Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
వయస్సు మీదపడుతున్నా యంగ్ గా కనబడాలంటే
సాధారణంగా పెరిగే వయస్సును ఆపడం ఎవరి తరం కాదు, కానీ వయస్సు పెరిగే కొద్ది మరింత యవ్వనంగా కనబడేలా చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వృద్దాప్య భారీన పడాల్సింది. కొంత మంది చిన్న వయస్సులోనే పెద్దగా వయస్సు మళ్ళిన వారిగా కనబడుతుంటారు. అందుకు కొన్ని జన్యు సమస్యలు, జీవన శైలి, తీసుకొనే ఆహారం, నివసించే ప్రదేశంను బట్టి వారి ముఖంలో శరీరంలో మార్పులు చోటు చేసుకుంటాయి.
వయస్సు మళ్ళిన వారిగా కనబడనీయకుండా ఉండేందుకు మార్కెట్లో వివిధ రకాల ఏజింగ్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ అన్ని ప్రొడక్ట్స్ నూ వివిధ రకాల కెమికల్స్ తో తయారుచేస్తుంటారు. అలా కెమికల్స్ తో తయారుచేసే బ్యూటీ ప్రొడక్ట్స్ చర్మానికి అంత మంచిది కాదు. వీటి వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ దాగి ఉన్నాయి.
ఏజింగ్ ప్రొసెస్ ను నిధానం చేయడానికి మొత్తం జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. అందులో ముఖ్యంగా ఆహారపు అలవాట్లు మరియు రెగ్యులర్ వ్యాయామం తప్పనిసరి. తీసుకొనే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి జాగ్రత్తలు వయస్సులో ఉన్నప్పుడే తీసుకోవాలి. వయస్సు మళ్ళిన తర్వాత తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.
స్కిన్ టోన్ మెరుగుపరుచుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన ఆహారాలున్నాయి. చర్మ సంరక్షణ గురించి, జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఒక్క ఆహార విషయంలో మాత్రమే మార్పులు చేసుకోవడం కాదు, రెగ్యులర్ వ్యాయామంలో కూడా మార్పులు తప్పనిసరి. వయస్సు మళ్ళిన వారిగా కనబడనియకుండా చేయడానికి కొన్ని యాంటీ ఏజింగ్ ఫుడ్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

బెర్రీస్:
బెర్రీస్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మంను ఆరోగ్యంగా ఉంచుతాయి. డార్క్ కలర్ బెర్రీస్ మరింత ఉత్తమంగా పనిచేస్తాయి. ఈ డార్క్ కలర్ బెర్రీస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉండి చర్మసౌందర్యానికి మేలు చేస్తాయి.

డార్క్ చాక్లెట్ :
డార్క్ చాక్లెట్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చర్మంలో రక్త ప్రసరణను పెంచుతుంది. చర్మానికి నిరంతరం తగినంత రక్తప్రసరణ అందడం వల్ల యంగ్ గా కనబడుతుంటారు. ఇది ఇంకా మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. మరియు డార్క్ చాక్లెట్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, దీన్ని యాంటీఏజింగ్ ఫుడ్ గా తీసుకోవచ్చు.

వెజిటేబుల్స్:
వెజిటేబుల్స్ బెస్ట్ యాంటీఆక్సిడెంట్ ఫుడ్. ఇవి ఏజింగ్ ప్రొసెస్ ను తగ్గిస్తాయి . అందువల్ల గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ యాంటీఆక్సిడెంట్స్ కలిగిన ఫుడ్స్ గా కనుగొనడం జరిగింది . ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ పచ్చిగా లేదా ఉడికించి తీసుకోవచ్చు.

రెడ్ వైన్:
ప్రతి రోజూ ఒక గ్లాసు రెడ్ వైన్ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందంటుంటారు. ఇది ఒక మంచి యాంటీఏజింగ్ ఫుడ్ కాంపోనెంట్. ఈ రెడ్ వైన్ రక్తం గడ్డకట్టడం నివారిస్తుంది మరియు క్యాన్సర్ ప్రమాధాన్ని అరికడుతుంది.

అవొకాడో:
అవొకాడోలో విటమిన్ ఇ, పొటాషియం మరియు మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉన్నాయి. ఈ యాంటీఏజింగ్ ఫుడ్ లో పెద్ద మొత్తంలో యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉంటాయి. అవొకాడో స్కిన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది. అందువల్ల, ఇది హెల్తీ స్కిన్ తో, యంగ్ గా కనబడేందుకు సహాయపడుతుంది. అందువల్ల దీన్ని యాంటీఏజింగ్ ఫుడ్ లో చేర్చబడినది.

బీన్స్:
ఈ గ్రీన్ వెజిటేబుల్ ను చాలా మంది తినకుండా నివారిస్తుంటారు. అయితే, ఈ గ్రీన్ వెజిటేబుల్లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. దీన్ని ఒక సూపర్ ఫుడ్ గా సూచిస్తున్నారు . ఇది అనేక వ్యాధులతో పోరాడుతుంది మరియు బలహీనతను తగ్గిస్తుంది. దాంతో మీ చర్మం చూడటానికి యవ్వనంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications
