Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ప్రకాశవంతమైన చర్మానికి ఎగ్ వైట్-బొప్పాయి ఫేస్ ప్యాక్
బిజీ షెడ్యూల్లో స్పాలు, బ్యూటీ సెంటర్లు చుట్టు తిరుగుతూ, అందాన్ని మెరుగుపరుచుకుంటారు. అయితే ఫ్యాన్సీ సర్వీస్ లకు వేలకు వేలు డబ్బు ఖర్చు పెట్టుట కంటే, మీరే స్వంతగా, ఇంట్లోనే కొన్ని ఉత్తమ మార్గాలను ఎంపిక చేసుకొని, మంచి ఫలితాలను పొందవచ్చు.
జుట్టు రాలడం తగ్గించే టాప్ 10 న్యూట్రీషియన్ ఫుడ్స్: క్లిక్ చేయండి
అలా ఇంటి పద్దతులను ఎంపిక చేసుకొనే వారికోసం, ఫ్యాన్సీ సర్వీసులను వద్దనుకొనే వారికసం కేవలం ఈ వంటగది వస్తువులను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. కాంతి వంతమైన చర్మ సౌందర్యానికి ఉత్తమైన వంటింటి వస్తువులతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం ఎలా? ఎటువంటి చర్మ తత్వానికి ఎటువంటి ఫేస్ ప్యాక్ లను వేసుకోవాలో క్రింది విధంగా తెలుసుకుందాం..
ఉదర సంబంధ జబ్బులను మటుమాయం చేసే బొప్పాయి:క్లిక్ చేయండి

ఆయిల్ స్కిన్:
చర్మాన్ని కాంతివంతగా మార్చుకోవడం, డ్రై స్కిన్ ను నివారించడం మరియు చర్మం మీద ఛారలు మరియు చర్మంలోని సెబాసియస్ గ్రంథుల వల్ల ఆయిల్ స్కిన్ కు కారణం అవుతుంది. ఆయిల్ స్కిన్ కాంతి వంత చర్మాన్ని పాడు చేస్తుంది, ఆయిల్ స్కిన్ డస్ట్ మరియు చర్మ రంధ్రాలను ఏర్పడేలా చేస్తుంది. ఈ సమస్యను నివారించడానికి కొన్ని మార్గాలు క్రింది విధంగా ఉన్నాయి.

ఎగ్ వైట్ ఫేస్ మాస్క్
ఎగ్ వైట్ మాత్రమే ఎందుకు: ఎగ్ వైట్ లో ప్రోటీనులు అధికంగా కలిగి ఉన్నాయి. ఇది మొటిమలు మచ్చలను తొలగించడానికి ఎగ్ వైట్ అద్భుతంగా సహాయపడుతుంది. ఎగ్ వైట్ లో ఇంకా ఆస్ట్రిజెంట్స్ లక్షణాలు కలిగి ఉండి ఇది స్కిన్ ఎలా సిటిని పెంచుతుంది . దాంతో చర్మరంధ్రాలు మూసుకొనేందుకు సహాయపడుతుంది. ఇది ఆయిల్ స్కిన్ ను స్మూత్ గా నానేలా చేస్తుంది కానీ చర్మాన్ని పొడిగా మారనివ్వదు మరియు ఎటువంటి స్కార్స్ లేకుండా చేస్తుంది .
ఎగ్ మాస్క్ వేసుకొనే పద్దతి:
ఎగ్ వైట్ ను ఒక బౌల్లోనికి తీసుకొని, అందులో ఒక టీస్పూన్ నిమ్మరసం మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని శుభ్రంగా ఉన్న పొడి ముఖానికి అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత 15నిముషాలు అలాగే ఉంచాలి. అప్లై చేసినప్పుడు మాట్లాడుకూడదు, తినకూడదు, లేదా ముఖంను కదిలించకూడదు. ఫేస్ మాస్క్ పొడిబారిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి .

ఆస్పిరిన్ మాస్క్:
ఆస్పిరిన్ ఎందుకు: ఇందులో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఆస్పిరిన్ గొప్ప స్ర్కబ్బింగ్ గా ఉపయోగపడుతుంది మరియు డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. అంతే కాదు ఇది ఆయిల్ స్కిన్ నివారిస్తుంది మరియు ఇన్ల్ఫమేషన్ తగ్గిస్తుంది.
పద్దతి:
ఆస్పిరిన్ పిల్స్ ను మొత్తగా పొడి చేయాలి. తర్వాత అందులో కొద్దిగా నీళ్ళు పోసి, పేస్ట్ లా తయారుచేసుకోవాలి. పేస్ట్ మరీ పొడిగా అనిపిస్తే మీరు అందులో పెరుగును మిక్స్ చేయవచ్చు. ఈ మిశ్రమానని ముఖానికి అప్లై చేయాలి. కళ్ళకు తగలకుండా అప్లై చేయాలి. పది నిముషాలు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.

డ్రై స్కిన్:
పొడి చర్మం చూడటానికి అసహ్యంగా ఉంటుంది. ఇది పొడిగా, ఇన్ఫ్లమేషన్ మరియు ముడుతలు కలిగి ఉంటుంది. మరియు ఇది త్వరగా వయస్సైన వారిలా చేస్తుంది. అందుకు ఈ ఫేస్ ప్యాక్ అద్భుతాలనే చేస్తుంది . దాంతో చర్మం మాయిశ్చరైజ్ గా మరియు హైడ్రేషన్ లో ఉంచుతుంది.

