Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
అలసిన చర్మంను ప్రకాశవంతంగా చెయ్యడానికి మార్గాలు..
ఒత్తిడి మరియు కాలుష్యం ,దుమ్ము ,పొగచూరిన మసి వంటి చెడు కారకాలు మన చర్మం మీద ప్రభావితం చూపి నాశనం చేయవచ్చు. మీరు పని మీద బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అలసత్వం లేకుండా చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవటం లేదా ఐస్ తో రుద్దడం వంటివి చేయాలి. ఐస్ లేదా చల్లని నీటితో ఈ విధంగా చేయుట వల్ల తాత్కాలికంగా అలసిన చర్మంనకు శక్తిని కలుగజేయుట మరియు రక్త ప్రసరణను ఉత్తేజపరుస్తుంది.
ప్రతి రోజు మీరు పని చేసి అలసిపోయిన తర్వాత మీ చర్మం తాజాదనాన్ని కోల్పోవడం జరుగుతుంది. మీ చర్మం తాజాదనంతో ప్రకాశవంతముగా ఉండటం ఎలాగో ఇక్కడ తెలుసుకుందాము.
అలసిన చర్మంను ప్రకాశవంతం చెయ్యడానికి మార్గాలు

అలసిన చర్మం ప్రకాశవంతంగా మార్చే సులభ చిట్కాలు
స్క్రబ్ ఉపయోగించాలి : మృత కణాలను తొలగించడానికి ఒక కఠినమైన పదార్ధంతో చర్మాన్ని రుద్దుటం అనేది అలసిన చర్మం సులభంగా ప్రకాశవంతంగా మారటానికి త్వరిత మార్గాలలో ఒకటి. ఈ విధంగా చేయుట వల్ల చర్మం మీద మృత కణాలు తొలగి చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. కనీసం వారానికి ఒకసారి మీ ముఖంనకు ఒక సున్నితమైన స్క్రబ్ ను ఉపయోగించండి.

అలసిన చర్మం ప్రకాశవంతంగా మార్చే సులభ చిట్కాలు
నీరు ఎక్కువగా తీసుకోవాలి : నీరు ఎక్కువగా తీసుకోవటం అనేది ఆరోగ్యకరమైన శరీరం మరియు హైడ్రేటెడ్ చర్మాన్ని నిర్వహించడానికి గొప్ప పరిష్కారం. అలాగే మీరు దీనికి ప్రత్యామ్నాయంగా మీ ముఖ చర్మము ఛాయను ప్రకాశవంతం చేయడానికి కొబ్బరినీరును ఉపయోగించవచ్చు.

అలసిన చర్మం ప్రకాశవంతంగా మార్చే సులభ చిట్కాలు
హైడ్రేట్ మాస్క్ ఉపయోగించండి : హైడ్రేట్ మాస్క్ మృత కణాలను తొలగించి చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. ఒక గిన్నెలో పెరుగు లేదా మాలై,కొన్ని చుక్కల నిమ్మరసం,జాజికాయ పొడి మరియు పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖం మరియు మెడ మీద రాసి 5-10 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకొని రోజ్ వాటర్ రాస్తే మీ ముఖంనకు పునరుత్తేజం వస్తుంది.

అలసిన చర్మం ప్రకాశవంతంగా మార్చే సులభ చిట్కాలు
ఉప్పు తీసుకోవడం తగ్గించండి : కొన్నిసార్లు మీ ఆహారంలో అధిక ఉప్పు వినియోగం కారణంగా మీ కళ్ళు ఉబ్బినట్లుగా మారతాయి. మీ కళ్ళు చుట్టూ చర్మాన్ని బిగించి కంటి బ్యాగ్స్ తగ్గించడానికి మీరు ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి. కళ్ళ చుట్టూ ఉండే నల్లని వలయాలు మరియు ముడుతలు తగ్గటానికి బంగాళాదుంప ముక్కలు లేదా దోసకాయ ముక్కలు ఉపయోగించవచ్చు.

