Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
రంగు..రుచి..సువాసన....గల మామిడి అందానికి బేష్..!
పండ్ల రారాజు మామిడి పండు, వేసవి వచ్చేసింది పచ్చిమామిడికాయలు అక్కడక్కడ దర్శినమిచ్చేస్తున్నాయి. అయితే ఇక పండువి కూడా మార్కెట్లో దిగేస్తాయన్నమాట. మరో రెండు మూడు నెలలు మామిడి పండ్ల సీజన్. మామిడి పండ్లంటే అందరీ చాలా ఇష్టం వాటి వాసన, రుచి, రంగు ఇట్టే ఆకర్షించేస్తాయి. అంతే కాదండోయ్ వీటిలో ఆరోగ్యప్రయోజనాలు కూడా ఎక్కువే. ప్రతి రోజూ ఒక మామిడి పండును తీసుకోవడం వల్ల హెల్తీ డైట్ పూర్తవుతుంది. ఇవి మీ డైట్, మరియు టేస్ట్ ను ఫుల్ ఫిల్ చేయడం మాత్రమే కాదు అనేక స్కిన్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇది ఆశ్చర్యమే కావచ్చు. అయితే ఇది మాత్రం నిజం.

ఎందుకంటే మామిడిలోని గుణాలు నల్లమచ్చలను, మొటిమలరు పోగొట్టి ముఖంలో కొత్తదనం, గ్లోయింగ్ స్కిన్ ను నింపుతుంది. మామిడిలో ఉండే పుష్కలమైన న్యూట్రీషియన్స్, విటమిన్ ఎ మరియు బీటాకెరోటిన్ ఇవన్నీ కూడా చర్మానికి రక్షణ కల్పించి అందంగా తీర్చిదిద్దుతుంది. మరి మామిడి పండు ఉపయోగించి చర్మంలో మార్పులు
స్ర్కబ్: ఒక చెంచా మామిడి పండు గుజ్జులో అర చెంచా పాలు లేదా పాల పౌడర్ మిక్స్ చేసి, తేనె కూడా మిక్స్ ముఖానికి అప్లై చేసి బాగా స్ర్కబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ తొలగిపోతుంది. బ్లాక్ హెడ్స్ తొలగించబడం ముఖ్యం మెరుస్తుంటుంది.
మామిడి తొక్క : మామిడి తొక్కను ఎండ బెట్టి పొడి చేసుకొని, ఇదే విధంగా ముఖానికి స్ర్కబ్బింగ్ మిశ్రమంలో కలుపుకొని ముఖానికి మర్ధన చేయవచ్చు, మామిడి పొడి, ఒక చెంచా పెరుగు, బాగామిక్స్ చేసి ఫేస్ ప్యాక్ లా వేసుకొని, అరగంట తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
పచ్చమామిడి జ్యూస్ : చిన్న మామిడి కాయలు, పచ్చివి ఉన్నట్లైతే వాటిని చక్రల్లా కట్ చేసి, వేడి నీటిలో వేసి ఉడికించుకోవాలి. ఇప్పుుడు ఈ నీటితో మీ ముఖాన్ని శుభ్రం పరచుకోవాలి. ఇది అద్భుతమైన ఆస్ట్రిజెంట్ గా పనిచస్తుంది.
మాంగ్యో క్లెన్సర్: ఒక చెంచా గోధుమపిండి, కొద్దిగా మామిడి పండు గుజ్జు వేసి రెండింటినీ బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల ఇది ఫర్ ఫెక్ట్ యాస్ట్రిజెంట్ ను ఉపయోగపడుతుంది. ఇది చర్మ రంధ్రాలు తెరచుకొనేలా చేసి, చర్మాన్ని శుభ్రపరుస్తుంది.
సన్ టాన్ తొలగిస్తుంది. మామిడి డిటానింగ్ ఏజెంట్ ను పనిచేస్తుంది. పచ్చిమామిడి తొక్క లేదా పండిన మామిడి తొక్కను ముఖానికి, చేతులకు బాగా రుద్దాలి. అవసరం అయితై మిల్క్ క్రీమ్ ఉపయోగించి కూడా స్ర్కబ్ చేయవచ్చు. తర్వాత ఈ మిశ్రమాన్ిన 10-15నిముషాలు అలాగే ఉండనిచ్చి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేయడం వల్ల సన్ టాన్ తొలగిపోతుంది.
మామిడి -బాదాం ఫేస్ వాష్: ఒక చెంచా మామిడి గుజ్జు మరియు బాదాం పౌడర్ మరియు ఒక చెంచా పాలు, వేసి బాగా మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి , అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి . ఇది అన్ని రకాల చర్మతత్వానికి ఉపయోగపడుతుంది.
మ్యాంగో -ఓట్ మీల్ ఫేస్ ప్యాక్: ఇది సున్నిత చర్మ తత్వం కల వారి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మామిడి పండు గుజ్జును, ఓట్ మీల్, పాలు, మరియు తేనె ను బాగా మిక్స్ చేయాలి. ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసి, తడి ఆరిన తర్వాత, ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15నిముషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications