ప్రకాశవంతమైన చర్మం పొందడానికి ఖరీదైన క్రీములు అవసరంలేదు

సహజమైన మెరిసే చర్మాన్ని కోరుకుంటున్నారా? సరే! మీకు మేము సమాధానం చెపుతాము-అదే యోగా. యోగ మీకు ఆరోగ్యకరమైన మనస్సు మరియు శరీరాన్ని ఇస్తుంది మరియు మీ చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. మీరు ఎల్లప్పుడూ కోరుకునే మచ్చలేని, ప్రకాశవంతమైన చర్మం కోసం ఇక్కడ టాప్ 5 యోగా భంగిమలను ఇస్తున్నాము.

ఆయుర్వేదంలో, వైద్యులు ఒక మనిషియొక్క చర్మం వారియొక్క ఆరోగ్యాన్ని గురించి చెపుతుందని నమ్ముతారు మరియు ఒక మనిషియొక్క చర్మం యెంత ఆరోగ్యకరంగా కనపడుతుందో, వారిలో మంచి రక్తసరఫరా జరుగుతున్నదని, ఆ శరీరం బాగా ఆమ్లజనీకృతమవుతున్నదని అర్థం మరియు అన్ని అంతర్గత అవయవాలు కావలసినట్లుగ పని చేస్తున్నట్లుగా అర్థం. ఈ పోస్ట్ లో మనం ముఖరక్త ప్రసరణను పెంచడానికి, జీర్ణ వ్యవస్థ మెరుగుపడటానికి మరియు రక్తాన్ని ఆమ్లజనీకృతం చేయటంలో సహాయపడటానికి-ఉన్న వయస్సుకన్నా చిన్నగా కనపడటానికి,ఆరోగ్యంగా మరియు అందంగా కనపడటంలో సహాయపడే కొన్ని భంగిమల గురించి మాట్లాడుకుందాం.

పచిమోతాసన:

పచిమోతాసన:

ఈ ముందుకు వంగే భంగిమ ముఖానికి రక్తసరఫరా బాగా జరగటంలో సహాయపడుతుంది. అంతే కాకుండా, ఇది పొట్టలో జరిగే చర్యలు బాగా జరిగేట్లుగా సహాయపడుతుంది, తొడ కండరాలు శక్తివంతం అవుతాయి మరియు మన వెన్నెముక మరియు భుజాలు సడలింపబడతాయి.

గుర్తుంచుకోవలిసిన చిట్కాలు: మీకు వెన్నెముక సమస్యలు ఏవైనా ఉంటే, మీరు ఈ రకమైన యోగా భంగిమ చేయవొద్దు. అంతేకాక, మీరు మీ నుదురుతో మీ మోకాళ్లను తాకలేకపోవొచ్చు. మీరు అలా చేయగలిగితే, తిరిగి సరిగ్గా అలానే చేయండి.

మత్స్యాసన:

మత్స్యాసన:

ఈ భంగిమ మీ ముఖ కండరాలను సడలిస్తుంది మరియు మీ మెడ మరియు వెనుకభాగాన ఉన్న కండరాలను బలపరుస్తుంది. ఇది ముఖానికి జరిగే రక్తసరఫరాను నియత్రిస్తుంది మరియు రక్తంలోని ఆమ్లజని యొక్క పరిమాణాన్ని పెంచుతుంది.

గుర్తుంచుకోవలిసిన చిట్కాలు: మీరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లయితే లేదా మెడ /వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లయితే, ఈ భంగిమ చేయడం ఆపేయండి.

హాలాసన:

హాలాసన:

ఈ భంగిమ గంటలకొద్దీ కూర్చునేవారికి మరియు చెడు భంగిమ కలిగిఉన్నవారికి బాగా పనిచేస్తుంది. దీనివలన , థైరాయిడ్ గ్రంధులు, పారాథైరాయిడ్ గ్రంధి, ఊపిరితిత్తులు మరియు ఉదర అవయవాలను ఉత్తేజపరిచి మీ తలకు మరియు ముఖానికి రక్తసరఫరా బాగా జరిగేట్లుగా సహాయపడుతుంది మరియు మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు హార్మోనల్ స్థాయిలను చెక్ లో ఉంచుతుంది.

గుర్తుంచుకోవలిసిన చిట్కాలు: మీరు కాలేయం లేదా ప్లీహము లోపాలు, రక్తపోటుతో బాధపడుతూ ఉంటే, అతిసారం కలిగి ఉంటే, మేన్సురేటింగ్ లో ఉంటే లేదా మెడ మీద గాయం కారణంగా బాధపడుతూ ఉంటే, ఈ భంగిమ చేయవొద్దు.

ప్రాణాయామం:

ప్రాణాయామం:

లోతుగా శ్వాసను పీల్చటం మరియు బయటకు శ్వాసను వదలటం వలన మీ రక్తంలో ఆమ్లజని సరఫరాకు సహాయపడుతుంది మరియు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఈ భంగిమ మీ మనస్సును స్తబ్దతలో ఉంచుతుంది మరియు మీ అలసిపోయిన నరాలకు కూడా విశ్రాంతి చాలా అవసరం. దీనివలన రోజు ఎదుర్కునే ఒత్తిడికి విరామం దొరికి, మరల ఉత్త్తేజితమయి, మీరు చురుగ్గా, అందంగా కనపడతారు.

శవాసన:

శవాసన:

మొత్తం శరీరం సడలింపును అనుభవించే ఒక మార్గం ఈ శవాసనం లేదా యోగ నిద్ర. కేవలం మీరు నేలపై పడుకుని, వదులుగా అన్ని అవయవాలు మరియు కీళ్ళను వదిలలేయండి. కళ్ళు మూసుకోండి. మీరు ఒక శవంలాగా నేలపై పడుకోండి.

శీర్షాసన:

శీర్షాసన:

ఈ శీర్షాసన భంగిమ కొద్దిగా కష్టం అయినప్పటికీ, మీరు దీర్ఘకాలిక ప్రకాశాన్ని మరియు ఆరోగ్యాన్ని మీ ముఖంలో కోరుకుంటే, దీనిని మించినది ఏది లేదు. ఈ భంగిమలో మీరు మీ తల మీద నిలబడిఉంటారు కాబట్టి, రక్తప్రసరణ క్రిందికి జరుగుతుంది, అందువలన మీ ముఖంలోకి రక్తసరఫరా మెరుగుపడుతుంది. గురుత్వాకర్షణకు వ్యతిరేక దిశలో రక్తప్రసరణ జరుగుతుంది,కాబట్టి మీ ముఖంలోని ముడుతలు కూడా నివారింపబడతాయి. తలక్రిందులుగా మీ తల ఉండటంవలన, తాజా పోషకాలు మరియు ముఖం ఆక్సిజన్ వంటివి మీ ముఖంలోకి నెట్టివేయబడతాయి,కావున మీ ముఖసౌందర్యం ప్రకాశవంతమవుతుంది.

Story first published: Sunday, November 17, 2013, 14:02 [IST]
Desktop Bottom Promotion