Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
పెదాలు నల్లగా మారడానికి 8 ప్రధాన కారణాలు.!
సాధారణంగా అందంగా కనిపించే మోములో విరిసే చిరునవ్వు, హరివిల్లులా వంగే అధర సౌందర్యం ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తుంది. అంత కాదు మిమ్మల్ని అందంగా మార్చుతుంది. ముఖ్యంగా పింక్ లిప్స్ మీ చిరువునవ్వును మరింత ప్రకాశవంతంగా కనబడేలా చేస్తుంది. కానీ, ప్రస్తుత కాలంలో చాలా మంది వారి అటువంటి అందమైన సున్నితమైన పెదాల అందాన్ని పింక్ లిప్స్ ను కోల్పోయారు. వారి పెదవులు నల్లగా మరియు పగులిన పెదాల్లా మారుతున్నాయి. ఇలాంటి పెదవుల కలవారు, ఎంత అందంగా ఉన్నా సరే పెదాలు నల్లగా ఉంటే ఆ అందం అంతా వ్యర్థంగా అనిపిస్తుంది. మీ ముఖం వికారంగా కనిపించేలా చేస్తుంది. అటువంటి పెదాల(సమస్య)ను కాస్మోటిక్స్ తో దాచడం అంత సులభం కాదు, కాస్మొటిక్స్ ఉపయోగం వల్ల అవి మరింత నులుపుగా మారడానికి దారితీయవచ్చు.
అందుకు, మీరు ధూమపానం మరియు కెఫిన్ వంటివి వదిలిపెట్టడం ద్వారా మీ పెదవుల నష్టాన్ని చక్కదిద్దుకోవచ్చు. పెదాలకు యూవీ కిరణాల ప్రభావం తగల కుండా లిప్ బామ్స్ ను ఉపయోగించాలి.. ఇంకా వీటితో పాటు, సహజ పదార్థాలతో స్ర్కబ్బింగ్ చేయడం వల్ల పెదాల మీద పెళుసుగా ఊడివచ్చే డెడ్ స్కిన్ తొలగించవచ్చు. ఇంకా మీ పెదాలు ఎల్లప్పుడూ తేమగా ఉంచుకోవడంతో పాటు, మాయిశ్చరైజ్ ను నిర్ధారించుకోండి. పెదాల ఆరోగ్యానికి ఒక ఆరోగ్యకరమైన మరియు సమతుల్య ఆహారం తీసుకోవాలి. దాంతో పాటు ప్రతి రోజూ 8గ్లాసుల నీరు తప్పని సరిగా తీసుకోవాలి. ఇంకా మీ పెదాలను నాలుకతో తడపడం లేదా కొరకడ వంటివి చేయకుండా ఉండాలి.
ఈ డార్క్ లిప్స్ అనేది ఒక అసాధారమైన సమస్య కాదు. నల్లగా, అసహ్యంగా మారిన పెదాలను తిరిగా మునపటి స్థితికి తీసుకు రావడానికి, పెదాలు పింక్ కలర్ లో ఆకర్షించడానికి వివిధ రకాల మార్గాలున్నాయి. కానీ, వాటిని పాటించడానికంటే ముందు పెదాలు నల్లగా మారడానికి మనం తెలుసుకోవల్సిన మరికొన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి మీ పెదాలను నల్లగా మార్చేటటువంటి విషయాలకు క్రింది విధంగా పరిశీలించండి...

స్మోకింగ్ : స్మోకింగ్ వల్ల పెదాలు నల్లగా మారుతాయే విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. సిగరెట్స్ లో ఉన్ననికోటిన్ పెదాలను నల్లగా మార్చుతుంది మరియు పెదాలు సహజ రంగును కోల్పోయి అసహ్యంగా కనబడుతాయి. ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా హరించేసే ఈ ధూమపానాన్ని వెంటనే నిలిపివేయడం ఉత్తమ పద్దతి.

