Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
అందంగా మారడానికి సింపుల్ ఫేషియల్ ప్యాకేజ్
సాధారణంగా ఏవరైనా సరే పదిమందిలో ఉన్న మనకంటూ ఒక ప్రత్యేకత వచ్చేది అందం వల్లే అనడంలో అతిశయోక్తి లేదు, ఇంట్లోనైనా, ఆఫీసు లోనైనా, ఫంక్షన్స్ లోనైనా ఆకర్షణీయంగా కనబడటానికి ఎవరు ఇష్టపడరు..? అందుకే బ్యూటీ పార్లర్ లకి చెప్పలేనంత డిమాండ్. ఆధునిక పద్ధతులను అనుసరిస్తున్న బ్యూటీ పార్లర్ ల ప్రయోజనాలు బాగానే ఉన్నా, సమయం లేక బ్యూటీ పార్లర్ లకు వెళ్ళలేని వారు కొందరైతే , అంతంత ఖర్చు అవసరమా అని మానుకునే వారు కొంతమంది.
పొడి చర్మం: హోం మేడ్ నేచురల్ ఫేస్ ప్యాక్:క్లిక్ చేయండి
అలాంటి వారికోసమే ఈ సింపుల్ ఫేషియల్ ప్యాకేజేస్ , మరెందుకు ఆలస్యం, మీరు ఏ ఫేషియల్ చేయించుకోవాలను కుంటున్నారో మీరే ఎంచుకుని , మీరే తయారు చేసుకుని, మీకు మీరే బ్యూటీషియన్ అయిపొండి.
ముఖ అందాన్ని రెట్టింపుచేసే రెడ్ ఫ్రూట్ ఫేస్ ప్యాక్:క్లిక్ చేయండి

ఆయిలీ స్కిన్ ఉన్నవారికి - సిట్రస్ మాస్క్
కావలసినవి:
½ tsp పంపర పనస (Grapefruit),
½ tsp నిమ్మ రసం,
½ tsp యాపిల్ పండు,
1- 2 గుడ్డు లోని తెల్లసొన ,
30-40 ద్రాక్ష పళ్ళు
వీటన్నింటిని బ్లెండ్ చేసి మొహానికి పెట్టుకుని 15 నిమిషాల తరవాత గోరువెచ్చటి నీటితో కడిగేస్తే మొహం లో జిడ్డు తగ్గుతుంది.

పెరుగు మాస్క్
కావలసినవి:
పెరుగు
పెరుగును మొహానికి పట్టించి 20 నిమిషాల తరవాత కడగాలి. డ్రై స్కిన్ ఉన్నవారు రోజుకు ఒకసారి అప్లై చేసుకుంటే చర్మం కాంతి లీనుతుంది.

బొప్పాయి
బొప్పాయి గుజ్జును మొహానికి రాసుకుని 5 నిమిషాల పాటు ఉంచి గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.బొప్పాయి లో ఉండే పపైన్ అనే ఎంజైమ్ చర్మానికి బాగా ఉపకరిస్తుంది.

గుడ్డు తో ఫేషియల్స్
ఎగ్ మాస్క్ 1
కావలసినవి:
1 గుడ్డులోని తెల్లసొన
గుడ్డు లోని తెల్లసొనను 15 నిమిషాల పాటు మొహానికి రాసుకుని రిలాక్స్ అయితే స్మూత్ గా తయారవుతుంది.
ఎగ్ మాస్క్ 2
కావలసినవి:
గుడ్డులోని పసుపుసొన
గుడ్డులోని పసుపు సొనను 15 నిమిషాల పాటు మొహానికి రాసుకుని గోరువెచ్చటి నీటితో కడిగితే చర్మం నిగనిగలాడుతుంది. గుడ్డు లోని పసుపు సొన లో ఉండే యాంటీ- ఆక్సిడెంట్స్ చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. ఆరోగ్యంగా ఉంచుతుంది.

గుడ్డు మరియు తేనె స్పెషల్
కావలసినవి:
గుడ్డులోని పసుపు సొన
1 tsp తేనె
1 tsp విటమిన్ ఈ ఆయిల్
1 tsp బాదం నూనె
వీటన్నింటిని బాగా కలిపి 15 నిమిషాలు మొహానికి పట్టించి కడిగేయాలి. ఈ మాస్క్ అన్ని రకాల చర్మం వారికి బాగా ఉపకరిస్తుంది. ఈ మిశ్రమాన్ని కనీసం వారానికొకసారైనా మొహానికి పట్టిస్తే గుడ్డులోని పసుపు సొనలో ఉన్న యాంటీ యాక్సిడెంట్స్ చ ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

డీ హైడ్రేటెడ్ స్కిన్ ఉన్నవారికి - ఫ్రూట్ మాస్క్
కావలసినవి:
ఒక కప్పు నిండా స్ట్రా బెర్రీస్, పీచెస్, నిమ్మరసం , మరియు అరటిపండు.
2-3 tsp డబుల్ క్రీం
3 tsp వెన్న
1 tsp బెల్లం
4 స్పూన్ ల ఓట్ మీల్ పౌడర్
కలిపి బ్లెండ్ చేసి 15 నిమిషాలు మొహానికి రాసుకుని గోరువెచ్చటి తో నీటితో కడగండి.

తేనె మాస్క్
కావలసినవి:
1 1/2 tsp తేనె
1 గుడ్డులోని తెల్లసొన
2 tsp గ్లిసరిన్
1/3 cup శనగపిండి
వీటన్నింటినీ కలిపితే చిక్కటి పేస్ట్ లా తయారవుతుంది . దాన్ని 15 నిమిషాల పాటు మొహానికి పెట్టుకుని గోరువెచ్చటి నీటితో కడిగేయండి. ఈ మిశ్రమం చర్మాన్ని మాయిస్చర్ చేసి స్కిన్ ని టైటనింగ్ చేసి చర్మం స్మూత్ గా సాఫ్ట్ గా అయ్యేలా చేస్తుంది.

టమాట మాస్క్
కావలసినవి :
1/2 టమాట ( టమాట తోలు, గింజలు లేకుండా చేసుకోవాలి)
2 tsp పెరుగు
1 tsp సన్నగా తరిగిన కీరదోస
3-4 tsp ఓట్ మీల్ పౌడర్
3 పుదీనా ఆకులు
వీటన్నింటినీ కలిపి మొహానికి పట్టించి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి. ఈ మాస్క్ ఆయిలీ స్కిన్ ఉన్నవారికి బాగా ఉపకరిస్తుంది. టమాట లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఉన్నాయి. పెరుగు చర్మం లో తేమను కాపాడుతుంది.
సులువైన ఫ్రూటీ ఫేషియల్స్

పుచ్చకాయ
పుచ్చకాయ గుజ్జును మొహానికి రాసుకుని 5 నిమిషాల పాటు ఉంచితే మొహంలోని మలినాలన్నీ శుభ్రం అవుతాయి.

స్ట్రా బెర్రీ
స్ట్రా బెర్రీలను క్రష్ చేసి మొహానికి రాసుకుని 2-3 నిమిషాలు ఉంచి గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. స్ట్రా బెర్రీ లో ఉండే విటమిన్ సి, చర్మాన్ని తేజోవంతం చేస్తుంది.



Click it and Unblock the Notifications
