Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఆరోగ్యంగా ఉంటూనే బ్యూటిఫుల్ గా కనిపించడం ఎలా
ప్రస్తుత రోజుల్లో నిత్యం యవ్వనంగా..అందంగా కనబడుటకోసం స్త్రీ, పురుషులు ఇద్దరిలోని ఒక నిర్ధిష్టమైన కోరిక ఉంది. సరైన చర్మ సంరక్షణ మరియు కేశ సంరక్షణ తీసుకొనే జాగ్రత్తల వల్లే శరీరం అందంగా కనబడటానికి సహాయపడుతుంది.
చాలా మంది తమ అందంగా కబడటం కోసం చర్మ సంరక్షణ మరియు కేశ సంరక్షణలో అధిక మొత్తంలో డబ్బు మరియు సమయంను ఖర్చుచేస్తున్నారు. అయితే ఈ ఖర్చు చేయడం వల్ల కూడా కొంత మందిలో మాత్రమే ఫలితం కనబడుతుంది. మరికొంత మందిలో డబ్బు, సమయంతో వృదా అవ్వడంతో పాటు, రిజల్ట్ కూడ పెద్దగా ప్రభావం ఉండదు. కొన్ని ప్రయోగాలు తప్పుడు ఫలితాలను ఇస్తుంది. కాబట్టి, ఇటువంటి అన్ని ప్రతికూల విషయాలు మరియు డబ్బు నష్టం నివారించేందుకు సహజ మార్గాలను పాటించడం ఉత్తమం. సహాజ మార్గాలు ఎల్లప్పుడు శరీరాన్ని మరియు చర్మానికి రక్షణ కల్పించడంతో పాటు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. కాబట్టి క్రింద ఇచ్చిన సహజ పద్దతులను పాటించి మీ అందానికి దాసోహం అవ్వండి...

స్క్రబ్బింగ్:
చర్మం శుభ్రంగా..క్లియర్ గా ఉండాలన్నా, మృత కణాలు తొలగించడానికి మరియు మీ శరీరం పైన పెరుగుదల నిరోధించడానికి, మీ శరీరానికి రెగ్యులర్ స్ర్కబ్ ను ఉపయోగించండి. మీ శరీరానికి నేచురల్ స్ర్కబ్బింగ్ గా తేనె మరియు షుగర్ మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు.

డీహైడ్రేషన్
ప్రతి రోజూ నీటిని ఎక్కువగా తీసుకోవాలి: మీర ప్రతి రోజూ కనీసం 8 నుండి 10గ్లాసుల నీటిని తాగడానికి నిర్ధారించుకోండి. దాంతో మీ శరీరం డీహైడ్రేషన్ ను తొలగిస్తుంది మరియు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

శరీరంలో-చర్మం మీద మురికి వదిలించుకోవాలి:
శరీరంలో కానీ, చర్మ మీద కానీ మురికి తొలగిపోవాలంటే అధికంగా చెమట పట్టేలా శరీరానికి శ్రమకలిగించాలా. దాంతో పాటు రోజుకు రెండు సార్లు స్నానం చేయడానికి నిర్ధారించుకోండి. ప్రతి రోజూ స్నానం చేయడం వల్ల మీ కూల్ గా ఉండేందుకు మరియు మీ వ్యక్తిగత శుభ్రత నిర్వహించడానికి కూడా ఉపయోగపడుతుంది. స్నానం చేసిన తర్వాత కాటన్ దుస్తులను ధరించాలి. కాటన్ వస్త్రాలు మీ చర్మానికి తగినంత గాలి తగిలే విధంగా చేస్తుంది.

కేశ సంరక్షణ:
అధిక ఉష్ణోగ్రత మరియు కాలుష్యం వల్ల మీ జుట్టు ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. కాబట్టి మంచి ఆరోగ్యకరమైన జుట్టు నిర్వహణకు, మీ సౌకర్యాన్ని బట్టి షాంపును రాయండి. మరియు మీ తలకు షాంపు చేసేటప్పుడు చిటికెడు బేకింగ్ సోడాను కలుపుకోండి. దాంతో జుట్టులో చిక్కుకొన్న మురికి, కాలుష్యం వదలగొడుతుంది.

సన్ ప్రొటక్షన్:
మీ జీవితంలో మీరు ఎల్లప్పుడు ఒక సూత్రాన్ని పాటించాలి, ప్రతి రోజూ మంచి సన్ స్క్రీన్ లోషన్ ను ఉపయోగించాలి . అందుకు మీ శరీర తత్వాన్ని బట్టి ఎటువంటి అలర్జీలు కలగకుండా ఉంచే, మేలైన సన్ స్క్రీన్ లోషన్ ను ఎంపిక చేసుకోవాలి.

