Latest Updates
-
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు!
చలికాలంలో చర్మానికి హాని కలిగించే ఫేస్ వాష్ తప్పిదాలు
ప్రతి ఒక్కరూ రోజుకు రెండు సార్లు ఫేస్ వాష్ చేసుకోవడం ఒక సులభమైన అలవాటు. ప్రతి రోజూ ఫేస్ వాష్ ఎందుకు చేసుకోవాలని దాని వల్ల ప్రయోజనాలేంటి తెలుసుకోకుండా ఫేస్ వాష్ చేసుకోవడం అనే పరిశీలించవల్సిన విషయము.
మీకు తెలుసో లేదో, ఫేస్ వాష్ చేసేప్పుడు, తప్పు పద్దతులను అనుసరిస్తే, చర్మానికి హాని జరగక తప్పదు? ఎందుకాలా జరుగుతుందని కనుక్కోవాలంటే, ఇదే మంచి సమయం, చలికాలంలో ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల ఎదుర్కొనే వివిధ రకాల తప్పిదాలను తప్పని సరిగి తెలుసుకోవాలి.
వాతావరణంలో ఉష్ణోగ్రత ఎప్పుడైతే తగ్గుతుందే, చర్మ సమస్యలు క్రమంగా పెరుగుతాయి. శీతాకాలంలో వాతావరణంలో మార్పలు, చల్లిని వాతావరణం, మరియు కఠినమైన ఈదురు గాలులు, చర్మాన్ని డ్రైగా మరియు దురద, ముఖం మీద పొట్టులా ఏర్పడేలా చేస్తుంది.

శీతాకాలంలో ఇటు ఆరోగ్యం మరియు చర్మంను సంరక్షించుకోవడం ఒక సవాలుగా మారుతుంది. అందుకే కరెక్ట్ అయిన పద్దతులు తెసులకోకుండా చలికాలంలో తరచూ ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలను ఎదుర్కోవల్సి ఉంటుంది. కాబట్టి, అలా జరగకుండా ఉండాలంటే, ఫేస్ వాష్ చేసుకొనేప్పుడు తప్పిదాలను నివారించడం కోసం ఇక్కడ మీకోసం కొన్ని చిట్కాలను తెలుపుతున్నాము...
1. ఎక్కువగా ఫేస్ వాష్ చేయడం: చలికాలంలో ఎక్కువసార్లు ఫేస్ వాష్ చేసుకోవడం ఒక పెద్ద సాధారణ తప్పిదము . ముఖం మీద ఎక్కువగా రుద్దడం మరియు సోప్ తో డీప్ క్లెన్సింగ్ చేయడం వంటి పద్దతులను ప్రతి ఒక్కరూ వారికి తెలియకుండానే అనుసరిస్తుంటారు. కాబట్టి, చలికాలంలో ఈ పద్దతిని మానుకోవాలి.
2. క్లెన్సర్ ఎంపికలో తప్పుగా ఉండటం: చలికాలంలో ఫేస్ వాష్ కు సోపు ఉపయోగించాలా అనేదే పెద్ద ప్రశ్న? సరైన క్లెన్సర్ ను ఉపయోగించాలి . క్లెన్సర్ ను ఏఏ పదార్థాలతో తయారుచేశారో తెలుసుకోకుండా, చదవకుండానే వాటిని ఉపయోగించడం వల్ల చర్మం మరింత కఠినంగా మారుతుంది . టీట్రీ ఆయిల్ మరియు సలిసిలక్ యాసిడ్ తో తయారైన ఉత్పత్తులను సెన్సిటివ్ స్కిన్ మరియు మొటిమలు మచ్చలున్న చర్మానికి చాలికాలంలో క్లెన్సర్ గా ఉపయోగించవచ్చు.
3. వేడి నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకోవడం :చలికాలంలో, చర్మం ఎక్కువగా పొడిబారటం జరుగుతుంది. కాబట్టి, వేడి నీళ్ళు చర్మాన్ని మరింత డ్రైగా మార్చుతుంది. సున్నితమైన చర్మానికి సాఫ్ట్ ఫేస్ వాష్ కోసం గోరువెచ్చని నీరు లేదా చల్లని నీరు ఉత్తమం. చలికాలంలో వేడిగా ఉన్న నీరుతో ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల చర్మం మీద ముడుతలు ఏర్పడుతాయి. కాబట్టి, చలికాలంలో ఫేస్ వాష్ చేసేప్పుడు నివారించాల్సిన వాటిని ఇది ఒకటి.
4. రాత్రుల్లో నిద్రించడానికి ముందు ముఖం శుభ్రం చేసుకోకపోవడం: నిద్రించే ముందు ముఖం కడుక్కోకుండా అలాగే పడుకోవడం వల్ల చర్మసౌందర్యాన్ని పాడుచేస్తుంది. ముఖ చర్మంలో దుమ్ము, ధూళి చేరి, సెబమ్ ఫార్మేషన్ ను నివారిస్తుంది. ఫలితంగా చర్మం నిర్జీవంగా మరియు పేలవంగా కనిపిస్తుంది . రాత్రి నిద్రించడానికి ముందు మేకప్ ను కూడా తప్పనిసరిగా తొలగించుకోవాలి.
5. అతిగా ఎక్స్ ఫ్లోయేట్ చేయడం: ఎక్స్ ఫ్లోయేట్ వల్ల ముఖం అదనపు సెల్స్ ను తొలగించడం జరుగుతుంది, మరియు చర్మాన్ని సున్నితంగా మార్చుతుంది. అతిగా ఎక్స్ ఫ్లోయేట్ చేయడం వల్ల చర్మానికి చాలా చెడుగా డ్యామేజ్ జరుగుతుంది. చలికాలంలో వారంలో రెండు సార్లు కంటె ఎక్కువగా ఎక్స్ ఫ్లోయేట్ చేయడం వల్ల స్కిన్ సెల్స్ ను డ్యామేజ్ చేస్తుంది. రాత్రుల్లో ఎక్స్ ఫ్లోయేట్ చేయడానికి సరైన సమయం.
6. మాయిశ్చరైజర్ అప్లై చేయకపోవడం: చర్మ సంరక్షణ పద్దతుల్లో అనుసరించే వాటిలో మరో తప్పిదం ఫేస్ వాష్ చేసుకొన్న తర్వాత మాయిశ్చరైజర్ ను అప్లై చేయకపోవడం, ముఖ్యంగా చలికాలంలో మాయిశ్చరైజర్ అప్లై చేయకపోవడం మనం చేసే అతి పెద్ద తప్పిదం. చలికాలంలో ఫేస్ వాష్ చేసుకొన్న వెంటనే ముఖానికి మాయిశ్చరైజర్ ను అప్లై చేయడం ఒక ముఖ్యమైనటువంటి విషయం.
7. డర్టీ వాష్ టవల్ ను ఉపయోగించడం: ఫేష్ వాష్ తర్వాత అశుభ్రంగా లేదా మురికిగా ఉన్న టవల్ తో ముఖాన్ని తుడవడం. దాని వల్ల చర్మం మీద క్రిములు చేరుతాయి. క్లీన్ గా శుభ్రంగా ఉన్న టవల్ తో ముఖాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి.



Click it and Unblock the Notifications











