For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖం అందంగా..కాంతివంతం చేయడం కోసం ఉత్తమ చిట్కాలు

By Super
|

ప్రతి ఒక్కరికి పరిపూర్ణ ముఖం ఉండాలని కోరిక ఉంటుంది. అలాగే ఇతరులను ఆకర్షించే ముఖం ఉండాలని, వేడుకలు సందర్భంగా అందరూ వావ్ అనాలని అనిపించటం సహజం.

ఇది సులభం కాదు. కానీ చాలా కష్టం కాదు. మీరు సమయం మరియు కృషి పెడితే పరిపూర్ణ ముఖం మీదే అవుతుంది.

ఇక్కడ మీరు రాబోయే పండుగ సీజన్లో మీ ముఖం ఉత్తమంగా కనపడటానికి సహాయం చేసే కొన్ని సాధారణ చిట్కాలు ఉన్నాయి.

మొటిమల మచ్చలు వదిలించుకోవటం

మొటిమల మచ్చలు వదిలించుకోవటం

చందనం,బాదం,తేనె మరియు పెరుగు అన్నింటిని కలిపి పేస్ట్ చేయండి. మీ ముఖం మరియు మెడ మీద ఈ పేస్ట్ ను ప్రతి రోజు రాసి,పది నిమిషాల తర్వాత శుభ్రంగా కడగాలి.

మీ కనుబొమ్మలను తీర్చిదిద్దండి

మీ కనుబొమ్మలను తీర్చిదిద్దండి

ఇది మీ ముఖం బాగా వివరణాత్మకంగా ఉండటానికి ముఖ్యమైన దశ. మీ కనుబొమ్మలను ఒక ప్రొఫెషనల్ తో షేపింగ్ చేయించండి. అప్పుడు నిజంగా మీ మొత్తం లుక్ మారుతుంది. మందపాటి కనుబొమ్మ లు ఉంటే,అవి మీ ముఖంకు ఒక యువ మరియు మృదువైన లుక్ ఇస్తాయి.(ఉదాహరణకు దీపికా పడుకొనే,అలియా భట్)

ప్రకాశవంతమైన చర్మం కోసం

ప్రకాశవంతమైన చర్మం కోసం

పెరుగు,తేనె మరియు కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి మీ ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత శుభ్రంగా కడగాలి. మీరు మీ ముఖంను శుభ్రం చేసినప్పుడు తేలికపాటి వృత్తాకార కదలికలను ఉపయోగించండి.

మృదువైన చర్మం కోసం

మృదువైన చర్మం కోసం

బాదం పేస్ట్ మరియు మెత్తని పండిన బొప్పాయి గుజ్జు కలిపి మీ ముఖానికి పట్టించి హాయిగా విశ్రాంతిగా పడుకోండి. 15-20 నిమిషాలు అయిన తర్వాత మృదువైన స్చ్రబ్ తో శుభ్రం చేసి మరియు ట్యాప్ నీటితో కడగాలి.

మృదువైన పెదవులకు

మృదువైన పెదవులకు

ఒక మృదువైన-పెళుసైన బ్రష్ ఉపయోగించండి. తాజా పాల క్రీమ్ ను పెదవులపై ఒక వృత్తాకార మోషన్ లో రాయాలి. ఒక నిమిషం అయిన తర్వాత శుభ్రంగా కడగాలి.

ముఖం మీద జుట్టు పోవటానికి

ముఖం మీద జుట్టు పోవటానికి

శనగపిండి,చిటెకెడు పసుపు,పెరుగు కలిపి పేస్ట్ చేసి ప్రతి రోజు ముఖానికి రాయాలి. అది ఆరిపోయిన తరువాత వృత్తాకార కదలికలను ఉపయోగించి శుభ్రంగా కడగాలి.

మీ సూక్ష్మరంధ్రాలు తగ్గటానికి

మీ సూక్ష్మరంధ్రాలు తగ్గటానికి

గుడ్డులోని తెల్లసొన,టమోటా మరియు గ్రౌండ్ బాదంను పేస్ట్ చేసి మీ ముఖం మీద ప్యాక్ వేసి,పది నిముషాలు తర్వాత శుభ్రంగా కడగాలి.

మీ ముక్కు మీద బ్లాక్ హెడ్స్ తగ్గటానికి

మీ ముక్కు మీద బ్లాక్ హెడ్స్ తగ్గటానికి

ఎర్ర కంది పప్పును ఒక గంట నానబెట్టి పేస్ట్ చేయాలి. మీ ముక్కు మీద ఈ పేస్ట్ రాసి పది నిమషాలు అయ్యాక ఒక నిమిషం స్క్రబ్ మరియు శుభ్రంగా కడగాలి.

మీ జుట్టుకు రంగు వేసినప్పుడు

మీ జుట్టుకు రంగు వేసినప్పుడు

మీరు జుట్టుకు రంగు వేయటానికి ముందు మీ జుట్టుకు పెట్రోలియం జెల్లీ రాయాలి. ఈ విధంగా చేయుట వలన మీ నుదుటి పైన జుట్టు రంగు మరకలను నిరోధిస్తుంది.

English summary

Quick home remedies for a perfect face

Who doesn't want to have a perfect face, a face which attracts others, a face which get wow! expressions during celebrations. It is not easy but not much difficult too. If you are ready for spending time and effort, perfect face will be yours.
Desktop Bottom Promotion