మీ కాళ్ళు, వేళ్ళకు గాలిసోకే విధంగా జాగ్రత్త తీసుకోవాలి:
మంచి బ్లడ్ సర్క్యులేషన్ పొందడానికి మరియు దుర్వాసనను మరియు ఫంగల్ ఇన్ ఫెక్షన్స్ ను తొలగించుకోవాలంటే మీరు ఎల్లప్పుడు ఓపెన్ షూలన్ ధరించాలి.

పెరగు బెస్ట్ నేచురల్ వస్తువు:
పెరుగును అధికంగా తీసుకోవడం ల్ల మీ చర్మాన్ని మెరిపించడమే కాదు, మీ వృద్ధాప్య ప్రక్రియను కూడా తగ్గిస్తుంది. చర్మం మరియు జుట్టు నునుపుగా చేయడానికి, సన్ డ్యామేజ్ ను తొలగించుకోవాడానికి పెరుగును చర్మానికి మరియు కేశాలకు ప్యాక్ లా వేసుకోవాలి.

షెవింగ్ టెక్నిక్స్ కొత్తవి పాటించండి:
మీరు రేజర్ తో షేవింగ్ చేసుకొనేట్లయితే , మీరు స్నానానికి వెల్లడానికి ముందు మీ చేతులు మరియు కాళ్ళకు రేజర్ ను ఉపయోగించిన తర్వాత 5-10నిముషాల సమయంను ఇవ్వాలి. హెయిర్ ను సాప్ట్ గా రిమూ చేయడానికి సహాయపడుతుంది మరియు చర్మానికి చాలా దగ్గరగా మరియు దీర్ఘకాలం చర్మం సున్నితంగా ఉండేందుకు గోరువెచ్చని నీటిని ఉపయోగించండి. తర్వత నేచురల్ ఆస్ట్రిజంట్ ను చల్లని నీటితో మిక్స్ చేసి పోసుకోవాలి.

సిల్కీ స్మూత్ పిల్లోను ఉపయోగించండి:
స్కిన్ కవర్ దిండును ఉపయోగించడం వల్ల, జుట్టు మూలాల మరయు చర్మం మద్య ఘర్షణ మరియు హానీని జరగకుండా నిరోధించడానికి సహాయపడుతుంది.

సన్ టాన్ కు గుడ్ బై చెప్పండి:
కాస్తంత ఎండ తగిలినా, చర్మం కమిలే ప్రమాదం ఉన్న వారు, ఎల్లప్పుడు నేచురల్ పదార్థాలను ఉపోగించడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు. గుడ్డులో తెల్లని పదార్థం మరియు కార్న్ ఫ్లోర్ మరియు నిమ్మరసం మరియు కొద్దిగా పొటాటోతో రుద్దడం లేదా నిమ్మరసం రాయడం..ఇటివంటి సహజసిద్దంగా లభించే పదార్థాలను ఉపయోగించడం వల్ల సన్ టాన్ కు గుడ్ బై చెప్పవచ్చు. ఇక వేళ వీటితో ఫలితం లేకపోతే, ప్రారంభ దశలోనే డెర్మటాలజిస్ట్ ను సంప్రదించండి.

తలకు మరియు కేశాలకు రక్షణ కల్పించాలి:
మీ తలకు, కేశాలకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినా, లేదా ఎండలో బటయకు వెళ్ళినప్పుడు క్యాప్ వంటివి ధరించకపోవడం చేత అధిక వేడి వల్ల తలలో నూనె ఏర్పడి, ముఖం మీదకు జారడం వల్ల నుదిటి చర్మం మీద మొటిమలు ఏర్పడటానికి దారితీస్తుంది. దీన్ని నివారించడం కోసం మంచి క్లెన్సర్ ను ఉపయోగించి, ఎల్లప్పుడూ నుదిటి బాగాన్ని శుభ్రం చేస్తుండాలి.

ఆరోగ్యకరమైన పాదాలు:
పాదాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం కోసం క్లోస్డ్ షూ ధరించే ముందు పాదాల మీద యాంటీఫంగల్ పౌడర్ చల్లుకోవాలి. ఇదికాకుండా, మృత కణాలు తొలగించడానికి మరియు మీ పాదాల మీద చర్మం లో చైతన్యం నింపడానికి ఫ్యూమిస్ స్టోన్ తో స్నానం చేసేటప్పుడు రుద్దాలి.

ప్రోటీన్ రిచ్ డైట్:
ఆరోగ్యకరమైన మరియు ప్రకాశించే చర్మ ఛాయను పొందడం కోసం, లీన్ మీట్, గుడ్లు, పప్పులు, పాలు మరియు చీజ్ వంటి రిచ్ ప్రోటీనులు కలిగిన ఈ ఆహారాలను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఈ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఇంకా హెల్తీ బోన్స్ మరయు దంతాల ఆరోగ్యానికి బాగా సహాయపడుతాయి.

