Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్‌తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
నిత్యం యవ్వనం ఆరోగ్యంగా ఉంచే 10 సూపర్ టిప్స్
ఎప్పటికైనా , ఎవరైనా వృద్ధాప్యంలోకి అడుగుపెట్టక తప్పదు. కానీ వద్ధాప్యంలో పడ్డాక కూడా 'మీకు ఇంత వయసున్నట్టు కనబడరు అనే మెచ్చుకోలు పొందామంటే అది మన ఆరోగ్యాన్నీ, ఆహారపు అలవాట్లను సూచిస్తుంది. ఇంకా అనవసరపు ఆందోళనలకు లోనుకాకుండా, పొల్యూషన్ బారినపడకుండా ఉంటే కాలాన్ని పది- పదిహేనేళ్లు వెనక్కు తిప్పుకోవచ్చు. అదెలాగో పరిశీలిద్దామా!
చిన్ననాటి నుంచే ఆహారపు అలవాట్లు ఒక క్రమపద్ధతిలో ఉంటే అది మన శరీర సౌందర్యానికి చక్కని పునాదిగా ఉపయోగపడుతుంది. శరీరానికి అందాల్సిన పోషకాలు, విటమిన్లు సమపాళ్లలో అందించాలి. ఆహారంలో నూనెలు, కొవ్వులు, కోలాలు, కాఫీలు లేకుండా చూసుకోవాలి. ఆరోగ్యంగా ఉన్నవారి శరీరతత్వం సౌందర్యాన్నే సూచిస్తుంది. మీరు తినే ఆహారంలో తప్పనిసరిగా ఇక్కడ ఇచ్చినవి జత చేసుకుంటే 'మీరే కాలేజి అనిపించుకోవడం ఖాయం. ఇవన్నీ రోగ నిరోధక శక్తిని పెంచేవే కాక జీర్ణక్రియ చక్కగా పనిచేయడానికి ఉపయోగపడతాయి. మీ ఆహారంలో అవి ఎంత శాతం ఉంటున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి.
యవ్వనంగా ఉండాలంటే ఇటువంటి పనులు చేయకూడదు:క్లిక్ చేయండి

ప్రకతి ప్రసాదితాలు పళ్లు-కూరలు:
క్యాబేజీ, బ్రొకొలీ, ముల్లంగి, ఉసిరి, క్యారెట్ ఇవన్నీ విటమిన్లు సమద్ధిగా గల కూరగాయలు. విటమిన్ ఎ, సిలు కంటి చూపుకు, కంటికి సంబంధించిన జబ్బులనుంచి రక్షణనిస్తాయి. పాలకూర లేదా ఇతర ఆకుకూరలన్నీ శరీరానికి కావలసిన ఐరన్‌ను అందించి అనీమియా బారిన పడకుండా చేస్తాయి. సమృద్ధిగా పోషకాలను అందించే కళ్లకింపైన రంగులున్న కూరగాయలు గుండె జబ్బులను, మానసిక వత్తిడి, డిజార్డర్స్ వంటి సబ్బుల నుంచి రక్షణనిస్తాయి. ఇంకా క్యాన్సర్‌ను నిరోధించే లక్షణాలు కూడా వీటిలో ఉన్నాయి. ఇక పళ్ల విషయానికొస్తే బొప్పాయి, అరటిపండు, సపోటాల్లో ఐరన్, పొటాషియం, విటమిన్ 'ఇ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మానికి నిగారింపునిచ్చి యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.

సోయాబీన్స్:
ఇవి హార్మోన్ ఇంబాలెన్స్‌ను అరికడుతుంది. బ్రెస్ట్, పేగు, ఉదర క్యాన్సర్ల నివారణకు ఉపయోగపడతాయి. వయసు పైబడనీయకుండా ఇందులో ఉన్న సైటిక్ యాసిడ్స్ ఉపయోగపడతాయి. హార్ట్, అల్జీమర్ జబ్బులను, ఈస్ట్రోజన్‌ను అరికడుతుంది. మెనోపాజ్ దశను దరిచేరకుండా నిరోధిస్తుంది.

బెర్రీస్:
స్ట్రాబెర్రీస్, నల్లద్రాక్ష, బ్లూబెర్రీస్, నేరేడు పండ్ల వంటి వాటిలో సైటో కెమికల్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ నిరోధకశక్తిని కలిగి ఉంటాయి. నేరేడుపండ్లలో విటమిన్ ఎ, సి ఉంటాయి. ఇవి చక్కెరవ్యాధిని నిరోధిస్తాయి. వీటిలో అరుగు దలను పెంచే గుణాలు కూడా ఉన్నాయి.

టమాటా:
అధిక రోగనిరోధకశక్తి గల కూరగాయ టమాటా. ఇది గుండె సంబంధిత వ్యాధులను, ఉదర, నోటి, పేగు క్యాన్సర్లను అరికడుతుంది. ఇందులో 'ఎ, 'ఇ విటమిన్లు ఎక్కువగా ఉండడం వల్ల కళ్లకు, చర్మానికి చాలా మంచిది. టమాటాను బ్యూటీపార్లర్‌లో ఫేస్ మాస్కుల్లో కూడా ఉపయోగిస్తారు.

పుచ్చకాయ:
పుచ్చకాయ చర్మ సౌందర్యానికి చాలా మంచిది. ఇందులో ఎ, బి, సి విటమిన్‌లు పుష్కలంగా ఉండి చర్మాన్ని పునరుజ్జీవింప చేస్తాయి. గింజల్లో ఉన్న సోడియం, జింక్, విటమిన్-ఇ గుణాలు యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.

కూరగాయలు ఎక్కువగా ఉడికిస్తే అందులో ఉన్న పోషకాలు, ఖనిజాలు నష్టపోతాం:
తినే ఆహారాలను అధికంగా ఉడికించడంలో వాటిలో ఉండే న్యూట్రీషియన్స్ మరియు ఇతర పోషకాంశాలు కోల్పోవడం జరుగుతుంది. దాంతో మీకు పూర్తి పోషకాంశాలు అందవు. దాంతో మీరు సంత్రుప్తి చెందక జంక్ ఫుడ్ మీద కోరిక కలుగుతుంది. మరియు మీరు తీసుకొనే ఆహారం చాలా వరకూ పచ్చికూరలను సుషి, సలాడ్స్ , గ్రిల్డ్ వెజిటేబుల్స్, గ్రిల్ లేదా బేక్ చేసిన మాంసాహారం, చేపలు వంటివి తినడానికి ప్రయత్నించండి. మైక్రోవేవ్ ను నివారించండి.

కొకోవా:
ఇందులో ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా ఉండి ఆరోగ్యవంతమైన రక్త ప్రసరణకు సహకరిస్తాయి. లో, హై బ్లడ్‌ప్రెషర్స్‌ను నివారిస్తుంది. దీన్ని కేకుల్లో, మిల్క్‌షేక్స్‌లో వాడడం మంచిది. ఇక చాక్లెట్స్ అయితే బిట్టర్ చాక్లెట్స్ ఉపయోగించాలి. ఇతర చాక్లెట్లలో ఉన్న ఫాట్ ఇందులో ఉండకపోవడం వల్ల ఇవి అందాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి.
ఇక్కడ ఇచ్చిన ఆహారపు సూత్రాలన్నీ పాటిస్తే ఇంతకు మించిన ఆరోగ్య, సౌందర్య సాధనాలు ఇక వేరే ఏమీ ఉండవనేది మీరే గ్రహిస్తారు. ఇవి కాకుండా కొద్దిపాటి వ్యాయామం సరిపోతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజే ఈ ఆరోగ్య సూత్రాల్ని పాటించి నవయవ్వనం సొంతం చేసుకోండి మరి.

ఎండుఫలాలు:
బాదం, పిస్తా, జీడిపప్పుల్లో విటమిన్ ఇ, ఐరన్, పొటాషి యమ్, జింక్, ఒమెగా-3ఫాటీ ఆసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ శరీర సౌందర్యాన్ని పెంచేవి. ఇందులో ఉండే నూనెలో ముఖం కాంతివంతంగా కనిపించడానికి ఉపకరిస్తాయి.

నీళ్లు-పళ్లరసాలు:
శరీరం మెరుస్తూ ఉండాలంటే రోజూ ఎంత ఎక్కువ నీరు తాగితే అంత మంచిది. ఒకటి, రెండు కూరగాయల, లేదా పళ్లరసాలు తీసుకోవడం చాలా మంచిది. సొరకాయ, దోసకాయ, ఆరెంజ్, బత్తాయి, నిమ్మరసం చాలా మంచిది. కొబ్బరి నీళ్లలో కూడా అందాన్ని పెంచే గుణాలు అధికం.

పెరుగు-తేనె:
పెరుగులో చలువ చేసే గుణం ఉంటుంది. ఇది అరుగుదలను మెరుగుపరిచే ఆహారం. తేనె శక్తినిచ్చే ఔషధం. తేనె వత్తిడిని తగ్గించడమే గాక మతిమరుపును కూడా అరికడుతుంది.



Click it and Unblock the Notifications