Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
మీ చర్మం రఫ్ గా ఉందా?టాప్ 5 స్కిన్ కేర్ టిప్స్
సాధారణంగా కొంత మందికి చర్మం నునుపుగా ఉంటే, మరికొందరికి చర్మ రఫ్ గా ఉంటుంది. రఫ్ గా మరియు పొడిగా ఉండే చర్మం చూడటానికి ఇబ్బందికరంగా ఉంటుంది . ఇటువంటి చర్మంను చూపించడానికి ఏఒక్కరూ ఇష్టపడరు. చర్మం రఫ్ గా మరియు పొడిగా మారడానికి ముఖ్య కారణం సూర్య రశ్మి మరియు కాలుష్యం, వాతావరణ ఉష్ణోగ్రత మరియు వాతవరణంలో కండిషన్, డీహైడ్రేషన్ ఇంకా చర్మ సంబంధిత వ్యాధులు . రఫ్ స్కిన్ వల్ల చర్మం ప్యాచులుగా ఏర్పడుతుంది మరియు పొరగా మారుతుంది, పగుళ్ళు ఏర్పడుతాయి, చర్మం మొత్తం ఎర్రగా ఏర్పడుతుంది
రఫ్ స్కిన్ ప్యాచులకు ఒక సాధారణ ప్రదేశం మోచేతులు, మోకాళ్ళు, పాదాలు మరియు బుగ్గలు. రఫ్ స్కిన్ కోసం తగిన స్కిన్ కేర్ తీసుకోవడం మరియు చర్మం స్ట్రక్చర్ ను మార్చుకోవడం చాలా అవసరం.
ఈ ఆర్టికల్లో రఫ్ స్కిన్ కోసం కొన్ని ఎఫెక్టివ్ స్కిన్ కేర్ టిప్స్ ఉన్నాయి. ఈ స్మూత్ మరియు సాఫ్ట్ స్కిన్ కోసం ఈ చిట్కాలను తప్పనిసరిగా అనుసరించాల్సిందే..

మాయిశ్చరైజర్:
రఫ్ స్కిన్ కోసం చాలా రీహైడ్రేషన్, డ్రై స్కిన్ కోసం సరైజ జాగ్రత్తలు తీసుకోవాలి . రఫ్ స్కిన్ కోసం పాలు మరియు క్రీమ్ మిశ్రమంతో తాయరుచేసిన మాయిశ్చరైజర్ ను తప్పకుండా ఉపయోగించాలి. ఇది రఫ్ స్కిన్ కు మంచి ఫలితాన్నించే త్వరగా ఉపశమనం కలిగించి స్కిన్ క్వాలిటీ పెంచతుంది. అందుకు ఒక మంచి క్వాలిటీ ఉన్న నేచురల్ మాయిశ్చరైజర్ ను ఉపయోగించాలి.

స్కిన్ స్ర్కబ్బింగ్:
రఫ్ స్కిన్ అనేది డెడ్ స్కిన్ సెల్స్ వల్ల ఏర్పడుతుంది మరియు సెల్ డ్యామేజ్ వల్ల కూడా రఫ్ స్కిన్ ఏర్పడుతుంది కాబట్టి వారానికి కొకసారి స్ర్కబ్బింగ్ ఉపయోగించి 10-15 తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. స్క్రబ్బింగ్ తర్వాత మన్నికైన మాయిశ్చరైజ్ ను అప్లై చేయాలి. దాంతో చర్మం తేమగా మరియు సాఫ్ట్ గా మారుతుంది.

సోపును ఉపయోగించకండి:
సోపులో అనేక రసాయనాలు ఉంటాయి. అవి మీ చర్మాన్ని మరింత డల్ గా మరియు డ్రై గా మార్చుతాయి. ముఖ్యంగా ముఖానికి హాని కలిగిస్తాయి. కాబట్టి సోపులను ఉపయోగించడం అవాయిడ్ చేయండి. వాటికి బదులుగా ఫేష్ వాష్ లను ఉపయోగించండి .

ఒత్తిడి తగ్గించుకోవలి:
ఒత్తిడి కూడా అనేక చర్మ సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి, ఆరోగ్యకరమైన చర్మం సంరక్షణకోసం, అధిక ఒత్తిడికి గురికాకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. స్పా అపాయింట్మెంట్ తీసుకిని స్కిన్ క్వాలిటీని పెంచుకోవాలి. రెగ్యులర్ గా వ్యాయామం, యోగ వంటి వాటిని ప్రాధాన్యత కల్పించాలి . ఒత్తిడి లేకుండా సంతోషంగా గడపాలి.

హెల్తీ ఫుడ్:
హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల మంచి ఫలితం ఉంటుంది. రఫ్ స్కిన్ నివారించబడుతుంది . తాజా పండ్లు, కూరగాలయను తింటూ తగినంత నీరు త్రాగాలి. డ్రై స్కిన్ అనేది ప్రధానంగా డీహైడ్రేషన్ వల్లే వస్తుంది .



Click it and Unblock the Notifications