తగినంత విశ్రాంతి:
అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తగినంత విశ్రాంతి చాలా అవసరం. అందుకు తగినంత నిద్ర మరియు తగినంత నీరు తీసుకోవాలని గుర్తుంచుకోవాలి. ఈ రెండింటి వల్ల మీ చర్మంలో ప్రకాశవంతమైన ఛాయను అందించడానికి బాగా సహాయపడుతాయి. ఇది డిటాక్సిఫై చేయడానికి మరియు కళ్ళు ఉబ్బును మరియు ఎరుపుదనాన్ని నివారించడానికి సహాయపడుతుంది.

ఎక్కువ మేకప్ ను నివారించుకోవాలి:
మీ ముఖానికి మేకప్ ను వేసుకోనేటప్పుడు చాలా తక్కువగా వేసుకోవాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మేకప్ ఎక్కువగా వేసుకోవడం వల్ల చర్మం మీద ఉన్న చర్మ రంధ్రాలను పూడుకునేలా చేసి, సరైన గాలి తోలక చర్మం ముడుతలు ఏర్పడటానికి మరియు చర్మం పొరలుగా ఏర్పడటానికి దారితీస్తుంది. అంతే కాకుండా మీరు నిద్రించే ముందు తప్పనిసరిగా మీ మేకప్ ను తొలగించాలని నిర్ధారించుకోండి.

మాయిశ్చరైజింగ్
మీరు ఎల్లప్పుడు చర్మ సంరక్షణకోసం క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ ను పాటించాలి: మీ చర్మ తత్వాన్ని బట్టి క్లెన్సర్ మరియు టోనర్ ను ఎంపికచేసుకోవాలి. మీ రెగ్యులర్ పనులతో పాటు ఈ క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ వంటివాటి ఖచ్చితంగా పాటించడానికి సహాయపడుతుంది . ఇంకా మీ చర్మ సంరక్షణలో నేచురల్ ఆయిల్స్ ను ఉపయోగించడం వల్ల ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ గా ఉపయోగపడుతుంది. ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది.

ఎల్లప్పుడు మీ చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి:
ఎల్లప్పుడూ మీ చేతులతో ముఖాన్ని తాకతుండటం వల్ల మురికి చేతుల వల్ల మీ ముఖంలో మొటమలు మరియు బ్రేక్ అవుట్స్ కు కారణం అవుతుంది. అందువల్ల మీరు ఎల్లప్పుడు చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని నిర్ధారించుకోండి మరియు చేతులతో ముఖంను తాకకుండా ఉండాలని గుర్తుంచుకోవాలి.

మీ చర్మాన్ని ఎక్స్ ఫ్లోయేట్ :
కనీసం వారానికొక సారి మీ చర్మానికి ఎక్స్ ఫ్లోయేట్ ను ఉపయోగించండి. దాంతో మీ చర్మంలోని మురికినంతా మరియు మలినాలను తొలగించడాని సహాయపడుతుంది. మరియు మీ ఆరోగ్యకరమైన చర్మం ప్రకాశవంతంగా ఉండేందుకు సహాయపడుతుంది.

జుట్టుకు కండీషనర్:
మీ జుట్టును శుభ్రం చేసుకొన్న తర్వాత మీ జుట్టుకు కండీషనర్ అప్లై చేయడం చాలా అవసరం. ఒక మంచి కండీషనర్ ను అప్లై చేయడం వల్ల కాలుష్యంతో డ్యామేజ్ అయిన జుట్టను మరియు చిక్కును తొలగిస్తుంది. అంతే కాక, జుట్టు తడి ఆర్పుకోవడానికి బ్లో డ్రయ్యరు ను ఉపయోగించడం తగ్గించాలి.

వీపు బాగాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి:
మీ శరీరం అందంగా, సెక్సీగా ఉండాలనికోరుకుంటున్నట్లైతే మీ వీపును శుభ్రంగా ఉంచుకోవాలి. మాయిశ్చరైజర్ ను రెగ్యులర్ గా అప్లై చేయాలి. మరియు బొప్పాయి వంటి సహజ వస్తువులను వీపు భాగానికి అప్లై చేయాలి. బొప్పాయ గుజ్జును వీపుకు అప్లై చేసిన తర్వాత 5-10నిముషాలు అలాగే ఉండి తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల ఇది, మృత కణాలను మరియు మలినాన్ని తొలగించడానికి సహాయం చేస్తుంది .



Click it and Unblock the Notifications











