జును ముఖానకి మర్ధనా చేయాలి. ఈ తాజా వాటర్ మెలోన్ లో కొద్దిగా తేనె కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది ఆయిల్ చర్మానికి నేచురల్ గా పనిచేస్తుంది.
2. వృద్దాప్య ఛాయలను పోగొడుతుంది: వాటర్ మెలోన్ లో ఉండే లైకోపిన్, విటమిన్ సి మరియు విటమిన్ ఎ శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను తొలగించడంలో బాగా సహాయపడుతుంది. అంలాగే యాంటీఆక్సిడెంట్స్ కూడా ముడతలను, కళ్ళ క్రింద చారలను తొలగిస్తుంది.
3. చర్మానికి కావల్సినంత తేమను అందిస్తుంది: వాటర్ మెలోన్ జ్యూసీ ఫ్రూట్ కాబట్టి శరీరాన్ని ఎప్పడూ తేమగా ఉంచుతుంది. మీరు కనక పొడి చర్మంతో బాధపడుతున్నట్లైతే వాటర్ మెలోన్ మీద తేనె చిలకరించి ముఖానికి మాయిశ్చరైజ్ చేసుకోవాలి. డీహైడ్రేషన్ వల్ల ముఖం డల్ గా మరియు డ్రైగా ఉంచుతుంది. కాట్టి ఈ జ్యూస్ రెడ్ ఫ్రూట్ ను మీ డైలీ డైయట్ లో చేర్చుకోండి.
4. ఆయిల్ చర్మాన్ని తొలగిస్తుంది : ఇందులో ఉండే విటమిన్ ఎ చర్మలోపల ఉన్న నూనె మగ్రంధులను తగ్గిస్తుంది. దాంతో ముఖంలో జిడ్డు కూడా తగ్గి ముఖం తాజాగా ఉంటుంది.
ఈ సీజన్ లో మీకు అతి సులభంగా, చౌకగా దొరికే ఈ పండును తీసుకొచ్చి తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, బ్యూటీ బెనిఫిట్స్ ను కూడా సొంతం చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications
