Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
నేచురల్ వింటర్ స్కిన్ కేర్ కోసం టాప్ 5 ఎసెన్షియల్ ఆయిల్స్
Skin Care
oi-Saraswathi
By Sindhu
శీతాకాలం వచ్చిందంటే చాలు చర్మం తెల్లగా పొడిబారిపోతుంది. అంతేకాక చాలా అసహనానికి గురిచేస్తుంది. శీతాకాలంలో చర్మాన్ని పర్యవేక్షించుకోవటం చాలా కష్టమైన విషయమే. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదో ఒక చోట లోటు ఏర్పడటం మాత్రం సహజమే.
చలికాలంలో పడిపోయే ఉష్ణోగ్రత, వీచే చలిగాలులు చర్మాన్ని చాలా ఇబ్బందిపెడతాయి. కాబట్టి చర్మానికి ఈ రుతువులో అదనపు రక్షణ అవసరం. ఆ రక్షణను అందించే నూనెలను చర్మ మీద మర్దన చేసినప్పుడు అవి చర్మాన్ని నునుపుగా చేస్తాయి. అందుకు ఉపకరించే నూనెలు...

1. కొబ్బరి నూనె : దీనిలో లవణాలు అధికం. కాబట్టి కొబ్బరి నూనెను చలికాలంలో శరీరానికి రాసుకుంటే ముడుతలు రాకుండా కాపాడుకోవచ్చు. చర్మం ఏ తరహాకి చెందినదైనా కొబ్బరి నూనె వాడకం సరైనదే. పలు రకాల చర్మరోగాలు సోకకుండా కాపాడే శక్తి కొబ్బరినూనెకుంది.

2. ఆలివ్ నూనె : చర్మ సౌందర్యానికి చక్కని సాధనం ఆలివ్ నూనె. దీనిలో ఉన్న విటమిన్ ఇ, యాంటి ఆక్సిడెంట్స్ వల్ల చర్మం వయసుతో వచ్చే మార్పులకు గురికానివ్వదు. ఆలివ్ నూనె మర్దన చేస్తే చర్మం ఎంతో చక్కని తేజస్సును పొందుతుంది.

3. ఆల్మండ్ నూనె: ఈ నూనె చలికాలంలో బాగా ఉపకరిస్తుంది. ముఖ్యంగా ఆల్మండ్ నూనె చర్మాన్ని ఎండిపోనివ్వదు. ఈ నూనె రాసుకుంటే చర్మం తేమను గ్రహిస్తుంది. మీ చర్మం ఏ తరహాది అయినా ఈ ఆయిల్‌ని రాసుకోవచ్చు. దురద, మంట వంటి సమస్యలను చర్మానికి రానివ్వదు. చర్మం పగలకుండా సంరక్షిస్తుంది.

4. నువ్వుల నూనె : ఈ నూనెలో ఉన్న విటమిన్ బి, ఇ లు చర్మానికే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీనిలోని కాల్షియమ్, మెగ్నీషియమ్‌ల ద్వారా చర్మం లబ్దిపొందుతుంది. సూర్య కాంతి ప్రభావం చర్మం మీద పడకుండా రక్షిస్తుంది. నువ్వుల నూనెతో శరీరం మర్దన చేయించుకుంటే అలసట ఇట్టేపోతుంది. చర్మానికి తాజాదనం సమకూరి ఉత్సాహాన్ని తెచ్చిపెడుతుంది.

5. జజోబానూనె : దీనిలోని సూక్ష్మజీవ సంహారగుణం వల్ల చక్కని రక్షణ నిస్తుంది. చర్మంలో సహజంగా ఉత్పత్తి అయ్యే తైలాలకు, జబోబా ఆయిల్‌లో ఉన్న రసాయనాలకు దగ్గరి పోలిక కనిపిస్తుంది. అందువల్ల బజోబా నూనెను చర్మం ఎటువంటి ప్రతి చర్య చూపకుండానే గ్రహిస్తుంది. ఇది రాసుకుంటే చర్మానికి ఎలర్జీ ఉండదు.

6. అవొకాడో ఆయిల్: చిక్కగా ఉండే ఈ అవొకాడో ఆయిల్ చర్మం రీహైడ్రేషన్ కు సహాయపడుతుంది . అవొకాడోలో పూర్తిగా న్యూట్రిషియన్స్ ఉంటాయి. ఇవి డ్యామేజ్ అయిన చర్మంను మరమ్మత్తు చేయడానికి సహాయపడుతుంది.

Comments
English summary



Click it and Unblock the Notifications
