Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
చర్మం మీద మచ్చలను నివారించే ఆలివ్ ఆయిల్
ఆలివ్ రుచినీ, సువాస ననీ, విటమిన్స్‌నీ, సహజ లక్షణా లనీ, గుణాలనీ పదిలపరచు కున్న సహజమైన ఫలరసం ఆలి వ్ ఆయిల్. ఆలివ్ పండులోంచి పిండగానే వెనువెంటనే ఎంతో స్వాదిష్టంగా సేవించగలిగిన ఆయిల్ ఇది ఒక్కటే. ఆలివ్ ఆయిల్‌ని ఎప్పుడూ సూర్యరశ్మి సోకే చోట వుంచకూడదు. సీసా మూత గట్టిగా మూసి, చల్లగా పొడిగా వుండే ప్రదేశాల్లో మాత్రమే పెట్టాలి. ఏ ఉష్ణోగ్రతలలోనైనా ఆలివ్ ఆయిల్‌కి కొద్దిగా గాలి సోకినా అందులో రాన్‌సిడిటీ పెరిగిపోతుంది. కనుక మన గుండె బలానికీ, క్యాన్సర్ నివారణకీ ఎంతగానో దోహదం చేసే ఆలివ్ ఆయిల్‌ని ఎంతో భద్రంగా పదిల పరచి వాడుకుంటే, నిస్సందేహంగా ఆలివ్ ఆయిల్ మనపాలిట సంజీవనిగా పనిచేస్తుంది. అంతే కాకుండా ఆలివ్ ఆయిల్ చర్మ సంరక్షణలోనూ, జుట్టు సంరక్షణలోనూ ఎంతో ఉపయోగపడుతుంది.

1. పొడిచర్మం ఉన్నవారు ఆలివ్‌ఆయిల్‌లో నిమ్మరసాన్ని కలిపి ముఖానికి ఆరారగా రాస్తూంటే ముఖ చర్మం తేమగా ఉంటుంది. కాంతిగానూ, మృదువుగానూ మారుతుంది.
2. ఆలివ్‌ఆయిల్‌లో పసుపుపొడిని కలిపి పాదాల పగుళ్ళకు, వేళ్ళమధ్య పాసిన చర్మానికి రాస్తూంటే ఆ బాధ తగ్గిపోయి, చర్మం చక్కగా ఉంటుంది.
3. ఆలివ్‌ఆయిల్‌లో నిమ్మరసాన్ని కలిపి పెదాలకు రాయడం వల్ల పెదాలు పగలవు.
4. ఆలివ్‌ఆయిల్‌లో టమాటోరసం, క్యారెట్‌జ్యూస్, పెరుగుకలిపి చర్మం మీద ఏర్పడ్డ మచ్చలు, ఛారల మీద రాస్తూంటే, తొలగిపోతాయి. ఆలివ్ ఆయిల్ గోళ్ళకు మసాజ్ చేస్తే గోళ్ళ దృఢత్వం, అందం పెరుగుతాయి. ఆలివ్‌ఆయిల్‌ను గోళ్ళమీద ప్రతిరోజూ రాస్తూంటే, గోళ్ళ ధృడత్వం, అందం పెరుగుతాయి.
5. చర్మం పొడారిపోయినట్లుగా కళావిహీనంగా ఉంటే ఆలివ్ ఆయిల్‌లో పాలనుకానీ, పాలమీగడను కానీ కలిపి ఆ మిశ్రమంతో మృదువుగా మసాజ్‌చేసి, ఆ తర్వాత నీటితో చర్మాన్ని శుభ్రపరిస్తే చర్మానికి మంచి కాంతి, నునుపుదనం, తేమ ఏర్పడతాయి.
6. ఆలివ్ ఆయిల్‌తో తేనెను కలిపి ముఖానికి రాసి, కొంతసేపయిన తర్వాత ముఖాన్ని మెత్తని సున్నిపిండితో రుద్దుకుని కడుక్కుంటే ముఖవర్ఛస్సు పెరుగుతుంది.
7. స్నానం చేసే నీటిలో ఆలివ్ ఆయిల్‌ని కలిపి, ఆ నీటితో స్నానం చేసినట్ల యితే చర్మానికి నూతన కాంతి కలుగుతుంది. 8. ఆలివ్ ఆయిల్‌తో చర్మాన్ని మసాజ్ చేయడం వల్ల చర్మానికి మృదుత్వం ఏర్పడుతుంది.
9. చెంచా గ్లిజరిన్, కొద్దిగా రోజ్‌వాటర్, రెండుచెంచాల ఆలివ్‌నూనె, కాస్త నిమ్మరసం, గుడ్డులోని తెల్లసొన కలిపి చేతులకు పూతలా వేసుకోవచ్చు. ఆరాక కడిగేసుకుంటే చాలు... చేతులు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి.
10. చర్మం పొడారిపోయినట్లుగా కళావిహీనంగా ఉంటే ఆలివ్ ఆయిల్‌లో పాలనుకానీ, పాలమీగడను కానీ కలిపి ఆ మిశ్రమంతో మృదువుగా మసాజ్‌చేసి, ఆ తర్వాత నీటితో చర్మాన్ని శుభ్రపరిస్తే చర్మానికి మంచి కాంతి, నునుపుదనం, తేమ ఏర్పడతాయి.



Click it and Unblock the Notifications