Latest Updates
-
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.!
శీతాకాలంలో చర్మ రక్షణకు: 10 టాప్ టిప్స్
శీతాకాలంలో చల్లనిగాలులు ఆహ్లాదంగా చలికాలపు వాతావరణం చర్మం మీద ప్రసరించి చర్మ సౌందర్యానికి హాని కలిగిస్తుంది. ముఖ్యంగా పెదవులు, ముఖం, చేతులు, పాదాల మీద చలిగాలి ప్రభావం తీవ్రంగా వుంటుంది. చర్మం పొడారిపోయినట్లు అవటమేకాక, దురద కూడా వుంటుంది. పెదాలు పగులు తాయి. ముఖం మీద చెమటపొక్కులు ఏర్పడతాయి. పాదాల చివర పగుళ్లు వస్తాయి. చర్మానికి ఏర్పడే యిటువంటి మార్పుల వల్ల చర్మపు సౌందర్యానికి అవరోధం కలిగి చర్మం బిరుసెక్కి ముఖం అందవికారంగా కనిపిస్తుంది. అయితే శీతాకాలమంతా అందవికారంగా వుండక తప్పదా అని బాధపడవలసిన అవసరం లేదు. చలికాలంలో చర్మాన్ని సంరక్షించేం దుకు చర్మసౌందర్యాన్ని కాపాడేందుకు మార్కెట్లో ఎన్నెన్నో సౌందర్య సాధనాలు లభిస్తున్నాయి. వాటి నుపయోగించి వాతావరణ ప్రభావం చర్మంమీద ప్రసరించ కుండా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు.
శీతాకాలములో చర్మ సంరక్షణ చాలా ముఖ్యము . ఒక్కొక్క కాలములో ఒక్కక్క రీతిలో మన చర్మాన్ని రక్షించుకుంటూ ఉండాలి . కాలానుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి . ఎండకాలములో ఒకరకమైన జాగ్రతాలు , వర్షాకాలములో వేరేవిధమైన చిట్కాలు.. శీతాకాలములో ప్రత్యేకమైన చర్యలు తీసుకోవలసిన అవసరము ఉంటుంది .
చలికాలమనేది చర్మ సంరక్షణ కు అధికప్రాధాన్యత ఇవ్వవలసిన కాలము . ప్రత్యేకించి ముఖ సౌందర్యాన్ని కాపాడుకోడానికి తగినంత సమయము వెచ్చించ వలసిన కాలమిది . ముఖానికి మాయిశ్చరైజర్ వాడాలి . డ్రై స్కిన్ ఉన్నవారు మరింత జాగ్రత్తగా మెలగాలి . చలి కాలం వచ్చేస్తోందంటే మహిళలు అన్నింటికంటే ముందుగా పొడిబారిపోయే చర్మం గురించే భయపడుతుంటారు. గాలిలో తేమ చలికాలంలో బాగా తగ్గిపోతుంది కాబట్టి చర్మం కూడా ఈ సీజన్‌లో పొడిబారిపోతూ ఉంటుంది. జిడ్డు చర్మం ఉన్నవారికి అంత ప్రమాదం లేదు కాని పొడి చర్మం కలవారు.. సాదా చర్మం కలవారు చలికాలంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవలసిందే మరి.
స్నానం చేయడం, రాత్రిపూట చలిపులి నుంచి చర్మాన్ని ముఖ్యంగా పెదవులను కాపాడుకోవడం, శిరోజాల నిగనిగలు తగ్గిపోకుండా జాగ్రత్తపడటం, సరైన ఆహారం తీసుకోవడం... ఇలా చలికాలం మహిళల చర్మసౌందర్యానికి అన్నీ సమస్యలే మరి. ఈ క్రింది జాగ్రత్తలను అనుసరించడం ద్వారా చలికాలంలో చర్మం సంరక్షణ చాలా సులభం....

10టాప్ టిప్స్ : వింటర్ స్కిన్ కేర్
వేజలిన్ లేదా పెట్రోలియం జెల్లీలు వాడాలి: వేజలిన్ బాడీలోషన్ లేదా ఏ ఇతర బాడీ లోషన్ అయినా రాసుకొని గోరు వెచ్చని నీటి స్నానం చేస్తే శరీరం మృదువుగా ఉంటుంది.

10టాప్ టిప్స్ : వింటర్ స్కిన్ కేర్
టాల్కం పౌడర్లు , ప్యాన్కేక్ పౌడర్లు వాడకూడదు:ఏదైనా బేబీ పౌడర్ లు వాడడం మంచిది . నువ్వుల నూనె చలికాలం లో చక్క గా పనిచాస్తుంది . శరీరానికి నూనె పట్టించి సున్ని పిండితో వేడి నీరు స్నానం చేస్తే చర్మం సున్నితమవుతుంది .

10టాప్ టిప్స్ : వింటర్ స్కిన్ కేర్
ఫేస్ క్రీమ్: ఉదయం గోరువెచ్చని నీటితో స్నానము చేసిన తర్వాత తప్పనిసరిగా ముఖానికి క్రీమ్ రాసుకొవాలి . విటమిన్ ఇ ఉన్న క్రీములు వాడడం మంచిది .

10టాప్ టిప్స్ : వింటర్ స్కిన్ కేర్
వాజలైన్: శీతాకాలము పగుళ్ళకు వేసలైన్ వాడాలి, లైట్ మాయిశ్చరైజర్ కి బదులు థిఖ్ క్రీమ్ ను ఉపయోగించాలి.

10టాప్ టిప్స్ : వింటర్ స్కిన్ కేర్
కొబ్బరి నూనె: స్నానము చేసే నీటిలో కొద్దిగ కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ చుక్కలు వేసి వేడినీల్లస్నానము చేయాలి .ఇది శరీరం మొత్తానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది .

10టాప్ టిప్స్ : వింటర్ స్కిన్ కేర్
సబ్బులు: సాదారణ సబ్బుకు బదులు గ్లిజరిన్ సబ్బులు వాడాలి.

10టాప్ టిప్స్ : వింటర్ స్కిన్ కేర్
మాయిశ్చరైజర్ : రాత్రి పడుకునే ముందు చేతులకు , కాళ్ళకు వేజలైన్ రాసుకోవాలి.

10టాప్ టిప్స్ : వింటర్ స్కిన్ కేర్
హాట్ ఆయిల్ మసాజ్: వారానికు ఒకసారైన హాట్ ఆయిల్ తో మసాజ్ చే్సుకోవాలి ,

10టాప్ టిప్స్ : వింటర్ స్కిన్ కేర్
పాదాలు పగల కుండా 'సాక్స్ ' వేసుకుంటే మంచిది.

10టాప్ టిప్స్ : వింటర్ స్కిన్ కేర్
తగిననన్నీ నీళ్ళు త్రాగడం : చలికాలం పొడవునా వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి వేసవిలోలా నీరు పదే పదే తాగాలనిపించదు. పైగా గాలిలో తేమ తక్కువ కాబట్టి శరీరం నుంచి బయటకు వెళ్లే నీటి శాతం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీంతో చర్మం మరింతగా పొడిబారి పోవడమూ తప్పదు. చలికాలంలో మహిళలు ఎన్ని జాగ్రత్తలు పాటించినా, ఎన్ని క్రీములు రాసుకున్నా, పేషియల్స్ వాడినా తగిన మోతాదులో నీరు తాగకపోతే మాత్రం చర్మానికి ప్రమాదమేనని ఫిట్‌నెస్ నిపుణులు హెచ్చిరిస్తున్నారు.



Click it and Unblock the Notifications