అవొకాడో ఫేస్ మాస్క్
అవొకాడో ఎందుకు: ఇందులో హెల్త్ ఫ్యాట్స్ మరియు ఫైటోన్యూట్రియంట్స్, అవొకాడోలు డ్రై స్కిన్ మరియు డ్రై హెయిర్ ను మాయిశ్చరైజింగ్ ఉంచుతుంది. ఇందులో ఫుల్ మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉండి చర్మాన్ని స్మూత్ గా మార్చుతుంది, ఇది ఇన్ఫ్లమేషన్ మరియు టిష్యు డ్యామేజ్ ను నివారిస్తుంది.
పద్దతి:
అవొకాడోను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత అందులో తేనె మరియు పెరుగు మిక్స్ చేయాలి. అలాగే మీ చర్మం దురుదతో ఉంటే అందులో కొంత ఆలివ్ ఆయిల్ ను వేసి బాగా మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని మెడ మరియు ముఖఆనికి అప్లై చేసి 20 నిముషాలు అలాగే ఉంచాలి. తర్వాత వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

అరటి ఫేస్ ప్యాక్:
అరటిపండు ఎందుకు: ఇన్ఫ్లమేషన్ కు గురైన చర్మానికి ఇది చల్లదనాన్ని అందిస్తుంది. అంతే కాదు ఇది మొటిమాలు మరియు మచ్చలను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది . అంతే కాదు ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల ఇది చర్మాన్ని నునుపుగా మార్చుతుంది .
పద్దతి:
అరటిపండు తొక్క తీసి, మెత్తగా గుజ్జులా చేయాలి. ఈ పేస్ట్ కు కొద్దిగా తేనె మిక్స్ చేసి, శుభ్రంగా ఉన్న ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

నిర్జీవమైన చర్మానికి :
ఒత్తిడితో కూడిన లైఫ్ స్టైల్, కాలుష్యం, అసతుల్యమైన మరియు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వల్ల చర్మం నిర్జీవంగా మరియు నిస్తేజంగా కనబడుతుంది . ఈ సమస్యను నివారించుకోవాలంటే, పపాయ ఫేస్ ప్యాక్ అద్భుతంగా పనిచేసే ఫేస్ ప్యాక్:

పపాయ ఫేస్ ప్యాక్ ఎందుకు:
పపాయ ఎందుకు: పపాయలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంది. అంతే కాదు ఇందులో యాంటీఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంది . ఇవి ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది . ఇంకా పపాయ ఎక్స్ ఫ్లోయేటర్ గా పచేస్తుంది . ఇంకా డెడ్ స్కిన్ సెల్స్ ను నివారిస్తుంది.
పద్దతి:
పపాయలోని విత్తనాలు తొలగించి, తర్వాత చిన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత అందులో తేనె వేసి మెత్తగా పేస్ట్ చేయాలి . ఈ మిశ్రమాన్ని శుభ్రంగా పొడిగా ఉన్న చర్మానికి ప్యాక్ వేసుకోవాలి 20నిముషాలు తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

నిమ్మరసం మరియు సీసాల్ట్ మాస్క్
లెమన్ జ్యూస్ మరియు సీసాల్ట్ ఎందుకంటే. ఇది ఒక అద్భుతమైన ఫేస్ మాస్క్. సీసాల్ట్ ఒక డెడ్ స్కిన్ సెల్స్ ను నివారించడంల అద్భుతంగా పనిచేస్తుంది మరియు ఇది నేచురల్ డిటాక్షిఫైయర్ . అలాగే నిమ్మరంస ఒక అద్భుత బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. నిమ్మరసం లైట్ స్కార్స్ మరియు మచ్చలను లైట్ చేస్తుంది. మరియు యాంటీసెప్టిక్ లక్షణాలు అద్భుతంగా ఉన్నాయి. మొటిమలు మరియు మచ్చలకు కారణం అయ్యే బ్యాక్టీరియా మరియు డర్టీని తొలగిస్తుంది.
పద్దతి:
ఒక కాల్ కప్పులో సీ సాల్ట్ మరియు నిమ్మరసం మిక్స్ చేయాలి. ఇది హైపో అలర్జిక్ మరియు సెన్సిటివ్ స్కిన్ కలిగిన వారు ఉపయోగించవచ్చు . ఇది దద్దుర్లను నివారిస్తుంది, చిరాకు కలిగించే చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది . మొటిమలు, ఎంజైమ్ లు మరియు రొసొసియాను నివారిస్తుంది మరియు ఇది ఒక మంచి నేచురల్ మరియు ఎక్స్ ఫ్లోయేటర్ గా పరిచేస్తుంది. కాల్ కప్పు సీసాల్ట్ కు కొద్దిగా నిమ్మరసం మిక్సే చేసి, ముఖం, మెడ మీద అప్లై చేయాలి.

ఓట్ మీల్ ఫేషియల్ :
ఓట్ మీల్ : ఓట్ మీల్లో బెస్ట్ అమినో యాసిడ్స్ కలిగి ఉండి ఇది బ్యాలెన్స్ చేస్తుంది. ఇది హైపో అలర్జిక్ మరియు ఇది సెన్సిటివ్ స్కిన్ కలిగిన వారికి ఉపయోగిస్తారు . ఇది దద్దుర్లు మరియు చిరాకు కలిగించే చర్మాన్ని ఉపశమనం కలిగిస్తుంది. ఇది నేచురల్ ఎక్స్ ఫ్లోయేటర్ గా పనిచేస్తుంది.
పద్దతి:
రెండు చెంచాలా ఓట్ మీల్ ను ఒక కప్పు పాలలో వేసి మిక్స్ చేసి వేడి చేయాలి. ఇది చిక్కటి పేస్ట్ లా తయారవుతుంది. తర్వాత స్టౌ ఆప్ చేసి ఆలివ్ ఆయిల్ వేసి మిక్స్ చేయాలి.ఈ మిశ్రమం వేడిగా ఉండగానే ముఖానికి అప్లై చేయాలి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications











