Latest Updates
-
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
సాధారణ చర్మ సమస్యలు: పరిష్కార మార్గం..
సాధారణంగా ఎప్పుడోఒకప్పుడు మనందరం సాధారణ చర్మ సమస్యలకు గురికాకతప్పదు. మొటిమల నుండి, చర్మం అలసట చెందడం వరకూ మరియు కళ్ళు ఉబ్బు వరకూ వివిధ రకాల సహజ చర్మం సమస్యలు ఈ రోజు మనం ఎదుర్కొంటున్నాము . ఈ చర్మ సమస్యలన్నింటినీ నివారించుకోవడం కోసం మార్కెట్లో లభించే అనేక రకాల క్రీములు, జెల్స్ ఉపయోగించినా, ఏఒక్కటి శక్తివంతంగా పనిచేయవు. తాత్కలికంగా ఫలితాన్నిచ్చేవే కానీ, శాస్వత పరిష్కారం ఒక్కటీ ఇవ్వవు.
అందువల్ల, కొన్ని సింపుల్ హోం రెమడీస్, నేచురల్ పరిష్కరాలు ఇటువంటి సహజ చర్మ సమస్యలను నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఉదాహరణకు మీ కళ్ళు బాగా ఉబ్బుగా మరియు అ లసినట్టు కనబడుతుంటే, రిఫ్రిజరేటర్ లో పెట్టిన, గ్రీన్ టీబ్యాగ్స్ తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. వీటిన కళ్ళ మీద కొద్దిసేపు పెడితే చాలు అలసిన కళ్ళు విశ్రాంతి పొందుతాయి మరియు కళ్ళ ఉబ్బును తగ్గిస్తాయి అంతే కాదు డార్క్ సర్కిల్స్ కూడా తగ్గిస్తాయి. ముఖ్యంగా, ఉప్పు తీసుకోవడం తగ్గించి, ప్రతి రోజూ ఎక్కు నీటిని త్రాగడం వల్ల ఈ సమస్యను నేచురల్ గా తగ్గించుకోవచ్చు.
అదే విధంగా సాండిల్ ఉడ్ పౌడర్, తేనె మరియు నిమ్మరసం మిశ్రమంతో ప్యాక్ లా వేసుకోవడం వల్ల ప్రకాశవంతంమైన, స్వచ్చమైన చర్మంను మీరు పొందవచ్చు. అంతే కాదు, ఇది చర్మం మీద పడ్డ ఎటువంటి మచ్చలు, చారలనైనా ఇది ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. నిమ్మరసం నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్. ఇది స్కిన్ టోన్ లైట్ చేస్తుంది మరియు సహజంగానే అనేక చర్మ సమస్యలను నివారిస్తుంది.
మీరు డ్రై స్కిన్ తో బాధపడుతున్నట్లైతే, పచ్చిపాలతో ముఖం మీద మసాజ్ చేయడం వల్ల చర్మం టైట్ గా మారుతుంది మరియు చర్మానికి కావల్సినంత తేమను అంధిస్తుంది. బ్రెడ్ తో పాలను మిక్స్ చేసి ప్యాక్ వేసుకోవడం అనేది ఒక నేచురల్ హోం రెమెడీ. ఇది సన్ టాన్ నివారిస్తుంది మరియు డార్క్ స్కిన్ తొలగించి కాంతివంతమైన చర్మంను అందిస్తుంది. అందువల్ల మరిన్ని సహజ చర్మ సమస్యలకు ఉత్తమ పరిష్కారమార్గాలు క్రింది విధంగా ఉన్నాయి.

డ్రై అండ్ పీలింగ్ స్కిన్
మీరు డ్రై మరియు పీలింగ్ స్కిన్ తో బాధపడుతున్నట్లైతే, మీరు రెగ్యులర్ గా పచ్చిపాలను ముఖానికి పట్టించాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల ఇది చర్మానికి తగినంత తేమను అందిస్తుంది మరియు గ్లాసీగా ఉంచుతుంది.

డార్క్ సర్కిల్స్
కళ్ళక్రింద నల్లటి వలయాలు, ఇది ఒక సాధారణ స్కిన్ సమస్య. ఈ సమస్య ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరినీ బాధిస్తోంది. చల్లగా ఉండే దోసకాయ ముక్కలను కళ్ళమీద 15నిముషాలు పెట్టుకోవాడం వల్ల కళ్ళకు విశ్రాంతితో పాటు డార్క్ సర్కిల్స్ తొలగిపోతాయి.

కళ్ళ అలసట మరియు కళ్ళ ఉబ్బు
కంప్యూటర్ ముందు స్థిరంగా ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల కళ్ళు అలసటకు మరియు కళ్ళు ఉబ్బడానికి కారణం అవుతుంది . అందుకు ప్రిజ్ లో ఉంచిన గ్రీన్ టీబ్యాగ్స్ ను కళ్ళ మీద పెట్టుకొని కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్ళ అలసటను తగ్గిస్తుంది మరియు కళ్ళ ఉబ్బును నివారిస్తుంది.

డ్రై లిప్స్
ఇది మరో కామన్ ప్రాబ్లమ్ . పెట్రోలియం జెల్లీ అప్లై చేసిన తర్వాత కూడా ఈ సమస్య తగ్గకపోవడం, పెదాల పగుళ్ళు ఏర్పడటం జరుగుతుంద. అందువల్ల పెదాలను కొరకడం, లిప్ స్టిక్ మరియు గ్లాసీ అప్లై చేయడానికి కొద్దిరోజులు నివారించాలి.

మొటిమలు
ఇది మరొక సాధరణ చర్మ సమస్య . ఈ సమస్య టీనేజర్స్ లో ఎక్కువగా బాధిస్తుంటోంది. అంతే కాదు మద్యవయస్కుల్లో కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను నేచురల్ గా నివారించుకోదల్చుకొన్నప్పుడు, అలోవెరా జెల్ , నిమ్మరసం, మరియు టమోటో వంటివి అప్లై చేయడం వల్ల మొటిమలు మరియు మచ్చలు, డార్క్ సర్కిల్స్ నివారించబడుతుంది.

సన్ టాన్
వేసవిలో,వాతావరణ వేడి, ఎండ చర్మం మీద పడటం వల్ల చర్మం నల్లగా మారుతుంది . దీన్నే సన్ టాన్ అంటారు. సన్ టాన్ నివారించుకోవడానికి ఆరెంజ్, పెరుగు, పాలు మరియు పసుపు వంటివి అప్లై చేయడం వల్ల నేచురల్ గా వీటిని తొలగించుకోవచ్చు.

డార్క్ స్కార్స్
ఎంత అందంగా ఉన్న ఒక్క నల్ల మచ్చ ముఖంలో కనబడితే చాలు అందవిహీనంగా కనబడుతారు. కాబట్టి, ఎటువంటి మచ్చలు, మొటిమలు లేని స్వచ్చమైన చర్మ సౌందర్యాన్ని పొందడానికి నిమ్మరసం-సాండిల్ ఉడ్ పౌడర్ ను ఫేస్ ప్యాక్ గా అప్లై చేయాలి. అలాగే కొద్దిగా తేనె మరియు పెరుగు మిశ్రమం కూడా డార్క్ సర్కిల్స్, డార్క్ స్పాట్స్ ను నేచురల్ గా నివారిస్తుంది.

బ్లాక్ హెడ్స్
వంటగది వస్తువులైన తేనె, నిమ్మరసం, ఓట్ మీల్, గుడ్డు, నట్ మగ్ మొదలగునవవి బ్లాక్ హెడ్స్ నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ సింపుల్ హోం రెమడీస్ ఉపయోగించి బ్లాక్ హెడ్స్ ను నివారించుకోవచ్చు.

వైట్ ప్యాచ్చులు(తెల్ల మచ్చలు)
కొంత మంది చర్మం మీద తెల్ల మచ్చలతో బాధపడుతుంటారు. ఇది చర్మంను డ్రై గా మరియు డల్ గా మార్చేస్తుంది. అందుకు మిల్క్ క్రీమ్ ను చర్మంమీద అప్లై చేయడం వల్ల ఇది చర్మానికి కావల్సినంత తేమను అందిస్తుంది . ఇంకా తేనె కూడా తెల్ల మచ్చలను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

ఆయిల్ స్కిన్
మన చుట్టుూ ఉన్నవారిలో చాలా మంది ఆయిల్ స్కిన్ తో బాధపడుతుంటారు. ఈ ఆయిల్ స్కిన్ వల్ల మొటిమలు మరియు మచ్చలు ఎక్కువ అవుతాయి. నిమ్మరసం మరియు ఆరెంజ్ జ్యూస్ రెండింటిని మిక్స్ చేసి చర్మం మీద అప్లై చేయడం వల్ల ఈ సమస్యను నివారించుకోవచ్చు.



Click it and Unblock the Notifications