Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
ముఖం మీద ముడుతలను శాశ్వతంగా మాయం చేసే అలోవెరా జెల్
ప్రకృతిలో లభించే మూలికలతో, చెట్లతో ఎన్నో వ్యాధులను దూరం చేసుకునే అవకాశం మానవునికి లభించింది. ఇందులో కలబంద ఒకటి. వ్యాధి నిరోధకశక్తిని పెంపొందించే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. విటమిన్స్, ఎంజైమ్స్, మినరల్స్‌ల మిశ్రమం కలబంద. రోజూ కలబందను తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధకశక్తి బలపడుతుంది. తద్వారా వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. అలొవెరాను జెల్, జ్యూస్, పిల్స్ టాబ్లెట్స్ రూపంలో తీసుకోవచ్చు. ఇంకా కలబందతో ఏమేమి ప్రయోజనాలో తెలుసుకుందాం.
చూడటానికి ముళ్ళ మొక్కలా ఉంటుంది. అలోవెరా జెల్ ఉపయోగాలు అన్ని ఇన్ని కావు . చర్మ సంరక్షణ విషయంలో ఇది అద్భుతంగా పని చేస్తుందంటారు సౌదర్యనిపుణులు. చర్మ సంరక్షణ, ర్యాషెస్, కోతలు, గాయాలు, చర్మం కమిలిపోవటం మొదలగువాటికి అలోవెరా మంచి మెడిసినన్ అని అందరికి తెలిసిందే. అలోవెరా సహజసిద్ధమైన మాయిశ్చరైజర్. పోడిచర్మంతో బాధపడేవారు తరుచుగా అలోవెరా ఆయిల్ రాస్తుంటే చర్మం మృదువుగా మెత్తగా అవుతుంది. వాతావరణ కాలుష్యం కారణంగా మన చర్మం అనేక రకాల విషపదార్ధాల ప్రభావానికి గురవుతుంది. అలోవెరా జెల్ వాటి బారి నుంచి చర్మాన్ని పరిరక్షించి ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాదు అయితే అలోవెరా జ్యూస్ తాగితే వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు మరింత అధికం. ఎంతో సురక్షితం. ఈజ్యూస్ లో వివిధ పోషకాలు, విటమిన్లు, మినరల్స్, ఎమినో యాసిడ్స్ వంటి పోషకాలెన్నో వుంటాయి. ఇది జెల్ , ఆయింట్మెంట్ , లోషన్ ల రూపం లో అటు సౌందర్య సాధనం గా ఇటు ఔషధం గా దీని వాడుక విపరీతం గా పెరిగింది.

స్కిన్ ఎలాసిటి పెంచుతుంది: అలోవెరా జెల్ ను చర్మానికి అప్లై చేస్తే మీ ఫేషియల్ స్కిన్ లో ఫ్రైబ్రో బ్లాస్ట్ సెల్ మెరుగుపడి, చర్మం కాంతిని పెంచి కొల్లాజెన్ సెల్స్ పెరిగి స్కిన్ ఎలాసిటిని పెంచుతుంది.
చర్మానికి పోషణను అందిస్తుంది: బాగా ముడతలు పడిన చర్మానికి అలొవెరా జెల్ ను అప్లై చేయడం వల్ల చర్మానికి అవసరం అయ్యే మినిరల్స్ మరియు విటమిన్స్ పుష్కలంగా అందుతాయి. ఇది చర్మానికి తగినంత పోషణను అందివ్వడంతో పాటు మొత్తం చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది . అందువల్లే మీ చర్మం పూర్తిగా స్మూత్ గా మరియు పోషణ కలిగి ఉంటుంది.
ఆస్ట్రిజెంట్ గా పనిచేస్తుంది: బ్యూటీ ప్రొడక్ట్ అయినటువంటి అలోవెరాను మీ చర్మానికి అప్లై చేసినప్పుడు అది ఆస్ట్రిజెంట్ గా పనిచేస్తుంది మరియు డెడ్ స్కిన్ సెల్స్ ను మెరుగుపరుస్తుంది. మరియు ఇది స్కిన్ స్ట్రక్చర్ ను మెరుగుపరుస్తుంది.
టోనర్ గా పనిచేస్తుంది: అలొవెరా జెల్ ను చర్మానికి అప్లై చేయడం వల్ల ఇది టోనర్ గా పనిచేయడంతో పాటు, చర్మానికి పోషణ అందిస్తుంది. ఇది మొత్తం స్కిన్ స్ట్రక్చర్ ను మెరుగుపరుస్తుంది మరియు ముడుతలను తగ్గిస్తుంది. అలోవెరా చర్మాన్ని నునుపుగా మార్చుతుంది. అదే సమయంలో సాఫ్ట్ గా మరియు కాంతివంతమైన చర్మాన్ని మీరు పొందవచ్చు.
కళ్ళ క్రింద ముడుతలను నివారిస్తుంది: ప్రతి రోజూ రాత్రి పడుకొనే ముందు కళ్ళక్రింది అలోవెరా జెల్ ను అప్లై చేయడం వల్ల ముడుతలను నివారించవచ్చు. ముడుతలు అధికంగా ఉన్నవారికి ఇది ఒక ఉత్తమ ట్రీట్మెంట్ గా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ ఇ, ఎ మరియు సిలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది చర్మానికి తగినంత పోషణను అందిస్తుంది. చర్మం యొక్క స్థితిని మెరుగుపరుస్తుంది. కళ్ళలోకి పడకుండా అప్లై చేయాలి.
విటమిన్ ఇ: అలోవెరా జెల్ ను విటమిన్ ఇ మరియు సోయ్ లెస్స్తిన్ తో జోడించాలి. ఇప్పుడు దీన్ని హీట్ చేయాలి తర్వాత 1/3వంతు బీవాక్స్ మరియు ఆలివ్ ఆయిల్ తో మిక్స్ చేయాలి. అలాగే మీరు బాదం నూనె లేదా జోజోబా ఆయిల్ మిక్స్ చేయవచ్చు. ఈ మిశ్రమం లేదా లోషన్ ముడుతలను శాశ్వతంగా నివారించడానికి సహాయపడుతుంది.
కలబంద చర్మాన్ని తెల్లగా మార్చుతుంది. మరియు కలబందను సరిగా ఉపయోగించడం వల్ల సన్ టాన్ మరియు హైపర్ పిగ్మెటేషన్ విజయవంతంగా తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు. కలబందలో, చర్మాన్ని చాలా చల్లదనాన్ని అంధించడంతో పాటు చర్మంలో చైతన్యం మరియు తేమను నింపడానికి సహాయపడుతుంది.
"కలబంద జెల్ వృద్ధాప్య ప్రభావం వల్ల వచ్చే, ముడుతలు, పొడి చర్మం మొదలగు సమస్యలనుండి మిమ్మల్ని రక్షిస్తుంది. కాబట్టి మీ పెరట్లో ఒక కలబంద మొక్కను నాటికొని ప్రయోజనం పొందడం వల్ల ఎంత లాభమే మీకే తెలుస్తుంది. ఇది వయోరహిత చర్మం పొందడానికి ఈ కలబందను ఉపయోగించండి.



Click it and Unblock the Notifications