అలసిన చర్మం ప్రకాశవంతంగా మార్చే సులభ చిట్కాలు
రాత్రిపూట క్రీమ్ రాయాలి : రాత్రి పూట మాయశ్చరైజర్ వాడుట వల్ల ఆరోగ్యకరమైన చర్మ కణాలు పునరుత్పత్తి ప్రోత్సహించటానికి మరియు మీ చర్మం యొక్క సహజ మరమ్మత్తు ప్రక్రియకు సహాయపడుతుంది. క్రమం తప్పకుండా మాయశ్చరైజర్ వాడుట వల్ల ముడుతలు నిరోధించి ప్రకాశవంతమైన మరియు మృదువైన చర్మం నిర్వహనకు సహాయపడుతుంది.

అలసిన చర్మం ప్రకాశవంతంగా మార్చే సులభ చిట్కాలు
రాత్రిపూట సరిపడా నిద్ర అవసరము : తగినంత నిద్ర లేకపోతె చర్మం ఒత్తిడి మరియు అలసటకు గురి అవుతుంది. ఒక క్రమ పద్ధతిలో నిద్ర ఉంటె మీ చర్మం ఆరోగ్యంగాను మరియు యవ్వనంగాను ఉంటుంది. మీరు నిద్ర పోయినప్పుడు ఆరోగ్యకరమైన చర్మ కణాల ఉత్పత్తి జరుగుతుంది. అంతే కాకుండా ముడుతలు మరియు వృద్ధాప్యంలను నిరోధిస్తుంది.

అలసిన చర్మం ప్రకాశవంతంగా మార్చే సులభ చిట్కాలు
ఆహారం: స్ట్రాబెర్రీస్, బ్రోకోలి, ఆకుకూరలు మరియు నిమ్మకాయ వంటి ఆహారపదార్ధములను తీసుకోవడం ద్వారా మన చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చును. సమతుల్యమైన ఆరోగ్యకర ఆహారాలని తీసుకోవడం ద్వారా మన చర్మ సౌందర్యం పై ఎన్నో అద్బుతమైన ఫలితాలు పొందవచ్చు.

అలసిన చర్మం ప్రకాశవంతంగా మార్చే సులభ చిట్కాలు
ఫేస్ వాష్: ప్రతి రోజూ 3-4సార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖం శుభ్రం చేసుకోవడానికి సోపు వాడకుండా ఫేస్ వాష్ ను ఉపయోగించండి. ముఖం శుభ్రం చేయడానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించండి.

అలసిన చర్మం ప్రకాశవంతంగా మార్చే సులభ చిట్కాలు
స్టీమింగ్(ఆవిరి)పట్టడం: ముఖానికి స్టీమింగ్ చేయడం చాలా మంచిది. స్టీమింగ్ వల్ల చర్మంలో ఉన్న మలినాలు, దుమ్ము, దూళి తొలగిపోయి, చర్మరంద్రాలు తెరచుకొనేలా చేసి చర్మ గ్రంధులను శుభ్రపరుస్తుంది.

అలసిన చర్మం ప్రకాశవంతంగా మార్చే సులభ చిట్కాలు
సూర్యరశ్మి ప్రభావం: చలికాలమైనా.. ఎండా కాలమైనా... చర్మానికి ప్రధాన శత్రువు సూర్యుడు. అతినీలలోహిత కిరణాలు శరీరాన్ని తాకితే పూర్తిగా రంగుమారిపోతుంది. అయితే స్కిన్ టైప్స్‌ను బట్టి దాని ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. సూర్యరశ్మి ముఖానికి తగలకుండా చూసుకోవాలి. తప్పనిసరైనా బయటికివ వెళ్లాల్సివస్తే... అరగంట ముందే సన్ స్రీన్ లోషన్తీసుకొని ముఖం, మెడకు, చేతులకు, కాళ్ళకు మర్దన చేయాలి. సన్ గ్లాస్ ను ఉపయోగించడం మంచిది.



Click it and Unblock the Notifications