కెఫిన్: కాఫీలోని కెఫిన్ మన పళ్ళను మరకలు పడేలా చేస్తాయన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. మరియు పళ్ళను పసుపుపచ్చగా మార్చుతాయి. కాఫీ, టీలు త్రాగడం వల్ల మరో సైడ్ ఎఫెక్ట్ పెదాలు కూడా నల్లగా మారుతాయి. మీరు తీసుకొనే మోతాదును బట్టే మీ పెదాలు నల్లగా మారడం జరుగుతుంది. దీన్ని నివారించాలంటే కాఫీ, టీలతో పాటు తగినన్ని నీళ్ళు కూడా తీసుకోవడం ఉత్తమ పద్దతి.

సూర్యుని ప్రభావం: సూర్యకిరణాలు చర్మం, పెదవుల మీద సున్నత చర్మ మీద తగిలినప్పుడు అక్కడ ఉండే మెలనిన్ ఉత్పత్తి పెంచుతుంది. మన పెదాలు చాలా సున్నితంగా ఉంచుతాయి. సూర్య రశ్మి వల్ల దీర్ఘకాలం పాటు పెదాలు నల్లగా మారడం జరుగుతుంది. దీన్ని నివారంచడం కోసం లిప్ బామ్స్ ను ఉపయోగించవచ్చు.

లిప్ ప్రొడక్ట్స్: మీరు పెదాల అందం కోసం ఉపయోగించే లిప్ ప్రొడక్ట్స్ మీద చాలా జాగ్రత్త వహించాలి. లోక్వాలిటీ లిప్ స్టిక్స్ పెదాలను నల్లగా మార్చుతాయి. అంతే కాదు ఇవి పెదాల అందాన్ని పాడు చేస్తూ పెదాలకు అలెర్జీని కలిగిస్తాయి. కాబట్టి పెదాలకు ఉపయోగించే కాస్మోటిక్స్ నాణ్యమైన వాటిని ఎంపిక చేసుకోవాలి.

హైడ్రేషన్: తగినంత నీరు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ కు గురిఅవుతారు. ఫలితంగా పెదాలు ఎండిపోయి మరింత నల్లగా మారుతాయి. కాబట్టి ప్రతి రోజూ తగినన్ని నీరు 2-3లీటర్ల నీరు త్రాగడం వల్ల మీ శరీరానికి హైడ్రేషన్ కలిగించి చర్మంతో పాటు పెదాలను తేమగా ఉంచుకోవచ్చు.

పెదాలను తడిచేయడం: పెదాలను కొరకడం, పెదాలను తరచూ తడిచేస్తుండం వల్ల కూడా నల్లగా మారుతాయని కొందరు శాస్త్రవేత్తలు నిరూపించబడ్డాయి. పెదాలను తడి చేయడం వల్ల పెదాలు నల్లగా మారుతాయి మరియు పెదాల పగుళ్ళకు దారితీస్తుంది. లాలాజంతో పెదాలను తడి చేయడం వల్ల పెదాలు త్వరగా పొడిబారడానికి కారణం అవుతుంది.

డైట్: విటమిన్ల లోపం వల్ల కూడా పెదాలు నల్లగా మారుతాయి. విటమిన్ సి లోపిస్తే పెదాల నల్లబడటం జరుగుతుంది. కాబట్టి మీ తీసుకొనే ఆహారంలో సమతుల ఆహారమై ఉండాలి. అందుకు తాజా పండ్లు మరియు తాజా కూరగాయలను తీసుకోవాలి.

అలెర్జీ: కొన్ని కాస్మోటిక్స్ వల్ల పెదాల మీద అలెర్జీ చెందుతాయి. దాంతో పెదాలు మరింత నల్లగా మారుతాయి . మీరు పెదాలకు ఉపయోగించే లిప్ స్టిక్స్ లో కొన్ని రంగులు లేదా ప్రతి చర్య కలిగించే పరిమళాలు కలిగి ఉండవచ్చు. అవి మీ పెదాలకు అలెర్జీ కలిగించవచ్చు. కాబట్టి అటువంటివి కొనడానికి ముందు మీ చర్మ మీద వాటిని వేసుకొని పరీక్షించిన తర్వాత కొనుగోలు చేయడం మంచిది.



Click it and Unblock the Notifications