Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
ముఖం మీద మచ్చలను తొలగించటానికి సహజ నివారణలు
చర్మ పరిస్థితులు,కొన్ని సౌందర్య సాధనాలు,ప్రమాదాలు,పోరాటాలు,వ్యాధులు మొదలైన అనేక కారణాల వలన మచ్చలు ఏర్పడతాయి. మచ్చలు అనేవి ఏ విధంగా వచ్చిన సరే,కొన్ని సహజ నివారణల ద్వారా మచ్చ రూపాన్ని తగ్గించుట లేదా కొంచెం రంగు మారేలాగా చేయవచ్చు. మీకు మచ్చ గురించి ఆందోళన ఉంటే కనుక,అప్పుడు మీరు ఒక వైద్యునితొ మాట్లాడటం లేదా స్కిన్ స్పెషలిస్ట్ సలహా తీసుకోవటం మంచిది.

మచ్చలు తేలికపడటానికి
ఆలివ్ నూనెను రాస్తే మచ్చలు తగ్గుతాయి. ఆలివ్ నూనె రాసిన తర్వాత మీ ముఖానికి తేలికపాటి ఆవిరి పట్టాలి. చర్మ రంధ్రాలు క్లియర్ అయ్యి మచ్చలు తేలికపడతాయి.

గంధం
గంధం రాస్తే మచ్చలు తగ్గటానికి సహాయం చేస్తుంది. గంధం పొడిలో రోజ్ వాటర్ లేదా పాలు కలిపి, ఆ మిశ్రమాన్ని మచ్చలు ఉన్న ప్రాంతంలో రాసి ఒక గంట తర్వాత చల్లన్ని నీటితో శుభ్రం చేయాలి.

బాదం
బాదంను నీరు లేదా పాలలో 12 గంటలు నానబెట్టాలి. నానిన బాదం యొక్క పై తొక్కను తీసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ ముద్దలో రోజ్ వాటర్ కలిపి మచ్చలు ఉన్న ప్రాంతంలో రాయాలి.

కొత్త చర్మ కణాల నిర్మాణం
స్క్రబ్బింగ్ తరువాత కొత్త కణాల ఉత్పత్తిలో చర్మానికి సహాయపడటానికి ఏదైనా రాయాలి.నిమ్మకాయ రసంలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల మీరు ఈ ప్రయోజనం కోసం నిమ్మకాయను ఉపయోగించవచ్చు. తాజా నిమ్మరసంను కాటన్ బాల్ తో తీసుకోని మీ ముఖం మీద శాంతముగా రాయాలి. అప్పుడు మీ చర్మం నిమ్మరసంను గ్రహిస్తుంది. చర్మం తనంతట తాను పునరుద్ధరణ జరగటానికి సహాయం చేస్తుంది. అంతేకాక మీ చర్మం రంగు మరియు టోన్ పెరుగుతుంది.

నిమ్మ రసం
రెండు వారాల పాటు ప్రతి రోజు మూడు సార్లు నిమ్మరసం త్రాగితే మచ్చలు తగ్గుతాయి.

స్క్రబ్బింగ్
బేకింగ్ సోడాతో మీ చర్మాన్ని స్క్రబ్బింగ్ చేస్తే మచ్చలు తగ్గటంలో సహాయపడుతుంది. బేకింగ్ సోడాలో నీటిని కలిపి రెండు నిముషాలు అయ్యాక స్క్రబ్ చేయాలి. పది నిముషాలు అయిన తర్వాత వేడి నీటితో శుభ్రం చేయాలి. దీనిని క్రమం తప్పకుండా చేయాలి.

ముల్లంగి విత్తనాలు
ముల్లంగి విత్తనాలను పేస్ట్ చేసి క్రమంగా తప్పకుండా ముఖానికి రాస్తే,అది మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది.

బంగాళాదుంప
బంగాళాదుంప మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిలో సల్ఫర్ మరియు పొటాషియం ఉంటుంది. పచ్చి బంగాళదుంప గుజ్జు నుండి రసం తీసి మచ్చలు ఉన్న ప్రాంతంలో రాయాలి.

క్రీమ్స్ లేదా జెల్స్
మీరు లేజర్ లేదా డెర్మబ్రాసియన్ వంటి కొన్ని పద్ధతుల ద్వారా ముఖ మచ్చలను తొలగించవచ్చు. అంతేకాకుండా మీరు సమర్థవంతంగా మీ చర్మంపై మచ్చలు మరియు నల్లని మార్కులు తగ్గించటానికి కొన్ని మచ్చ-తొలగింపు క్రీమ్స్ లేదా జెల్స్ ను ఎంచుకోవచ్చు.

మీ ముఖ చర్మంపై మచ్చలు మరియు నలుపు మార్కులు ఏమి చెబుతున్నాయి?
మీ ముఖ చర్మంపై మచ్చలు మరియు నలుపు మార్కులు ఏమి చెబుతున్నాయి? మీరు మచ్చలు తేలిక చేయటానికి మరియు మీ చర్మం ప్రకాశవంతంగా ఉండటానికి సహజ నివారణల కోసం చూస్తున్నారా? మీరు మచ్చల నివారణ కోసం ఇంటి పరిష్కారాల కోసం చూస్తూ ఉంటే,పైన పేర్కొన్న చికిత్సలను ప్రయత్నించండి. ఈ సహజ నివారణలు మచ్చలు తొలగించి మీ చర్మ నాణ్యతను మెరుగుపరిచేందుకు సహాయం చేస్తాయి. అయితే మీరు 1 నుండి 2 వారాల ఈ చికిత్సల కోసం ఓపికగా ఉండాలి.



Click it and Unblock the Notifications