సన్ టాన్(చర్మంనల్లబడటాన్ని)నివారించే ఉత్తమ ఫేస్ ప్యాక్స్

వేసవి వచ్చేసింది, ఎక్కడ చూసినా ఎండలు మండుతున్నాయి. ఈ వేసవిలో సూర్యుని నుండి వెలువడే కఠినమైన కిరణాలు మన చర్మాన్ని నల్లగా మార్చేస్తాయి. టీవీల్లో వివిధ రకాలా స్కిన్ క్రీమ్ ను ఆఫర్ చేస్తుంటాయి. అయితే ఇవి ఇన్ స్టాంట్ గా ఫలితాన్ని ఇస్తాయి. కానీ, శాస్వతంగా ఎటువంటి ఫలితం ఉండదు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా చర్మ శుద్ది (సన్ టాన్) తొలగించుకోవడానికి అంత తేలిక కాదు. సన్ టాన్ తొలగించుకోవడం కోసం ఇంట్లో కొన్ని ఫేస్ ప్యాక్స్ వేసుకోవడం వల్ల అవి సన్ టాన్ కు వ్యతిరేకంగా పనిచేయడానికి సహాయపడుతుంది. సన్ టాన్ నివారించుకోవడానికి నేచురల్ రెమెడీస్ ఉపయోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సన్ టాన్(చర్మం నల్లబడుటను)నివారిస్తుంది.

సూర్య రశ్మిలోని, యూవీ కిరణాలు చర్మంలోని మెలనిన్ కంటెంట్ ను పెంచి, చర్మం ఎక్కువగా నల్లబడేలా చేస్తుంది. సన్ టాన్ వల్ల చర్మానికి కలిగి హాని, రూపు మాపుకోవడానికి మీరు ఉపయోగించే కొన్ని ఫేస్ ప్యాక్స్ వల్ల చర్మానికి కలిగిన ఈ డ్యామేజ్ ను నివారించుకోవచ్చు. సన్ టాన్ నివారించుకోవడానికి ముఖానికి, చేతులు, పాదాలు మరియు సూర్యుడు యొక్క కఠినమైన కిరణాలు బహిర్గతమయ్యే ఏ ఇతర శరీర భాగాల కూడా సన్ టాన్ వల్ల చర్మం డ్యామేజ్ అవ్వకుండా ఉండేందుకు కొన్ని నేచురల్ ప్యాక్స్ ఉన్నాయి . ఈ ప్యాక్స్ చర్మం మీద ఏర్పడ్డ డార్క్ పిగ్మెంటేషన్ తొలగించడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కాబట్టి వర్షాకాలంలో కూడా మీ చర్మం నల్లగా మారకుండా సన్ టాన్ నివారించడానికి కొన్ని హోం మేడ్ ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి. వాటిని ఒక సారి పరిశీలించండి.

ఆరెంజ్ ఫేస్ ప్యాక్

ఆరెంజ్ ఫేస్ ప్యాక్

ఆరెంజ్ పౌడర్ ను ఒక టేబుల్ స్సూన్ తీసుకొని. అందులో కొద్దిగా పాలు మిక్స్ చేయాలి. తర్వాత మెత్తగా పేస్ట్ చేయాలి . చర్మం సన్ టాన్ కు గురైన ప్రదేశంలో అప్లై చేసి కొద్దసేపటి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి . ఆరెంజ్ లోని బ్లీచింగ్ ఎఫెక్ట్స్ చర్మాన్ని లైట్ చేస్తుంది. మరియు మాయిశ్చరైజ్ గా పనిచేస్తుంది.

లెమన్ ఫేస్ ప్యాక్

లెమన్ ఫేస్ ప్యాక్

ఇది ఒక నేచురల్ బ్యూటీ బ్లీచ్ . నిమ్మతొక్కను పంచదారలో అద్ద ముఖం మీద స్ర్కబ్ చేయాలి. ఈ పద్దతి వల్ల మీ ముఖం శుభ్రపడటమే కాదు, టాన్ ను కూడా తొలగిస్తుంది. ఇంకా నిమ్మరసంలో కొద్దిగా పాలు మిక్స్ చేసి టాన్ కు గురైన ప్రదేశంలో అప్లై చేయాలి.

పెరుగుతో ఫేస్ ప్యాక్

పెరుగుతో ఫేస్ ప్యాక్

టానింగ్ కు మరొక ప్రభావవంతమైన హోం రెమడీ, పెరుగు మరియు నిమ్మరసం మరియు తేనెను పేస్ట్ లా తయారు చేయడమే. ఈ మూడింటి మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. దాంతో చర్మం మంచి కాంతివంతంగా మారుతుంది.

కుంకుమపువ్వు మరియు పాలతో ఫేస్ ప్యాక్

కుంకుమపువ్వు మరియు పాలతో ఫేస్ ప్యాక్

చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో మంచి లక్షణాలు ఈ కుంకుమ పువ్వులో ఉన్నాయని ప్రశంసించారు. టానింగ్ ను తొలగించుకోవడానికి కుంకుమ పువ్వు మరియు మిల్క్ క్రీమ్ ను కూడా మిక్స్ చేసి, చర్మ సమస్య ఉన్న ఏరియాల్లో అప్లై చేయాలి. తర్వాత మీ చర్మం ఖచ్చితంగా డీటాన్డ్ గా కనిపిస్తుంది.

పసుపు ఫేస్ ఫ్యాక్

పసుపు ఫేస్ ఫ్యాక్

పసుపులో అద్భుతమైన యాంటీ ఆన్ఫ్లమేటరీ మరియు బ్యూటీ లక్షణాలు కలిగి ఉన్నాయి . పసుపులో కొద్దిగా కొబ్బరి నూనె లేదా పాలు వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి. కొద్ది సమయం తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

కీరదోసకాయతో ఫేస్ ప్యాక్

కీరదోసకాయతో ఫేస్ ప్యాక్

సన్ టాన్ నివారించడంలో కీరదోసకాయ ఎంత గొప్పదో మనందరికీ తెలిసన విషయమే. అందం విషయంలో దీన్ని వివిధ రకాలుగా ఉపయోగిస్తారు . కీరదోసకాయను గుజ్జులా చేసి ముఖానికి పట్టించి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

టమోటో ఫేస్ ప్యాక్

టమోటో ఫేస్ ప్యాక్

సన్ టాన్ కు గురియైన ప్రదేశంలో టమోటో గుజ్జును అప్లై చేయడం వల్ల చాలా ప్రభావంతంగా పనిచేసి సన్ టాన్ వల్ల డ్యామేజ్ అయిన చర్మాన్ని తిరిగి యాథా స్థితికి తీసుకొస్తుంది. సన్ టాన్ కు గురైన ప్రదేశంలో టమోటోగుజ్జుతో పాటు, పెరుగును కూడా అప్లై చేయడం వల్ల ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది అప్లై చేసిన పది నిముషాలు అలాగే ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

Story first published: Monday, April 7, 2014, 8:58 [IST]
Desktop Bottom Promotion